Latest Updates
-
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా
కొత్తగా కనిపెట్టిన గ్రహం పేరు ఏమిటో తెలుసా? బిస్కెట్ పేరు పెట్టిన శాస్త్రవేత్తలు, దీనికో లెక్కుంది
అంతరిక్ష పరిశోధనలో శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ముందడుగు వేస్తున్నారు. మన పాలపుంతలోని నక్షత్రాలు, గ్రహాలపై చేస్తున్న పరిశోధనల్లో కొత్తకొత్త విషయాలు కనుగొన్నారు. ఇటీవల శాస్త్రవేత్తలు మరో కొత్త గ్రహాన్ని కనిపెట్టారు. ఇది దాదాపు భూమి సైజులోనే ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కొత్త గ్రహానికి ఓ బిస్కెట్ పేరు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.
ఈ కొత్త గ్రహానికి స్పెక్యులూస్-3బి (Speculoos-3b) అని పేరు పెట్టారు. అయితే స్పెక్యులూస్ అనేది బెల్జియం పాపులర్ బిస్కెట్ పేరు. ఇంతకీ కొత్త గ్రహానికి ఆ పేరు ఎందుకు పెట్టారు అని అందరూ ఆరా తీశారు. ఎందుకంటే కొత్త గ్రహాన్ని స్పెక్యులూస్ (సెర్చ్ ఫర్ ప్లానెట్స్ EClipsing ULtra-cOOl Stars) రోబోటిక్ టెలిస్కోప్స్ గ్లోబల్ నెట్‌వర్క్ ద్వారా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

స్పెక్యులూస్ ప్రాజెక్ట్.. రెడ్ డ్వార్ఫ్స్, బ్రౌన్ డ్వార్ఫ్స్ వంటి అల్ట్రాకూల్ స్టార్స్ చుట్టూ రాతి ఎక్సోప్లానెట్లను కనుగొనడం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త గ్రహం స్పెక్యులూస్-3బి, భూమికి 55 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది ఎరుపు మరగుజ్జు నక్షత్రం(రెడ్ డ్వార్ఫ్ స్టార్) చుట్టూ తిరుగుతుంది. రెడ్ డ్వార్ఫ్ స్టార్స్ సూర్యుని కంటే చల్లగా, చాలా చిన్నవిగా ఉండే నక్షత్రాలు. శాస్త్రవేత్తలు పగలు, రాత్రి కష్టపడి చాలా కాలం పాటు పరిశోధనలు చేసిన తరువాత ఈ కొత్త గ్రహం గురించి సమాచారం బయటకు వచ్చింది.
స్పెక్యులూస్ (Speculoos-3b), దాని రెడ్ డ్వార్ఫ్ స్టార్ చుట్టూ ప్రతి 17 గంటలకు ఒకసారి పరిభ్రమిస్తుంది. అంటే ఈ గ్రహం మీద ఒక సంవత్సరం భూమిపై 24 గంటలు లేదా ఒక రోజు కంటే తక్కువగా మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతులేని పగలు, రాత్రి ఈ కొత్త గ్రహం ప్రత్యేకతలు. అంటే గ్రహంపై ఒక వైపు శాశ్వతంగా పగలుగా, మరొక వైపు ఎల్లప్పుడూ రాత్రిలో అంటే చీకటిలోనే ఉంటుంది.
బెల్జియంలోని యూనివర్సిటీ ఆఫ్ లీజ్‌లోని ఖగోళ శాస్త్రవేత్త మైఖేల్ గిల్లాన్ ఈ అద్భుత విషయాన్ని ది గార్డియన్ కి వివరించారు. గ్రహం సమకాలికంగా) తిరుగుతుందని మేము నమ్ముతున్నామని, తద్వారా దారిపై ఎప్పుడూ పగలుగా ఉండే భాగమే అంటే భూమికి చంద్రుడు కనిపించినట్లు ఎల్లప్పుడూ రెడ్ డ్వార్ఫ్ స్టార్‌ని ఎదుర్కొంటుందని, రాత్రి వైపు అంతులేని చీకటిలో ఉండిపోతుందని ఆయన అంటున్నారు. .
2000 సంవత్సరంలో అంతరిక్ష శాస్త్రవేత్తలు ఏడు గ్రహాలతో కూడిన చల్లని రెడ్ డ్వార్ఫ్ స్టార్ TRAPPIST-1ని కనుగొన్నారు. అప్పుడు కూడా ఇదే విధమైన ఓ కొత్త ఆవిష్కరణ జరిగింది. ఈ రెడ్ స్టార్ భూమికి 40.66 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. TRAPPIST-1 స్టార్ 7.6 బిలియన్ సంవత్సరాల నాటిదని నమ్ముతారు. అంటే ఇది సౌర వ్యవస్థ కంటే పాతదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
మన గెలాక్సీలోని నక్షత్రాల్లో రెడ్ డ్వార్ఫ్ స్టార్స్ దాదాపు 70 శాతం ఉన్నాయి. వీటికి విశ్వంలోని పురాతన నక్షత్రాలుగా గుర్తింపు ఉంది. అయితే వాటి కాంతి చాలా మందంగా ఉంటుంది. అందుకే వాటిని కనుగొనడం లేదా వాటి చుట్టూ తిరుగుతున్న గ్రహాలను గుర్తించడం ఖగోళ శాస్త్రవేత్తలకు కాస్త కష్టమవుతుంది.ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటికే చాలా చెప్పారు. అయితే ఇటీవల కనుగొన్న కొత్త గ్రహం గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి.
సూర్యుడి కంటే చాలా చల్లగా ఉన్నప్పటికీ, రెడ్ డ్వార్ఫ్ స్టార్స్ చుట్టూ ఉన్న గ్రహాలు కొన్ని జీవ రూపాలను కొనసాగించడానికి తగినంత వెచ్చగా ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే స్పెక్యులూస్-3బి, రెడ్ డ్వార్ఫ్ నక్షత్రానికి చాలా దగ్గరగా ఉంది. దీంతో ఈ గ్రహం మీద జీవం ఏర్పడటం అసంభవం అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇంత దగ్గరగా ఉండటం వల్ల గ్రహంపై భారీ రేడియేషన్ ప్రభావం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి జీవరాశి అయినా మనుగడ సాధించడం కష్టమవుతుందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. మొత్తం మీద బెల్జియం పాపులర్ బిస్కెట్ పేరు సొంతం చేసుకున్న గ్రహం మీద ఎలాంట జీవరాశి మనుగడ ఉండదని తేలిపోయింది.



Click it and Unblock the Notifications