Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Latest Update: మా ఇంట్లో గొడవలకు కారణం ఆవిడే.. తేల్చి చెప్పిన మోహన్ బాబు..
సీనియర్ టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఇంట్లో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య మొదలైన ఈ గొడవలు మొత్తం ఇండస్ట్రీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్నాయి. అయితే అసలు మోహన్ బాబు ఇంట్లో గొడవలకు కారణం ఏంటి? ఎందుకు ఈ గొడవలు మొదలయ్యాయి? దీని నుంచి ఇతర వ్యక్తులు నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అనే విషయాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మోహన్ బాబు ఇంట్లో గొడవలకు కారణం ఏంటంటే?
మోహన్ బాబు ఇంట్లో గొడవలకు మంచి మనోజే కారణమని తెలుస్తోంది. మంచు మనోజ్ మోహన్ బాబు దగ్గర పని చేస్తున్న ఓ వ్యక్తిని బెల్టు కొట్టబోయారట. దీంతో మోహన్ బాబు మనోజ్‌ను పక్కకు నెట్టేశారని, దీంతో మనోజ్ కూడా తన తండ్రిని పక్కకు నెట్టేశారని ఆ ఇంట్లో పని చేస్తున్న పని మనిషి వెల్లడించింది. మోహన్ బాబు దగ్గర పని చేస్తున్న ప్రసాద్ అనే వ్యక్తి కారణంగానే ఈ గొడవలు మొదలయ్యాయని ఆమె స్పష్టం చేసింది.

ఆస్తుల కోసం
మరోవైపు ఆస్తుల కోసం మంచు మనోజ్ మోహన్ బాబుతో గొడవ పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. ముగ్గురు వారసులకు మోహన్ బాబు సరైన పద్దతిలో ఆస్తి పంపకాలు చేపట్టలేదని, అందుకే మనోజ్ కోపంతో మోహన్ బాబుతో గొడవపెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మనోజ్‌పై దాడి కూడా జరిగిందని, మోహన్ బాబు దాడి చేయించారని గుసగుసలు కూడా వినిపించాయి.
క్లారిటీ ఇచ్చిన మోహన్ బాబు
ప్రతి ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉంటాయని అలానే తమ ఇంట్లో కూడా ఈ గొడవలు మొదలయ్యాయని మోహన్ బాబు వెల్లడించారు. మనోజ్ తన భార్య మాట విని గొడవలు పడుతున్నారని పేర్కొన్నారు. మనోజ్ తనపై దాడి చేయలేదని, అవి కేవలం పుకార్లు మాత్రమే అని పేర్కొన్నారు. తాను సంపాదించుకున్న ఆస్తి అని, తన ఆస్తిని ఎవరికైనా ఇచ్చుకుంటానని ఆ అర్హత తనకే ఉందని పేర్కొన్నారు. దీంతో ఆస్తి కారణంగానే ఈ గొడవలు మొదలయ్యాయనేది స్పష్టం అయ్యింది.
ఈ గొడవ నుంచి ఏం నేర్చుకోవాలంటే?
ఈ గొడవ నుంచి ఒక కుటుంబం చాలా నేర్చుకోవచ్చు. ప్రతి కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్థలు ఉంటాయి. ఆ మనస్పర్ధలు సమయస్ఫూర్తితో, ప్రశాంతగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. అంతేకాని, రచ్చకెక్కి పరువు తీసుకోకూడదు. ఇంట్లో గొడవను రోడ్డెక్కి రచ్చ చేసుకోకూడని అర్ధం చేసుకోవాలి.
ఒకరికొకరు గౌరవించుకోవాలి. కొడుకుపై తండ్రి, తండ్రిపై కొడుకు మర్యాదపూర్వకంగా గౌరవంగా వ్యవహరించాలి. ఎవరు తప్పు చేసినా చెప్పాల్సిన పద్దతిలో చెప్పి, తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయాలి. అలా కాదని ఒకరితో ఒకరు వాదులాడుకుంటే ఆ గొడవ పెద్దదవుతుందే తప్ప, సద్దుమణగదు.
తల్లిదండ్రులు అనేవారు ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలి. ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడకూడదు. అలా చేయడం వల్ల కచ్చితంగా గొడవలయ్యే అవకాశం ఉంటుంది. పెద్ద మనసుతో సంతానం మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించాలే తప్ప, వారి మధ్య సమస్యలను సృష్టించకూడదు. వీటిని పాటిస్తే కచ్చితంగా మీ ఇంట్లో మంచి వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యకరమైన సంబంధం పరిఢవిల్లుతుంది.



Click it and Unblock the Notifications