Latest Updates
-
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. మీ ర్యాంక్ అంచనా వేసుకోవడం ఎలా? -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ క్రిస్పీ సొరకాయ దోశ ఉండాల్సిందే! -
ఎండల వేడికి తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో శరీరాన్ని చల్లబరచుకోండి! -
వైశాఖ అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదేవతల ఆశీస్సులు! -
కమ్మని పెరుగు సేమియా..ఆహా ఏమి రుచి, తినరా మైమరచి.. -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. లక్ష్మీ కటాక్షం మీకేనా? - శుక్రవారం, 17 ఏప్రిల్ 2026 -
బ్రోకోలీ నిజంగా క్యాన్సర్ ను తగ్గిస్తుందా? డాక్టర్ చెప్పిన ఈ సీక్రెట్ తెలుసుకోండి! -
డీప్‌ఫేక్ ఫోటోలతో వేధిస్తున్నారా? 2 గంటల్లోనే డిలీట్ చేయించే మార్గమిదే! -
కర్ణాటక స్పెషల్ కుకుంబర్ అవలక్కి..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్! -
ఎండల వేడిని తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో చల్లగా ఉండండి
బంగినపల్లి మామిడి పండుకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?.. నవాబు రాజులతో ఈ పండుకు ఉన్న సంబంధం ఏంటి?
వేసవి సీజన్ వచ్చేసింది. ఎండలు భగభగా మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఎండ వేడికి మాడు పగిలిపోతుంది. అయితే వేసవి వచ్చిందంటే మనందరికీ గుర్తొచ్చేది మామిడి పండ్లు. అది కూడా బంగినపల్లి మామిడి పండు అత్యంత ప్రత్యేకమైనది. ఇది అందరికీ ఇష్టమైన పండు. దీనిని ఇష్టపడని మామిడి ప్రియులు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే చాలా మందికి ఈ పండు ఎలా పుట్టింది అనేది తెలియదు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుకు ఎందుకు అంత పాపులారిటీ వచ్చింది? ఈ పండు ప్రత్యేకతలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బంగినపల్లి మామిడి చరిత్ర:
బంగినపల్లి మామిడి పేరు ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఉన్న "బంగినపల్లి" గ్రామం పేరు మీదుగా వచ్చింది. ఈ గ్రామం ఈ రకానికి జన్మభూమిగా పరిగణించబడుతుంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రకం, అటు మద్రాసు ప్రెసిడెన్సీ రోజుల్లో నుంచే ప్రసిద్ధిగా ఉండేది. నాటి నుండి ఈ మామిడికి ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది.

1905 నుంచి 1922 వరకు ఈ పండుకు సంబంధించిన చెట్లను నాటించేవారు. అప్పుడు ఏపీని పరిపాలిస్తున్న నవాబు మీరు గులాం అలీ ఖాన్ ఈ మొక్కలను నాటించేవారు. నవాబు మీర్ గులాం అలీఖాన్‌కు మామిడిపండ్లపై అధికంగా మక్కువ ఉండేది. ఈ నేపథ్యంలో ఆయన మామిడి పండులో మేలు జాతిగా పిలిచే బేనిషాన్ రకాన్ని ఎంపిక చేసుకొని బనగానపల్లె సంస్థానంలో విరివిగా నాటించారు. దీనికే 'బనగానపల్లె మామిడి'గా పేరు వచ్చింది. కాలక్రమంలో ఇది 'బంగినపల్లి'గా మారింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ కూడా ఈ మామిడి రకానికి లభించింది, అంటే ఇది ఒక ప్రత్యేక భౌగోళిక గుర్తింపు పొందిన పండు అని అర్థం.
ఈ పండుకు ఉన్న ప్రత్యేకతలు:
ఈ పండుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ పండులో అద్భుతమైన రుచితో పాటు అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఈ పండులో ఉండే ప్రత్యేకమైన గుణాలు ఏంటంటే... ఈ పండు చాలా సహజమైన తీపి కలిగి ఉంటుంది. అలాగే చాలా తక్కువ పులుపు కలిగి ఉంటుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఈ పండును ఎప్పుడు తిన్నా అది సులభంగా జీర్ణమైపోతుంది. అలాగే ఈ పండు చాలా పెద్దదిగా మారుతుంది. దీని కారణంగా అది దీర్ఘవృత్తాకారంగా తయారవుతుంది. అలాగే పసుపు బంగారు రంగులో ఉంటుంది. ఇది తళతళా మెరుస్తూ ఉంటుంది. అలాగే ఈ పండు తొక్క చాలా పలుచగా ఉండి, లోపల ఉండే కండ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా చాలా మంది ఈ పండును తినడానికి ఇష్టపడుతుంటారు. ఈ పండు తినడానికి చాలా మృదువుగా ఉంటుంది. అలాగే ఇందులో విటమిన్ ఏ, సీ వంటివి ఉండడంతో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల దీనిని ఎక్కువగా జ్యూసులు, డెజర్ట్స్ కోసం వాడుతుంటారు. ఈ పండు తినడం వలన రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు, కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ఈ పండు ఎక్కడెక్కడ లభిస్తుంది
ఈ బంగినపల్లి మామిడి పండు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల, కర్నూలు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో లభిస్తుంది. అలాగే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పండు ఎక్కువగా లభిస్తుంది. దీంతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనూ లభిస్తుంది. ఈ రాష్ట్రాల నుంచి వేసవి కాలంలో దేశం నలుమూలలా సప్లై అవుతుంది. అంతర్జాతీయంగా కూడా యుఎస్, మిడిల్ ఈస్ట్, యూరప్ దేశాలకు ఎగుమతి అవుతుంది.



Click it and Unblock the Notifications











