Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
కలలో బల్లి కనిపించిందా.. దీని అర్థం మీకు తెలుసా..?
కలలు రావడం సహజం, కల రాకుండా నిద్రపోవడం చాలా ఆరోగ్యకరం అని అంటారు. కొందరికి భయంకరమైన కలలు వస్తాయ్. మరికొందరికి రొమాంటిక్ కలలు, ఇంకొందరికి ఏదో చదువుతున్నట్లు, ఇలా రకరకాల కలలు వస్తుంటాయ్. కలలకు సంబంధించి కూడా చాలా పరిశోధనలు జరగాయ్. కలలో కనిపించే వస్తువులను బట్టి వారు ఎలాంటి సమస్యలో ఉన్నారో తెలస్తుందని చెబుతున్నారు. పగలి కలలు నిజమౌతాయ్ అని కూడా అంటుంటారు. వీటిలో ఎంత వాస్తవం ఉందో పరిశోధనలే చెప్పలి. నాకు కలలో చాలా డబ్బు కనబడిందని అంటుంటారు. డబ్బు కనబడ్డం శుభమా అశుభమా డ్రీం సైన్స్ దీనిపై ఏమి చెబుతుందో తెలుసుకుందాం.
ధాన్యాన్ని చూడ్డం
చాలా మందికి కలలో ధాన్యం కనిసిస్తుంటాయ్. పండించిన పంట కనబడ్డం లేదా ధాన్యాలు కనబడ్డం జరుగుతాయ్. ఇలా కుప్పలు తెప్పలుగా ధాన్యం కలలో కనబడితే త్వరలో వారు ఎక్కవ మొత్తంలో ధనం పొందుతున్నారనే దానికి సంకేతంగా డ్రీమ్ సైన్స్ మనకు తెలియజేస్తుంది.

గర్భం దాల్చుతున్నట్లు కలకనడం
ఇలాంటి కలలు ఎక్కువగా మహిళలకే వస్తాయ్. ఎందుకంటే గర్భం దాల్చేది కూడా వారే కాబట్టి. కలలో గర్భం దాల్చినట్లు వస్తే వారు పురోగతికి చిహ్నంగా అనుకోవచ్చని కలల నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కల రావడం వారి కెరీర్‌కు భవిష్యత్తుకు చాలా మంచిదని చెబుతున్నారు.
ఎత్తు నుంచి కిందకు పడటం
ఎత్తైన ప్రాంతాల నుంచి లేదా భవనాల పై నుంచి కిందకు పడినట్లు కల వస్తుంది. కలలో వారు కింద పడగానే వారికి మెలుకవ వస్తుంది. ఇలాంటి కల వారి మానసిక పరిస్థితిని తెలుపుతుందంటున్నారు. అభద్రతా భావానికి లోనైనప్పుడు మాత్రమే ఇలాంటి కలలు వస్తాయని అంటున్నారు.
మాట్లాడలేకపోవడం
కలలో ఎంత మాట్లాడినా మాటలు రావు, ఎంత ప్రయత్నించిన పెదవులు కదపగలరు కానీ గొంతులోంచి ఒక్క మాట కూడా రాదు. దీన్నే ఆంగ్లంలో స్లీప్ పెరాలసిస్ అంటారు. ఈ నిద్ర పక్షవాతం కొందరిలో తరచుగా వస్తూ ఉంటుంది. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు ఈ నిద్ర పక్షవాతాన్ని వస్తుంది. ఇలాంటి కలలు వచ్చినప్పుడు సగం మెలుకవతో ఉంటారు కానీ కాళ్లు చేతులు శరీరం కదలలేని పరిస్థితి వుంటుంది.
బట్టలు లేకుండా వుండటం
బట్టలు లేకుండా కలలు పడటం లనేది కల వచ్చిన వ్యక్తి సిగ్గు పడాల్సిన విషయమని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో గుర్తింపు కోసం ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడనే దానికి కూడా ఇలాంటి కలలు సంకేతంగా చెబుతున్నారు.
బల్లి కనబడ్డం
కలలో బల్లి కనబడితే అసౌకర్యానికి సంకేతంగా చెబుతున్నారు. డ్రీమ్ సైన్స్‌లో బల్లులను ఆందోళనకు చిహ్నాలుగా గుర్తించారు. బల్లి కనబడితే మీరు ఆందోళనలో ఉన్నట్టు అర్థం చేసుకోవాలంటున్నారు. మీ జీవితం పట్ల మీరు మరింత జాగ్రత్తలు తీసుకోవాలనేదానికి సంకేతమని అంటున్నారు.
పాములు కనబడ్డం
కలలో పాములు కనబడితే మీ జీవితంలో మీరు ఊహించని ఏదో సంఘటన జరగబోతోందనే దానికి సంకేతంగా సూచిస్తోంది. కొన్ని కలల్లో పాము తన చర్మాన్ని వదిలించుకుంటున్నట్లు కూడా వస్తుంది. ఇలాంటి కల మీ జీవితంలో కొత్త మార్పులు రావడానికి సంకేతంగా అర్ధం చేసుకోవాలంటున్నారు.
కలలు కేవలం భ్రమలు మాత్రమే. వాటిని సీరియస్ గా తీసుకోకూడదు. రోజులో జరిగిన సంఘటనల ఆధారంగానే కలలు వస్తాయ్. కాబట్టి కలలతో అనుకోనిది ఏదీ జరగదనే వాస్తవాన్ని గుర్తించాలి. కానీ డ్రీమ్ సైన్స్‌ను కూడా కొంతవరకు నమ్మవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.



Click it and Unblock the Notifications











