Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
సూర్యగ్రహణం సమయంలో ఈ అద్భుతాలు చూడాల్సిందే
సూర్య గ్రహణం ఒక అద్భుతం.. అలాంటి అద్భుతమైన రోజున ఆకాశంలో వాతావరణంలో అద్భుతాలు జరుగుతాయ్. ఎప్రిల్ 8న సూర్య గ్రహణం సంభవించనున్న విషయం తెలిసిందే. పిల్లలతో పాటు ఆస్ట్రానమీపై ఆసక్తి ఉన్నవారు సూర్యగ్రహణం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ రోజు సూర్య గ్రహణం సమయంలో వాతావరణం, ఆకాశం, మన చుట్టు పక్కల జరిగే వింత మార్పులు అద్భుతాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

"బెయిలీస్ బీడ్"
సూర్యగ్రహణం సమయంలో చండ్రుడిని గమనిస్తే చంద్రుడి చివరిలో ఒక మెరుస్తున్న నెక్లెస్ లాంటి దృష్యం కనబడుతుంది. సూర్యుడు చంద్రుడిపై వెనక నుంచి పడ్డప్పుడు సూర్యకిరణాలు చంద్రుడి కొనల నుంచి బయటకు చొచ్చుకొస్తున్నప్పుడు కనిపించే అద్భుత దృష్యమే ఈ "బెయిలీస్ బీడ్"
వాతావరణం పడిపోవడం
సూర్యగ్రహణం రోజు చంద్రుడు సూర్యుడిని కప్పడం వల్ల వాతావరణంలో మార్పులు ఒక్కసారిగా చోటుచేసుకునే అవకాశం ఉంది. చాలా ప్రదేశాల్లో ఈ స్యూర్యగ్రహణం వల్ల ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీలు పడిపోనుంది.
గాలి దిక్కు మార్పు
ఉష్ణోగ్రతలో మార్పులు మాత్రమే కాదు గ్రహణం సమయంలో గాలివీచే దిక్కు కూడా ఒక్కసారిగా మారిపోతుంది. పరిశోధనలు బట్టి చంద్రుడు స్యూర్యుడి దగ్గరికి వచ్చే సమయంలో గాలులు పడిపోతాయ్.. సూర్యుడి దగ్గరికి రాగానే గాలులు తుఫానులో పెరిగిపోతాయ్.
జంతువులు పక్షులు అయోమయం
సూర్య గ్రహణం రోజు జంతువులు పక్షులు అయోమయానికి గురౌతాయ్. చంద్రుడు స్యూర్యుడి మీదకి వచ్చే సమయంలో కొంత చీకటి పడుతుంది. అప్పుడే పక్షలకు, ఆవులు లాంటి జంతువులకు ఏమి చేయాలని తెలియక కిందపడిపోవడమే, అటు ఇటు తిరగడమో చేస్తాయ్. కొన్ని పక్షులు వెంటనే వాటి గూట్లల్లోకి వెళ్లిపోతాయ్.
బ్యాక్టీరియాల్లో మార్పులు
సూర్యగ్రహణం భూమిపైన ఉండే బ్యాక్టీరియాలపైన కూడా ప్రభావం చూపుతాయ్. 2011లో జరిగిన పరిశోధనల ప్రకారం సూర్యగ్రహణం సమయంలో బ్యాక్టీరియా సైజు ఒక్కసారిగా చిన్నగా మారిపోతుంది.
సూర్యగ్రహణ ఛాయలు
స్యూర్యగ్రహణ సమయంలో దాదాపు అందరూ ఆకాశంలో జరిగే అద్భుతాన్ని చూస్తారు. కానీ అప్పుడే నేలపై గమనిస్తే స్యూరుడు, చంద్రుడికి సంబంధించిన చాయలు విచిత్రంగా అందంగా కనబడతాయ్. చిన్ని చిన్ని రింగుల్లో కనబడే ఆ ఛాయలు చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటాయ్.
ఇతర గ్రహాలు
సూర్యగ్రహణం సమయంలో ఆకాశంలో ఇతర గ్రహాలు కూడా కనిపించే అవకాశం ఉంది. ఆకాశంలో చీకటి సంభవించినప్పుడు ఆ సమయంలో మెరుస్తూ కనిపించేవి గ్రహాలు అయి ఉండవచ్చు. వాటిని సాధారణ కళ్లతో చూడలేము.. కేవలం దానికి సంబంధించిన టెలిస్కోప్‌లతో మాత్రమే చూడగలము.



Click it and Unblock the Notifications