Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎర్ర ఉల్లి vs తెల్ల ఉల్లి.. ఈ రెండిటిలో ఏది మంచిదో తెలుసా?
"ఉల్లి చేసిన మేలు తల్లి చేయదనే" అనే సామెత చాలా మందికి తెలిసిందే. ఉల్లి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అంతేకాదు, వంటల్లో కూడా అది ముఖ్యమైన పదార్థం. ఉల్లి లేకుండా నాన్‌వెజ్ కర్రీలు అసలు చేసుకోరు కూడా. ఉల్లిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎర్ర ఉల్లి ఇంకోటి తెల్ల ఉల్లి. అయితే చాలా మందికి ఈ రెండిటికి మధ్య తేడా ఏంటిది అనేది తెలియదు. అలాగే ఆరోగ్యానికి ఎర్ర ఉల్లి మంచిదా? లేక తెల్ల ఉల్లి మంచిదా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎర్ర ఉల్లి ఆరోగ్య ప్రయోజనాలు
ఎర్ర ఉల్లిపాయలు శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను బయటకు తీసేందుకు సహాయపడతాయి. ఇవి ఆక్సిడేషన్ క్రియలను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. క్యాన్సర్‌కు నిరోధక లక్షణాలను కలిగివున్న ఎర్ర ఉల్లిపాయలు, చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. వీటివల్ల చర్మంపై ఉండే ముడతలు, పగుళ్లు తగ్గిపోతాయి. శరీరంలో జీవక్రియ మెరుగుపడటం, రక్తపోటు అదుపులో ఉండడం వంటి ఫలితాలను కూడా లభిస్తాయి. అంతేకాకుండా, ఎర్ర ఉల్లి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

తెల్ల ఉల్లి ఆరోగ్య ప్రయోజనాలు
తెల్ల ఉల్లి కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎర్ర ఉల్లితో పోలిస్తే, తెల్ల ఉల్లిపాయల్లో నీరు మరియు చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా, ఇది మలబద్ధకం, ఎసిడిటీ వంటి కడుపు సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
ఇక, ఎర్ర ఉల్లి మరియు తెల్ల ఉల్లి రెండూ తమ తమ ప్రత్యేక ప్రయోజనాలతో ఉంటాయి. ఒకవేళ మీరు శరీర ఆరోగ్యం, చర్మం, గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెంచుకోవాలనుకుంటే ఎర్ర ఉల్లి ఎంచుకోవచ్చు. అయితే, కడుపు సమస్యలు, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలకు తెల్ల ఉల్లి ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ఆధారంగా, మీ ఆహారంలో రెండూ జోడించడం శరీరానికి అన్ని విధాలా ప్రయోజనాలను అందిస్తుంది.



Click it and Unblock the Notifications