Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
శుభముహూర్తాలు లేని ఆషాడమాసంలో అనంత్ అంబానీ పెళ్లి జరగడానికి కారణమేంటి ?
దేశంలో అనంత్ అంబానీ రాధికా మర్చంట్ ఇంట పెళ్లి సందడి జులై 12న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రపంచంలో వున్న సెలబ్రెటీలంగా ఈ పెళ్లికి రావడంతో అందరూ ఈ పెళ్లిని చాలా ఆశ్చర్యంగా చూసారు. ప్రస్తుతం ఆషాడ మాసం సడుస్తోంది. అయితే ఈ ఆషాడ మాసంలో హిందువు పెళ్లిల్లకు ముహూర్తాలే లేవు. ఇలాంటి సమయంలో అంబానీ ఇంట పెళ్లి జరగడమేంటని అందరికీ సందేహం వ్యక్తమవుతోంది. మంచి రోజులు లేనప్పుడు అంబానీ ఎందుకు పెళ్లి చేస్తున్నాడని చాలా మందికి అనుమానం కలిగింది.

ఆషాడమాసంలో శుభకార్యాలు ప్రారంభించడానికి అస్సలు ఇష్టపడరు. ఆషాడమాసంలో పెళ్లిల్లకు మూఢమని భావిస్తారు. ఈ ఆషాడమాసంలో పెళ్లిల్లు చేయరు, కొత్త కోడలు అత్తారింట్లో కూడా వుండదు. అయితే ఇలాంటి ఆషాడమాసంలో పెళ్లి ఘనంగా జరగడమేంటని చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ ముహూర్తాన్ని దృక్సిద్దాంత గణితం ఆధారంగా సూర్యమానం పంచాంగం ప్రకారం నిర్ణయించారు. దక్షిణ భారతదేశంలోని చంద్రుడి కదలికలు, ఉత్తరభారతంలోని సూర్యుడి కదలికలు ఆధారంగా పంచాంగాన్ని రూపొందింాచు. ఆషాడ మాసంతో సంబంధం లేకుండా ఒక శుభ ముహూర్తం చూసి పెళ్లి జరిపిస్తున్నారు. పంచాంగం ప్రాకరం కూడా ఈ ముహూర్తం మంచిదేనని చెబుతున్నారు. ఒక ప్రాంతం ఆచారాలకు, మరో ప్రాంతం ఆచారాలకూ చాలా తేడా వుంటుంది.
సూర్యమాన పంచాంగంలో అధికమాసం ప్రస్తావనే వుండదు.అందుకే తిధులూ ముహూర్తాల్లో చాలా తేడాలుంటాయ్. అంబానీ పెళ్లి కోసం పరమమిత్ర తార శుభఘడియలు చూశారు. వివాహ ముహూర్తాలూ కూడా వున్నాయని పండితులు చెప్పారు. సూర్యమానం ప్రకారం జులై 12 శుక్రవారం సూర్యుడు మేశరాశిలో సంచారం, చంద్రుడు పగలూ రాత్రి వృషభరాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సమయం వివాహానికి మంచి ముహూర్తమని పంచాంగం చెబుతోంది.
ఇక చాంద్రమానం పంచాంగం చూసుకుంటే. కన్యారశిలో చంద్రుడి సంచారం ఆశాడ మాసం శుక్ల పక్షం జులై 12 రాహు కాలం ఉదయం 10.30 నిమిశాల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు వుంది. షష్టి తిధి మధ్యాహ్నం 12.30 నిమిశాల వరకు వుంది. ఆ తరువాత సప్తమి ప్రారంభై చంద్రుడు కన్యారాశిలో పగలూ రాత్రి సంచారం చేయనున్నాడు. ఇక ఈ ముహూర్తంలో ఎటువంటి నష్టం లేదని పండితులతో పాటు శాస్త్రాలు కూడా పూర్తిగా అంగీకరించడంతో ఆషాడ మాసంలో అనంత్ అంబానీ రాధికా మర్చంట్లకు ముహూర్తాన్ని ఫైనల్ చేశారు.
వేల కోట్లు ఖర్చు చేసి పెళ్లి చేసిన అంబానీ ముహూర్తం దగ్గరం పప్పులో కాలు ఏమైనా వేశాడా అని అందరికీ అనుమానం కలిగింది. కానీ ఆ విషయంలో కూడా అంబానీ ఆచితూచే వ్యవహరించాడని పండితులు స్పష్టం చేశారు. అంబానీ పెళ్లిలో ముహూర్తం విషయంలో అంబానీ కుటుంబం ఎక్కడా రాజీపడలేదని చెప్పుకోవచ్చు. పెళ్లికి సుమారుగా 5వేల కోట్లకు పైగానే ఖర్చు చేశారు. ముఖేష్ అంబానీకి దైవ భక్తి ఎక్కువ వుండడం వల్ల ముహూర్తం విషయంలో తప్పు జరగలేదని అంటున్నారు.
గమనిక : పైన ఇచ్చిన వివరాలన్నీ ప్రముఖ జ్యోతిష్యులు, పండితుల నుంచి మాత్రమే సేకరించినవి. వీటిని మేము ఎట్టి పరిస్థితిలో దృవీకరించము.



Click it and Unblock the Notifications