Latest Updates
-
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.?
Allu arjun: ఖైదీ నెంబర్ 7697..జైలులో అల్లు అర్జున్ రాత్రంతా ఏం చేశారు? ఏం తిన్నారు?
పుష్పా 2 సినిమా విడుదల సమయంలో హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన కేసులో హీరో అల్లు అర్జున్ శుక్రవారం అరెస్ట్(Allu arjun arrest) అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ని నాంపల్లికోర్టులోపోలీసులు హాజరుపర్చగా..ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అంటే ఈ నెల 27 వరకు రిమాండ్ విధించడంతో అల్లు అర్జున్ ని పోలీసులు చంచల్ గూడ జైలుకి తరలించారు. అయితే ఈ లోపు అల్లు అర్జున్ లాయర్లు హైకోర్టుని ఆశ్రయించడంతో బన్నీకి మధ్యంతర బెయిల్ లభించింది.
మధ్యంతర బెయిల్ శుక్రవారమే లభించినప్పటికీ దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తికావడం ఆలస్యం అవడంతో ఒక రాత్రంతా జైలులోనే గడిపిన అల్లు అర్జున్ శనివారం తెల్లవారుజామున చంచల్ గూడ జైలు(Chanchal guda jail) నుంచి రిలీజ్ అయ్యారు. అయితే ఒక రాత్రంతా జైలులో అల్లు అర్జున్ ఏం చేశారు..అసలు ఏం తిన్నారు అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. కాబట్టి అల్లు అర్జున్ జైలులో ఏ విధంగా గడిపారు,ఏం తిన్నారనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

జైలులో అల్లు అర్జున్ ఇలా
అల్లు అర్జున్‌ని చంచల్‌గుడ జైలులోని వీఐపీ బ్లాక్ ఉంచారు. ఆయనకు అండర్ ట్రయల్ ఖైదీగా యూటీ 7697 నంబర్ ని అధికారులు కేటాయించారు. రాత్రంతా మంజీరా బ్యారక్ లోని బ్లాక్ -1లో అల్లు అర్జున్ ని ఉంచగా తెల్లవారేదాకా అల్లు అర్జున్ నిద్రపోకుండానే గడిపినట్లు సమాచారం. జైలు అధికారులు బన్నీకి పడుకునే ముందు కొత్త రగ్గు దుప్పటి ఇవ్వగా వీటిని తిరస్కరించి అల్లు అర్జున్ సాధారణ ఖైదీలాగా నేలపైనే పడుకున్నట్లు తెలుస్తోంది. జైలు అధికారులు ఫుడ్ ఆఫర్ చేసినప్పటికీ బన్నీ దానిని తినలేదని సమాచారం. రాత్రి 8 గంటల సమయంలో మాత్రం టీ,స్నాక్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది. జైలులో ఉన్నంత సేపు అధికారులతో తప్ప ఎవరితో బన్నీ మాట్లాడలేదని తెలుస్తుంది. తనని ఎప్పుడు విడుదల చేస్తారని మాత్రమే జైలు అధికారులతో అల్లు అర్జున్ మాట్లాడినట్టు సమాచారం.
శనివారం ఉదయం 5.45 గంటలకు బన్నీని జైలు నుంచి బయటకు తీసుకువచ్చి విడుదలకు సంబంధించి ఫార్మాలిటీస్ పూర్తిచేసి ఉదయం 6.39 గంటలకు విడుదల చేశారు. ఇవాళ ఉదయం జైలు నుంచి విడుదలయ్యాక మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్.. తాను బాగానే ఉన్నానని,ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చట్టాన్ని గౌరవిస్తానని..తనకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు అని అన్నారు.



Click it and Unblock the Notifications