Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
విరిగిన దేవుని విగ్రహం ఇంట్లో ఉంటే ఈ సమస్యలు తప్పవు, మరెలా తీసేయడం?
దాదాపు ప్రతి హిందువుల ఇంట్లో దేవుని ఫోటోలు, చిన్న పరిమాణంలోని విగ్రహాలు ఉంటాయి. పూజాగదిలో వాటిని ఉంచి పూజిస్తుంటారు. అయితే కొన్ని సార్లు విగ్రహాలు కింద పడి అవి విరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. శుభ్రం చేసే సమయంలో, విగ్రహానికి బొట్టు పెట్టే సందర్భంలో, మరో ఫోటోకు బొట్టు పెడుతుంటే చేయి తగిలి కింద పడిపోవడం వల్ల విగ్రహాలు దెబ్బతింటాయి. చాలా మంది చిన్నగానే విరిగిపోయింది కదా అని వాటిని అలాగే ఉంచేస్తుంటారు.
ఇలా విరిగిన దేవుని విగ్రహాలను అలాగే ఉంచి పూజించడం వల్ల కొన్ని ప్రతికూలతలు కలిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు పండితులు. ఇంట్లో విరిగిన దేవుని విగ్రహాలను పూజించడం వల్ల చెడు జరుగుతుందని చెబుతున్నారు.

సాధారణంగా ఇంట్లో విగ్రహాలకు బదులు దేవతా మూర్తుల ఫోటోలను పూజించడం ఉత్తమమని అంటారు పండితులు. ఒకవేళ విగ్రహాలను ప్రతిష్టించుకోవాలంటే వాస్తు నిపుణుల సలహా తీసుకోవాలని చెబుతారు. ఒక పద్ధతి ప్రకారం, సరైన దిశలో, సరైన స్థానంలో దేవుని విగ్రహాలు ఉంచితేనే మంచి జరుగుతుంది.
విరిగిన విగ్రహాన్ని ఇంట్లో ఎందుకు పెట్టుకోవద్దంటే..
ఏదైనా కారణం వల్ల ఇంట్లోని దేవుని విగ్రహం విరిగిపోతే దానిని వీలైనంత త్వరగా తీసివేసి దాని స్థానంలో కొత్త విగ్రహం లేదా ఫోటోలను ప్రతిష్టించుకోవాలి. దీని వల్ల ప్రతికూల శక్తి ఇంట్లోకి రాకుండా ఉంటుంది. అనేక సమస్యలు తప్పుతాయి. ఎక్కువ ధర పెట్టి, ఎంతో ఇష్టంగా కొన్ని విగ్రహాలను కొనుగోలు చేస్తుంటారు. అలాంటి విగ్రహం చిన్నగా డ్యామేజీ అయితే దానిని తీసివేసి కొత్తగా ప్రతిష్టించడానికి మనసు రాదు.
అలాంటప్పుడు చాలా మంది వాటిని అతికించి అలాగే పూజిస్తుంటారు. కానీ ఇలా ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదని చెబుతున్నారు పండితులు. దీని వల్ల వాస్తు దోషాలు బాధిస్తాయి. విరిగిన విగ్రహం ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వస్తాయి. దీని వల్ల మనశ్శాంతి ఉండదు.
విగ్రహం దానంతట అదే పగిలిపోతే..
కొన్ని సార్లు మన ప్రమేయం లేకుండా దేవతా మూర్తుల విగ్రహాలు కింద పడి పగిలిపోతుంటాయి. ఇలా జరగడం అశుభమని చాలా మంది భయపడుతుంటారు. ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో అని ఆందోళన చెందుతుంటారు. అయితే ఇలా విగ్రహం దానంతట అదే పగిలిపోతే ఎలాంటి ప్రమాదం లేదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
విగ్రహాలు దానంతట అవే పగిలిపోతే జీవితంలో రాబోయే చెడును ఆ విగ్రహం గ్రహించి పగిలిపోయందని అర్థం చేసుకోవాలంటున్నారు నిపుణులు. కాబట్టి వీలైనంత త్వరగా ఆ విరిగిన విగ్రహాన్ని మార్చి కొత్తది ప్రతిష్టించుకోవాలని చెబుతున్నారు.
విరిగిన విగ్రహాన్ని ఎలా తీయాలంటే..
ఇంట్లో విగ్రహం పగిలిపోతే దానిని శాస్త్రీయంగా, పద్ధతి ప్రకారం ఎలా తీసివేయాలో చాలా మందికి తెలియదు. కొందరు విరిగిన విగ్రహాన్ని ఎప్పట్లాగే పూజిస్తుంటారు.. మరికొందరు మాత్రం ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు.
దేవుని విగ్రహాలు పగిలిపోతే దగ్గర్లోని దేవాలయాల్లో ఉంచడం మంచి పద్ధతి. వీలైతే పూజారులను ఇంటికి పిలిపించి మరింత శాస్త్రీయంగా విగ్రహాన్ని తీసి మారుస్తుంటారు. లేకపోతే.. దగ్గర్లోని పారే నీటిలో లేదా చెరవులో నిమజ్జనం చేయవచ్చు. అయితే ముందుగా కొన్ని పూజా పద్ధతులను అనుసరించి ఆ తర్వాత నిమజ్జనం చేయాలి.
కొత్త విగ్రహాన్ని ఎలా ప్రతిష్టించాలంటే..
పాత విగ్రహం విరిగిపోయినా, పాడైపోయినా దాని స్థానంలో కొత్తది ప్రతిష్టించుకోవాలి. అయితే పాత దాని స్థానంలో కొత్తది ప్రతిష్టించే సమయంలో పూజాది కార్యక్రమాలు చేయాలి. అలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, శ్రేయస్సు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications