Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
కలలో బంగారం, నగలు కనిపిస్తున్నాయా? దానర్థం ఏంటో తెలుసా?
మీకెప్పుడైనా కలలో బంగారు ఆభరణాలు కనిపించాయా, ఎందుకు బంగారం, ఆభరణాలు కనిపిస్తున్నాయో అని ఎప్పుడైనా ఆలోచించారా, అసలు కలలో బంగారం కనిపిస్తే మంచిదేనా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్రలో వచ్చే కలలకు ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటుంది. ప్రతి కల గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి అనేక విషయాలు తెలియజేస్తుంది. కొన్ని చర్యలు మనపై చూపే ప్రభావం కలల రూపంలో కనిపిస్తుంది. కొన్ని కలలు భవిష్యత్తును సూచిస్తాయి. ఫ్యూచర్‌లో ఎదుర్కోబోయే సమస్యలు, అదృష్టాల గురించి చెబుతాయి. చాలా కలలు గతంలో మనకు జరిగిన అంశాల నుండి వస్తాయి. అయితే కొన్ని విభిన్న అంశాలపై కూడా రావొచ్చు.

మీకెప్పుడైనా కలలో బంగారు ఆభరణాలు కనిపించాయా, ఎందుకు బంగారం, ఆభరణాలు కనిపిస్తున్నాయో అని ఎప్పుడైనా ఆలోచించారా, అసలు కలలో బంగారం కనిపిస్తే మంచిదేనా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నేలపై బంగారు ఆభరణాలు పడినట్లు కల వస్తే..
కలలో బంగారం, ఆభరణాలు నేలపై పడినట్లు కల వస్తే మీరు ఆర్థికంగా నష్టపోతారని అర్థం. అలాంటి కలలు వస్తున్నట్లయితే ఆర్థిక సమస్య పొంచి ఉందని లేదంటే ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారని అర్థం చేసుకోవాలి. ఇలాంటి కల వచ్చినట్లయితే ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్తగా ఉండటం అవసరం. ఆర్థిక హామీలు నెరవేర్చకపోవచ్చు. అనుకోని ఖర్చుల వల్ల చేతిలో చిల్లిగవ్వ ఉండకపోవచ్చు. ఇలాంటి సమయంలో పొదుపులో నుండి డబ్బులు తీయకపోవడం ఉత్తమం. సేవింగ్స్ నుండి డబ్బు తీసి అత్యవసర పరిస్థితిలో బాధపడొద్దు.

వెండి నగలను బంగారం మార్చుకోవడం గురించి కల వస్తే..
వెండి నగలను బంగారంగా మార్చుకోవడం అంటే చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి వెళ్లడం లాంటిది. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవడం లాంటిది. అలాంటి కల వస్తే జీవితంలో మంచి స్థాయికి వెళ్తారని అర్థం.
ఉద్యోగులైతే ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులైతే మంచి లాభాల్లో తమ వ్యాపారం సాగుతుందని అర్థం. ఇలాంటి కల వస్తే ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అదృష్టానికి కృషి తోడైతే అద్భుతాలు చేయవచ్చు.

బంగారు ఆభరణాలు కొనడం గురించి కల వస్తే..
బంగారు ఆభరణాలు కొంటున్నట్లు కల వస్తే ఇది మంచి సంకేతమని గుర్తుంచుకోండి. అలాంటి కల వస్తే అదృష్టం వరించబోతోందని అర్థం. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం కూడా లాభదాయకంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. బంగారం కొంటున్నట్లు కల వస్తే జీవితంలో మంచి విజయం సాధిస్తారని చెబుతోంది డ్రీమ్ సైన్స్.

బంగారు ఆభరణాలు ధరించినట్లు కల వస్తే..
కలలో బంగారు నగలు ధరించినట్లు కల వస్తే అది ఏమాత్రం మంచిది కాదు. ఈ కల వచ్చిందంటే రాబోయే రోజుల్లో కుటుంబసభ్యులు లేదంటే సన్నిహితులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని అర్థం. ఇలాంటి మీక్కూడా వస్తే కుటుంబసభ్యుల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించొద్దు. చిన్న చిన్న సంకేతాలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఏదైనా సమస్య ఉన్నట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లడం మంచిది.

బంగారం బహుమతిగా పొందినట్లు కల వస్తే..
ఎవరైనా మనకు బంగారు నగలను బహుమతిగా ఇస్తున్నారంటే మనకు సంపద వస్తున్నట్లే. అలాంటి కల వస్తే ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి కల వస్తే భవిష్యత్తులో పెద్ద విజయాన్ని పొందుతారని అర్థం. ఆర్థికంగానూ లాభం చేకూరే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. వ్యాపారం కూడా లాభాల బాటలో సాగవచ్చు.

బంగారం పోగొట్టుకున్నట్లు కల వస్తే..
బంగారం పోగొట్టుకోవడం అంటే ఆర్థికంగా నష్టపోవడమే. దాని వల్ల మనశ్శాంతి కూడా దూరమవుతుంది. దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకుంటారు. బంగారం పోగొట్టుకున్నట్లు కల వస్తే అది చెడు సంకేతమే. బంగారు నగలు పోగొట్టుకున్నట్లు కల వస్తే రాబోయే రోజుల్లో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని అర్థం.
పోగొట్టుకున్న బంగారం దొరికినట్లు కల వస్తే మాత్రం అది మంచి సంకేతం. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారని అర్థం. బంగారం పోగొట్టుకోవడం అంటే ఆర్థిక నష్టం, దొరకడం అంటే ఆర్థికంగా లాభపడ్డట్టు అర్థం.



Click it and Unblock the Notifications