Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రభాస్ డైట్ : ఆరుసార్లు భోజనం, 45 గుడ్లు, ఫిష్, వెన్న మటన్..ఇంకా ఎన్నో..
బాహుబలి తరువాత ప్రభాస్ బాడీపై అనేక చర్చలు జరిగాయ్. ప్రభాస్ డైట్ సీక్రెట్స్ ఏంటి ? ప్రభాస్ రోజూ ఏం తింటాడు ? లాంటి ప్రశ్నలను చాలా మంది ఇంటర్నెట్‌లో సర్చ్ చేశారు. బాలీవుడ్‌లో అప్పటికే బాడీబిల్డ్ చేసిన సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహమ్ ఉన్నా కానీ ఇండియన్ సినిమా లవర్స్‌కు ప్రభాస్ బాడీ లుక్ ప్రత్యేక ఆకర్షణగా కనిపించింది.

మాంసాహారి
మన రెబల్ స్టార్ పూర్తిగా నాన్‌వెజిటేరియన్. మాంసం లేనిదే ముద్ద దిగదు అని చెప్పుకోవచ్చు. చికెన్ మటన్ బిర్యానీలంటే ప్రభాస్‌కు చాలా ఇష్టమట. అయితే ఎంతగా మాంసాహారో అంతే వర్కౌట్ కూడా చేస్తాడంటారు.
45 గుడ్లు
ప్రతీరోజూ 45 వరకు ఉడకబెట్టిన ఎగ్స్ తీసుకుంటాడు. ప్రభాస్ వ్యక్తిగత బాడీబిల్డ్ ట్రైనర్ లక్షణా రెడ్డి 2010లో మిస్టర్ వరల్డ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అతని అండర్‌లోనే చాలా కాలంపాటు ఫిట్‌నెస్‌ను మెయింటేన్ చేశాడు.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ఓట్స్, కూరగాయలు, ఎగ్‌వైట్‌ను తీసుకుంటాడు. రోజుకు ఆరుసార్లు భోజనం, అందులో చికెన్, చేప, కూరగాయలు ఉండాల్సిందే. వెన్నతో చేసిన మటన్, గ్రిల్ ఫిష్ అంటే చాలా ఇష్టం. భోజనానికి మధ్యలో వాల్‌నట్స్ తీసుకుంటాడు. తాను తినే ఆహారంలో అధికంగా ప్రొటీన్లు, తక్కువ మోతాదులో కొవ్వు, కార్బోహైడ్రేట్లు ఉండేలా మన బాహుబలి జాగ్రత్తపడేవాడు.
రాత్రి చపాతీ
ఇక సాయంత్రం స్నాక్స్‌లో గ్రౌండ్ నట్స్, జ్యూస్ తీసుకుంటాడు. రాత్రి ఎగ్‌కర్రీతో చపాతీని తింటాడు. పడుకునే ముందు ఫ్రూట్ జ్యూస్, పాలు తప్పనిసరిగా తాగుతాడు. తాను తినడమే కాకుండా తనకు ఇష్టమైన వారికి భోజనాన్ని పార్సల్స్‌లో పంపిస్తాడు. అలా పార్సల్ పంపించిన సందర్భంలో ఎంతో మంది సెలబ్రెటీలు తమకు ప్రభాస్ భోజనాన్ని పంపించినట్లు సోషల్‌మీడియాలో పంచుకున్న విషయం తెలిసిందే.
మద్యానికి దూరంగా
బాడీని ఫిట్‌గా వుంచుకోవడానికి జంక్‌ఫుడ్, మద్యానికి దూరంగా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని తీసుకోడు. సాహో చిత్రం కోసం బాడీని లైట్ వెయిట్‌గా చేయాల్సి వచ్చినప్పుడు అన్ని రోజులూ ప్రభాస్ మాంసాహారినికి దూరంగా ఉన్నాడని దగ్గరున్న మూవీ స్టాఫ్ చెబుతుంటారు.
ప్రభాస్ ముందు బెస్ట్ ఫుడ్
ఇక ఎప్పుడైనా మంచి బయటి ఫుడ్ ఎంజాయ్ చేయాలనిపించినప్పుడు నగరంలో ఉండే బెస్ట్ రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేయించి తెప్పించుకొని ఇష్టంగా మనస్పూర్తిగా తినేవారు.
భోజనం ఎలా చేస్తాడో వర్కౌట్ కూడా అంతే స్ట్రాంగ్‌గా చేస్తాడు. ఉదయం లేవగానే ఒకటిన్నర గంటలు జిమ్‌లో కార్డియో చేస్తూ గడుపుతాడు. సాయంత్రం మరో గంటన్నర వెయిట్ లిఫ్టింగ్ చేస్తాడు. ఇలా ప్రతి రోజూ డైట్, వర్కౌట్ పాటించడం వల్లే బాహుబలికి ఆ బాడీ వచ్చింది. మరి మీరు ప్రభాస్ డైట్‌ను ఫాలో అయ్యే దమ్ముందా..!



Click it and Unblock the Notifications