Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
నవ దంపతులకు మూడ్రోజులు బాత్రూమ్ బంద్, అక్కడి సాంప్రదాయం అలాగే ఉంటుంది మరి!
ప్రపంచంలో చిత్ర విచిత్రమైన సాంప్రదాయాలు చాలానే ఉన్నాయి. కొన్నింటి గురించి తెలుసుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తే.. మరికొన్నింటి గురించి తెలుసుకుంటే ఇదేం పద్ధతిరా నాయనా అనిపిస్తుంది. అలాంటి ఓ విచిత్ర సాంప్రదాయాన్ని ఇండోనేషియాలోని ఓ సమాజం వారు పాటిస్తున్నారు.

సాధారణంగా రోజుకు ఎన్నిసార్లు బాత్రూమ్ కు వెళ్తారు. అందరూ రోజూ వెళ్తారు. మరి ఒక్కరోజు ఆపుకుంటే ఏమవుతుంది. ఏమవ్వడం ఏంటి.. అసలు ఉండలేము, పొట్ట పగిలిపోతుంది అంటారా. కానీ ఇండోనేషియాలోని ఓ సమాజంలో బాత్రూమ్ కు వెళ్లకుండా మూడ్రోజులు ఉండాల్సిందే. పెళ్లి చేసుకున్న నవ దంపతులు మూడ్రోజుల పాటు బాత్రూమ్ వెళ్లడానికి కుటుంబసభ్యులు అనుమతించరు.
కఠినమైన ఆచారం, సో.. ఆపుకోవాల్సిందే:
ఈ కఠినమైన ఆచారాన్ని ఇండోనేషియాలోని టిడాంగ్ సమాజం ప్రజలు శతాబ్దాలుగా అనుసరిస్తున్నారు. ఈ సమాజంలోని ప్రజలు ఈ ఆచారాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తారు. టిడాంగ్ తెగ ప్రజలు సాంప్రదాయాలు తూచా తప్పకుండా పాటిస్తారు. ఇలా మూడ్రోజుల పాటు బాత్రూమ్ కు వెళ్లకుండా ఉంచడం కూడా హ్యాపీగా పాటిస్తారు.
అదృష్టం తెస్తుందని నమ్మకం:
ఈ ఆచారం దంపతులకు అదృష్టాన్ని తీసుకువస్తుందని టిడాంగ్ ప్రజలు నమ్ముతారు. దంపతులు బాత్రూమ్ వాడకుండా మూడ్రోజులు ఉండగలిగితే.. ఆ దంపతులు తమ వివాహ జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సవాళ్లను అధిగమనించగలరని వారు విశ్వసిస్తారు. దంపతుల మధ్య బంధం బలపడేందుకు ఈ ఆచారం దోహదపడుతుందని కూడా వారు నమ్ముతారు.
మూడ్రోజులు బాత్రూమ్‌కు వెళ్లకుండా ఎలా ఉంటారు?
ఆచారం ప్రకారం పెళ్లైన రోజు నుంచి మూడ్రోజులు బాత్రూమ్ కు వెళ్లొద్దు. వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా ఆపుకోవాల్సిందే. మూడ్రోజుల పాటు బాత్రూమ్ కు వెళ్లకుండా ఉండటం సాధ్యమేనా అనిపించవచ్చు. అయితే ఈ మూడ్రోజుల పాటు ఆ నవ దంపతులు అతి తక్కువ ఆహారం మాత్రమే ఇస్తారు. అలాగే దాహం వేసినా చాలా కొన్ని నీటిని మాత్రమే అందిస్తారు. మల, మూత్రాలు రానంత తక్కువ పరిమాణంలో ఆహారాలు ఇవ్వడం వల్ల కొద్దిగా ఓపిక పట్టైనా సరే మూడ్రోజులు బాత్రూమ్ కు వెళ్లకుండా ఉంటారు.
మూడ్రోజులు ముగిసిన తర్వాత నవ దంపతులు గదిలోంచి బయటకు వస్తారు. అప్పటి నుంచి వాళ్లు సాధారణ జీవితం గడపవచ్చు. ఇష్టమైనవి తినొచ్చు, తాగొచ్చు. అత్యంత కఠినమైన సవాలును ఎదుర్కొని గెలిచొచ్చిన తర్వాత విందులు, వినోదాలతో ఎంజాయ్ చేస్తారు.



Click it and Unblock the Notifications
