Latest Updates
-
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు!
ఇంట్లో వాళ్లు చనిపోతే బతికున్న వారి చేతివేళ్లు కట్ చేస్తారు, భయంకరమైన ఈ ఆచారం ఎక్కడంటే..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని కులాలు, తెగల ఆచారాలు తెలుసుకుంటే జడుసుకోవాల్సిందే. కొన్ని ఆచారాల గురించి వింటే వామ్మో అనాల్సిందే. పట్టణాలకు దూరంగా అడవుల్లో, కొండలపై నివసించే గిరిజన తెగలు ఈ ఆధునిక యుగంలో కూడా పురాతన ఆచారాలను పాటిస్తుంటారు. అవి శారీరకంగా, మానసికంగా ఎంత నొప్పిని కలిగించినా.. సాంప్రదాయాలను పాటించడానికే మొగ్గు చూపుతుంటారు.
అలాంటి ఓ విచిత్రమైన భయంకరమైన ఆచారం ఏంటంటే.. కుటుంబసభ్యుల్లో ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లోని మహిళల చేతి వేళ్లు కట్ చేస్తారు. ఈ ఆచారాన్ని ఇండోనేషియాలోని డాని తెగ ప్రజలు ఇప్పటికీ పాటిస్తున్నారు.

సంతాపం తెలియజేయడానికి గుర్తుగా..:
ఇండోనేషియా వెస్ట్ పాపువాలోని ఎత్తైన ప్రాంతాల్లో ఈ డాని తెగ ప్రజలు నివసిస్తుంటారు. ఇక్కడి తెగ వారు ప్రత్యేకమైన సంస్కృతికి ఇండోనేషియాలో బాగా ప్రసిద్ధి చెందారు. డాని తెగ జీవన శైలి చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడి ప్రజల వస్త్రాధారణ కూడా ఇతర తెగలతో పోలిస్తే విచిత్రంగా ఉంటుంది.
అయితే డాని తెగకు చెందిన వ్యక్తి మరణిస్తే వారి దగ్గరి బంధువులు, కుటుంబసభ్యులు చేతి వేళ్లను కొంత భాగం నరికివేసుకుంటారు. మరణించిన వారి పట్ల సంతాపం తెలియజేయడానికి గుర్తుగా ఇలా చేతి వేళ్లను సమర్పిస్తుంటారు. మరణించిన వ్యక్తి నొప్పి, బాధలను ఇలా వేలు కత్తిరించుకోవడం ద్వారా దూరం చేస్తారని ఈ తెగ ప్రజల విశ్వాసం. ఇలా చేయడం వల్ల మరణించిన వారి ఆత్మ రక్షణగా ఉంటుందని నమ్ముతారు.
వేలు కత్తిరించడం వందల ఏళ్ల నాటి ఆచారం:
ఈ వేలు కత్తిరించడం అనే ఆచారం ఈనాటిది కాదు. వందల ఏళ్ల క్రితం నుంచి డాని తెగ వాసులు ఈ ఆచారాన్ని పాటిస్తున్నట్లు వారు చెబుతున్నారు. చనిపోయిన వారికి సంతాపం తెలియజేసేందుకు ఇలా చేస్తామని అంటున్నారు.
అయితే ఇటీవలి కాలంలో వేళ్లు కత్తిరించే ఆచారం కొంత తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. సగం వేళ్లతో రోజూ వారి కార్యకలాపాలు చేసుకోలేకపోవడం, ఆరోగ్య సమస్యలు ఎదురవ్వడం, ఇండోనేషియా ప్రభుత్వం విధించిన నిషేధం వల్ల కూడా వేళ్లు కత్తిరించే ఆచారాన్ని పాటించే వారి సంఖ్య తగ్గిందని స్థానికులు చెబుతున్నారు. అయితే వయస్సు పైబడిన వారు, వృద్ధులు ఇప్పటికీ ఈ ఆచారాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు తెలిపారు.



Click it and Unblock the Notifications
