Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
కిమ్ జోంగ్ ఉన్ భార్యకు ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా?, మరీ ఇంత దారుణమా
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాలో ఉత్తర కొరియా అగ్రస్థానంలో ఉంటుంది. ఈ దేశంలో ప్రజలకు విధించే భయంకరమైన, భయానకమైన శిక్షలు, నియమాల కారణంగా ఈ దేశం అత్యంత ప్రమాదకరమైనదిగా పిలవబడుతుంది. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కిమ్ జోంగ్ ఉన్ కూడా అత్యంత కిరాతకుడే. తడి కఠినమైన, కిరాతనమైన నాయకుడైన కిమ్.. తన భార్యకు ఏ విధమైన నియమాలు, శిక్షలు విధిస్తాడు? అందరిలాగానే తన భార్యకు కూడా నియమాలు విధిస్తాడా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కిమ్ జోంగ్-ఉన్ భార్య పాటించాల్సిన నిబంధనలను
ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్-ఉన్ అనేక రహస్యాలు కలిగిన వ్యక్తి. అతను అనేక కఠినమైన మరియు వింత చర్యలకు పేరుగాంచాడు. ఉత్తర కొరియాలో ప్రజలపై అనేక ఆంక్షలు విధించిన ఆయన.. తన భార్యను కూడా దీనికి మినహాయింపు ఇవ్వలేదు.

బలవంతపు వివాహం
స్త్రీలకు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉంది. కానీ కిమ్ జోంగ్-ఉన్ తన భార్యను బలవంతంగా వివాహం చేసుకున్నట్లు సమాచారం. 2008లో గుండెపోటు వచ్చిన తర్వాత, కిమ్ జోంగ్-ఉన్ తండ్రి కిమ్ జోంగ్-ఇల్, రి సోల్-జును వివాహం చేసుకోవాలని ఆదేశించాడు. దీంతో ఆయన ఆదేశాలను అనుసరిస్తూ కిమ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
పేరు మార్పు
సాధారణంగా, వివాహం తర్వాత, మహిళలు తమ భర్త పేరును తమ పేరుతో కలుపుతారు. కానీ రి సోల్-జు చాలా భిన్నమైన సమస్యను ఎదుర్కొన్నారు. కిమ్ జోంగ్ ఉన్ భార్య అయిన తర్వాత, ఆమె తన జన్మ పేరును వదులుకుని కొత్త పేరును స్వీకరించాల్సి వచ్చింది. అంతే కాదు, ఆమె గతమంతా దాచిపెట్టబడింది. ఆమె అసలు పేరు మరియు పుట్టిన సంవత్సరం కూడా ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి.
కుటుంబాన్ని కూడా చూడకూడదు
కిమ్ జోంగ్-ఉన్‌ను వివాహం చేసుకునే ముందు రి సోల్-జు సాధారణ పౌరురాలు కాదు. ఆమె గౌరవనీయమైన మరియు సంపన్న కుటుంబానికి చెందినది. ఆమె తల్లి ఒక ఆసుపత్రిలో గైనకాలజీ విభాగానికి అధిపతి, తండ్రి ఒక ప్రొఫెసర్. కిమ్ సైనిక సలహాదారులలో ఒకరైన తన మామ ద్వారా ఆమె కిమ్‌ను కలిశారు. కానీ ఉత్తర కొరియా నాయకుడిని వివాహం చేసుకున్నప్పటి నుండి, ఆమెకు తన కుటుంబంతో కలిసే అవకాశం లేకుండా పోయింది. తన కుటుంబాన్ని కలవకూడదని ఆమెకు ఆంక్షలు విధించారు.
హెయిర్ డ్రెస్సింగ్ మరియు స్టైలింగ్
ఆమె వివాహం జరిగిన తొలినాళ్లలో, రి సోల్-జు తన దేశంలో ప్రత్యేకంగా కనిపించింది. ఎప్పుడైతే ఆమె మొదటిసారి బహిరంగంగా కనిపించిందో తన పాశ్చాత్య శైలి ప్రదర్శనతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆ సమయంలో ఆమెకు జీన్స్ వేసుకోవడానికి కూడా అనుమతి లేదు. ప్రస్తుతం, ఆమె రూపాన్ని సంప్రదాయవాద దుస్తులు భర్తీ చేస్తాయి. అలాగే ఎప్పుడైతే ఆమె తన మొదటి కుమార్తెకు జన్మనిచ్చారో అప్పటి నుంచి ఆమె హెయిర్ స్టైల్ ఎప్పుడూ మారలేదు.
బయటికి వెళ్ళలేరు
ఇతర దేశాల అధ్యక్షుల భార్యల మాదిరిగా కాకుండా, రి సోల్-జు ఒంటరిగా బహిరంగంగా కనిపించలేరు. రిని ఒంటరిగా చూడటం దాదాపు అసాధ్యం, ఆమె ఎప్పుడూ తన భర్తతో మాత్రమే కనిపిస్తుంది. ఆమె పిల్లలను కూడా బహిరంగ కార్యక్రమాలలో ఒంటరిగా చూడటానికి అనుమతి లేదు. అందుకే ఇప్పటివరకు సోషల్ మీడియాలో, వెబ్‌సైట్‌లో ఆమె పిల్లల ఒక్క ఫోటో కూడా కనిపించలేదు.
ఉత్తరకొరియాను వదిలి వెళ్ళలేరు
రి సోల్-జు తన దేశాన్ని వదిలి వేరే దేశానికి ప్రయాణించడానికి లేదా పర్యటించడానికి అనుమతి లేదు. ఏదైనా దేశానికి చెందిన నాయకుడు మరణించిన సందర్భంలో, ఆమె తన భర్తతో కలిసి అంత్యక్రియలలో మాత్రమే పాల్గొనవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రూమర్ల ప్రకారం.. ఆమె కిమ్‌ను పెళ్లి చేసుకోవడానికంటే ముందు తన దేశాన్ని వదిలి వెళ్లిపోయారని సమాచారం. చీర్ గర్ల్‌గా సౌత్ కొరియాలో పని చేశారని ప్రతీతి.
గర్భధారణ కోసం బలవంతం
ఉత్తర కొరియా పాలక కుటుంబంలో భాగమైనప్పటి నుండి రి సోల్-జు గట్టి భద్రత మధ్య నివసిస్తున్నారు. కానీ ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆ భద్రత, ఒంటరితనం మరింత బలపడింది. ఆమె గర్భం దాల్చమని బలవంతం చేసేవారు. గర్భం దాల్చకపోతే ఆమెకు కఠినమైన శిక్షలు విధించేవారని తెలుస్తోంది. అలాగే మగబిడ్డ పుట్టే వరకు ఆమె గర్భం దాలుస్తునే ఉండాలని ఆమెకు కఠినమైన నియమాన్ని విధించారు.



Click it and Unblock the Notifications