Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పాము విషం మందుల తయారీలోనే కాదు.. ఇలా కూడా ఉపయోగిస్తారు..!!
పాము విషం అంటే చాలామంది సహజంగానే భయం ఉంటుంది. పాము కనబడగానే అది ఎక్కడ కాటువేస్తుందోనని పరుగులు పెడతారు. పొలాల్లో కొన్ని సందర్భాల్లో రైతులను కాలు వేయడం వల్ల వాళ్లు అక్కడికక్కడే చనిపోతారు. అయితే పంటలో ఎలుకలను తినడానికి పాములు రైతులకు పరోక్షంగా సహాయం పడుతున్నాయ్. పాము విషం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయ్. ఔషధాల్లో పాము విషాన్ని ఉపయోగిస్తారన్న విషయం మనకు తెలిసిందే. ఇంకా ఏయే ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.

పాము విషంలో బలమైన న్యూరోటాక్సిన్ లేదా హేమోటాక్సిన్ కలిగి ఉంటుంది దీంతో అనేక ప్రయోజనాలను మనకు అందిస్తుంది. ఈ హేమోటాక్సిన్ వల్లే పాము విషానికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
పార్కింసన్ వ్యాధిని నియంత్రించడంలో పాము విషం బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇది న్యూరో ట్రాన్స్‌మిటర్ డోపామిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. విషం లోని కొంత రసాయనాలు ఆస్టియో ఆర్థ్రిటిస్ బాధపడుతున్నవారికి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
కొన్ని విషపు ప్రోటీన్‌లు క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని అవి మరింత వ్యాప్తి చెందకుండా చేస్తాయ్.
పాము విషం నుండి ఉత్పత్తి చేసిన కొంత మందులు తీవ్రమైన నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. విషంలో ఉండే కొన్ని ఎంజైమ్‌లు రక్తం గడ్డ కట్టడాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. విషం నుండి ఉత్పత్తి చేసే కొన్ని మందులు హైపర్ టెన్షన్‌ను తగ్గించడంలో సహాయపడతాయ్.
పాము విషం నుంచి ఉత్పత్తి చేసే కొన్ని మందులను పొలాల్లో చల్లడం వల్ల పంట పురుగుపట్టకుండా ఉంటుంది. పాము విషం న్యూరోసైన్స్ లో నాడీ వ్యవస్థపై పరిశోధనలు చేయడానికి ఉపయోగపడుతుంది. విషం లోని రసాయనాలు జీవ రసాయన శాస్త్ర పరిశోధనలకు బాగా పనికి వస్తాయి.
పాము విషం ద్వారా కొత్త ఔషధాలు, చికిత్సలు అభివృద్ధి చేయబడతాయి.పాము విషం మరింత పరిశోధనలకు, వైద్యశాస్త్రం మరియు బయోటెక్నాలజీ రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు దారితీయవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం, జీవశాస్త్రం లో ఇంకా అనేక మార్గాలలో విషాన్వి వినియోగించవచ్చు.
పాము విషం వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇది బలమైన రసాయనాలు కలిగి ఉండటం వలన అది అనుకోని పర్యవసానాలకు దారితీస్తుంది. దీనిని తగిన మోతాదులో జాగ్రత్తగా వాడడం మంచిది.
పాము విషం లోని రసాయనాలు, ఎంజైమ్‌లు వైద్య, సాంకేతిక రంగాల్లో అనేక ప్రయోజనాలను అందిస్తాయి. భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలకు, కొత్త ఆవిష్కరణలకు దారితీయవచ్చు. పాము విషం తో మనకు అందుబాటులో ఉన్న అన్ని సమస్యలను తీర్చుకునే ప్రయత్నం చేయాలి.



Click it and Unblock the Notifications