Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Haridasu: ఎవరీ హరిదాసు? సంక్రాంతి రోజున ఈ సాంప్రదాయం ఎలా వచ్చిందో తెలుసా?
సంక్రాంతికి కనిపించే హరిదాసులు ఎవరు, హరిదాసులకు సంక్రాంతికి మధ్య సంబంధం ఏంటి, ఎందుకు సంక్రాంతి రోజు కనిపిస్తారు లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హరిదాసు కీర్తనలు, సంక్రాంతి సంబరాలు, ఈ రెండింటికి మధ్య ఎంతో సంబంధం ఉంది. సంక్రాంతి పండగ రోజు ఒక చేతిలో చిడతలు, మరో చేతిలో తంబురా, నుదుటన మూడు నామాలు, తలపై అక్షయ పాత్ర పెట్టుకుని సంక్రాంతి రోజున కనిపిస్తారు హరిదాసులు. హరిలో రంగ హరి అంటూ విష్ణు కీర్తనలు చేస్తూ కనిపించే హరిదాసులు సంక్రాంతి రోజు వస్తుంటారు. ఇంటింటికి తిరుగుతూ భిక్షం అడుగుతారు.

సంక్రాంతికి కనిపించే హరిదాసులు ఎవరు, హరిదాసులకు సంక్రాంతికి మధ్య సంబంధం ఏంటి, ఎందుకు సంక్రాంతి రోజు కనిపిస్తారు లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

(Image: Instagram/sullurupetabuzz)
హరిదాసు ఎలా ఉంటారంటే..
హరిదాసుల తలపై అక్షయ పాత్ర ఉంటుంది. రాగి పాత్రను గుమ్మడికాయలాగా తీర్చిద్ది దానిని తలపై ఉంచుకుంటారు. ఒక చేతిలో చిడతలు, మరో చేతిలో తంబురా, కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు. నుదుటన మూడు నామాలు, పంచె, పైనా శాలువా కప్పుకుని కనిపిస్తారు.
వీధుల్లో తిరుగుతూ విష్ణు కీర్తనలు ఆలపిస్తుంటారు. చిడతలు, తంబురా, గజ్జెలను లయబద్ధంగా కదిలిస్తుంటారు. శ్రీరామదాసు రచించిన పాటలను ఆలపిస్తారు. సంక్రాంతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు హరిదాసులు వీధుల్లో ఇంటింటికి తిరుగుతుంటారు.

(Image: Instagram/palle_tour)
హరిదాసు ప్రత్యేకత ఏంటంటే..
* హరిదాసు చిడతలు వాయిస్తూ వీధుల్లో తిరుగుతున్నప్పుడు భిక్షం అడగరు. ఎవరైనా దానం చేస్తేనే తీసుకుంటారు.
* అలాగే వీరు వెనక్కి తిరిగి చూడరు. ఇళ్లు దాటి ముందుకు వెళ్లారంటే ముందుకే నడుస్తూ వెళ్తారు.
* వీధుల్లో తిరుగుతున్నంత సేపు విష్ణు కీర్తనలు చేస్తుంటారు. ఎవరితోనూ ఎలాంటి మాటలు మాట్లడరు.
* ఇంటి ముందు నుండి హరిదాసు వెళ్తున్నప్పుడు ఆయన కాళ్లు కడిగి ఆయన ఆశీస్సులు పొందుతుంటారు.
* ఎవరైనా బియ్యం, డబ్బు ఇస్తే పాత్రలో వేసేందుకు వీలుగా కిందకు వంగుతాడు.
* సంక్రాంతి వేడుకలు ముగిశాక హరిదాసులంతా భద్రాచలంలో సమావేశం అవుతారు.
* వారికి వచ్చిన బియ్యం, డబ్బులతో భద్రాచలం ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేస్తారు.
* హరిదాసు వేషాధారణలో ఉన్నంత వరకు వారు రాత్రిపూట రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తారు.
హరిదాసులు భిక్షగాళ్లా?:
హరిదాసులు భిక్షగాళ్లు అని చాలా మంది తప్పుగా అనుకుంటారు. కానీ హరిదాసులు ప్రత్యేకమైన కారణంతో వీధుల్లో తిరుగుతుంటారు. సంక్రాంతి పండగ రోజున అందరూ భగవాన్ నామస్మరణ చేయాలని, అదే వినాలని, భగవంతుడి కృపకు పాత్రులు కావాలన్న ఉద్దేశంతో విష్ణు కీర్తనలు చేస్తూ వీధుల్లో తిరుగుతుంటారు.
హరిదాసులు ఎవరినీ భిక్షం అడగరు. వేస్తే తీసుకుంటారు. తీసుకున్న భిక్షాన్ని కూడా వారు అన్నదానానికి ఉపయోగిస్తుంటారు.



Click it and Unblock the Notifications