Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
సోషల్ మీడియాలో ఒకటే మోత..ఇంతకీ ఈమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్పిందే!
ఒక నీలిరంగు చీర, ఆకట్టుకునే చిరునవ్వు, చమత్కారమైన సంభాషణ..నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒక వైరల్ వీడియోలో కనిపించిన ఈ మహిళ ఎవరా అని అందరూ వెతకడం మొదలుపెట్టారు.
తన ఫిజిక్స్ టీచర్ వేవ్స్ అనే పదాన్ని బేబ్స్ అని పలికిన సరదా సంఘటనను ఆమె పంచుకున్న తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఒక్కసారిగా ఆమె ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిపోయింది. నీలి చీరలో ఉన్న ఈమె ఎవరు? పేరు తెలిస్తే చెప్పండి అంటూ ఎక్స్ లో పోస్టులు వెల్లువెత్తాయి.

ఆమె ప్రముఖ నటి గిరిజా ఓక్. ఒక్క వీడియోతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న గిరిజా ఓక్.. రాత్రికి రాత్రే వచ్చిన స్టార్ కాదు. మరాఠీ నాటక, సినీ రంగంలో ఆమెది దశాబ్దాల ప్రస్థానం.
గిరిజా ఓక్ ప్రస్థానం..
గిరిజా ఓక్ డిసెంబర్ 27, 1987న నాగ్ పూర్ లో జన్మించింది. గిరిజా తండ్రి ప్రముఖ మరాఠీ నటుడు గిరీష్ ఓక్. నటన ఆమెకు వారసత్వంగా అబ్బింది. ముంబైలో బయోటెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసినప్పటికీ నటనపై ఉన్న ఆసక్తి ఆమెను సినిమా రంగం వైపు నడిపించింది.
మరాఠీలో గుల్మోహర్, లజ్జా వంటి అనేక విజయవంతమైన సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం మరాఠీకే పరిమితం కాకుండా కన్నడ సినిమా హౌస్ ఫుల్ లో కూడా నటించి మెప్పించారు.
బాలీవుడ్ లో మెరిసిన తార..
తెలుగు ప్రేక్షకులకు గిరిజా ఓక్ కొత్త పేరు కావచ్చు కానీ హిందీ సినిమాల ద్వారా ఆమె దేశవ్యాప్తంగా సుపరిచితురాలే. 2007లో అమీర్ ఖాన్ నటించిన క్లాసిక్ మూవీ 'తారే జమీన్ పర్' లో జబీన్ క్యారెక్టర్ లో కనిపించి అందరి మన్ననలు అందుకున్నారు.
ఆ తర్వాత షోర్ ఇన్ ది సిటీ వంటి సినిమాల్లనూ నటించారు. ఇటీవల షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ జవాన్ లో కూడా కీలక పాత్రలో కనిపించి తన నటనతో ఆకట్టుకున్నారు.
వెండితెరకే కాకుండా, బుల్లితెరపైనా గిరిజా తనదైన ముద్ర వేశారు. సోనీ టీవీలో ప్రసారమైన లేడీస్ స్పెషల్ అనే సీరియల్‌లో ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణించే నలుగురు మహిళల్లో ఒకరిగా ప్రధాన పాత్ర పోషించారు.
ఓటీటీలోనూ అదరహో
మారుతున్న కాలానికి అనుగుణంగా గిరిజా ఓటీటీలోనూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. మోడరన్ లవ్: ముంబై వంటి ప్రశంసలు పొందిన సిరీస్ లలో నటించారు.
ఇటీవల మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటించిన ఇన్ స్పెక్టర్ జెండే సిరీస్ లో కనిపించి తన నటనలోని వైవిధ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు.



Click it and Unblock the Notifications