Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ట్రంప్ పై కాల్పులు జరిపింది ఎవరంటే.. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విషయాలు..!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగాయ్. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎన్నికల్లో ప్రచారం చేస్తుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. మొఖంపై రక్తంతో కనిపించిన ట్రంప్‌ను అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ వెంటనే ట్రంప్‌ను కిందకు దించివేపి ఆంబులెన్స్‌లోకి తరలించారు. ఆ సమయంలో ఆయన చెవి,చెంప దగ్గర రక్తం కారుతూ వుంది. ప్రస్తుతం ఆయన క్షేమంగానే వున్నట్లు రిపబ్లికెన్ పార్టీ వర్గాలు వెల్లడించాయ్. ఈ ఘటనలో కాల్పులు జరిపిన వ్యక్తి సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీలు జరిపిన కాల్పుల్లో మరణించాడు.

పెన్సిల్వేనియాలో ట్రంప్ ప్రచార ర్యాలీ ప్రారంభమైన ఐదు నిమిశాల తరువాత ట్రంప్‌పై ఒక్కసారిగా కాల్పులు జరిగాయ్. పెధ్ద శబ్దాలు కూడా రావడంతో వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ చుట్టూ రక్షణగా నిలిచారు. అప్పటికే ఆయన చెవి, చెంపల దగ్గర రక్తం కనిపించింది. కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ట్రంప్‌ను స్టేజి మీద నుంచి కిందకు తీసుకొని వచ్చారు. స్టేజి నుంచి కిందకు దిగుతుండగా ట్రంప్ తన పిడికెలిని పైకి ఎత్తి చూపించారు.
తుపాకలు కాల్పుల శబ్దాలు తమకు వినిపించాయని సభకు హాజరైన వారు చెప్పారు. అలాగే ట్రంప్‌ను స్టేజి పై నుంచి కిందకు దించుతున్న దృశ్యాలను కూడా తాము చూసినట్లు చెప్పారు. కాల్పుల శబ్దం రావడంతో సభకు వచ్చిన వారు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు.

దాడి తరువాత ట్రంప్ ఒక ప్రకటన చేశారు. దాడి తరువాత తన చెవిదగ్గర ఒక శబ్దం వినిపించింది. తన చర్మాన్ని చీల్చుకుంటూ వెళ్లినట్టు అనిపించింది. ఈ దేశంలో ఇలాంటి ఘటన జరుగుతుందని తాను అనుకోవట్లేదని అన్నారు. కాల్పులు జరపిన వ్యక్తి ఎవరో తెలియదు, అతను ఇప్పుడు చనిపోయాడని చెప్పాడు. ట్రంప్ పై కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఖండించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి కృతఘ్నతలు. ఈ తరహా దాడులకు అమెరికాలో చోటు లేదు. మనమంతా ముక్త కంఠంతో ఈ దాడులను ఖండించాలి అని బైడెన్ అన్నారు.
ట్రంప్ క్షేమంగా వుండడంతో తాను ఊపిరి పీల్చుకున్నట్లు కమలా హ్యారిస్ చెప్పారు. ఈ ఘటనలో మరణించిన, గాయపడిన వ్యక్తుల కుటుంబాల కోసం ప్రార్థనలు చేస్తున్నాం. ఈ దేశంలో హింసకు తావులేదు. ఇలాంటి దాడులను అందరూ ఖంగడించాలి అని కమలా హ్యారిస్ స్పష్టం చేశారు.

తన తండ్రి పై జరిగిన దాడిని దుండగుల తెలివి తక్కువ చర్యగా అభివర్ణించారు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్. తక్షణం స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి కృతఘ్నతలు తెలిపారు. దేశం కోసం నేను ప్రార్థిస్తూనే వుంటారు. ఐ లవ్ యూ డాడ్, టుడే ఆండ్ ఆల్వేస్ అంటూ ఇవాంకా ట్రంప్ ఎక్స్ వేదికగా ప్రకటించింది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ట్రంప్‌పై జరిగిన దాడిని ఖండించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై దాడి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను, అని రాశారు. ప్రతి పక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ ఘటనను ఖండించారు. మాజీ అమెరికా అధ్యక్షుడిపై ఇలాంటి ఘటనలు దారుణమని అన్నారు. ఇలాంటి వాటిని ఖండించాలని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.



Click it and Unblock the Notifications