వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా?

సైకిల్ టైర్ల దగ్గర నుంచి మొదలుపెడితే విమానం టైర్ల దాకా అన్నీ వాహనాల టైర్లు నలుపు రంగులో నే ఉంటాయి. ఆయా వాహనాల బాడీ రంగు ఏదైనా సరే టైర్లు మాత్రం నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయని మీకెప్పుడైనా డౌట్ వచ్చిందా? అసలు వేర్వేరు రంగుల్లో టైర్లు ఎందుకు ఉండవు అంటే..దీని వెనుక పెద్ధ కథే ఉందండోయ్..

తెల్లటి రబ్బరు.. నల్లగా ఎలా మారుతుంది?

నిజానికి, టైర్లను తయారు చేయడానికి ఉపయోగించే సహజ రబ్బరు లేత తెలుపు లేదా పసుపు రంగులో ఉంటుంది. మరి ఆ రబ్బరుతో చేసిన టైర్లు నల్లగా ఎందుకు ఉంటాయి? ఇక్కడే తయారీదారులు ఒక అద్భుతమైన ట్రిక్ ఉపయోగిస్తారు. తెలుపు రంగులో ఉండే రబ్బరు మిశ్రమానికి కార్బన్ బ్లాక్ అనే ఒక ప్రత్యేకమైన రసాయన పదార్థాన్ని కలుపుతారు. దీని వల్లే టైర్లు ఆ ముదురు నలుపు రంగును సంతరించుకుంటాయి.

Why Are All Tyres Black The Fascinating Science Behind Tyre Colors

నలుపు రంగు కేవలం స్టైల్ కోసమేనా?

కార్బన్ బ్లాక్ కలపడం వెనుక కేవలం రంగును మార్చాలనే ఉద్దేశం లేదు, దీని వెనుక మన ప్రాణాలను కాపాడే అతిపెద్ద సైన్స్ ఉంది. కార్బన్ బ్లాక్ అనేది టైర్ల తయారీలో వాడే ఒక సూక్ష్మమైన కార్బన్ రూపం. ఇది టైరుకు ఉక్కు లాంటి బలాన్ని ఇవ్వడమే కాకుండా, దాని లైఫ్ టైమ్ ని అమాంతం పెంచుతుంది.

అగ్ని పరీక్షను తట్టుకునే సత్తా

వాహనం రోడ్డు మీద వేగంగా వెళ్తున్నప్పుడు, రోడ్డుకు, టైరుకు మధ్య జరిగే రాపిడి వల్ల విపరీతమైన వేడి పుడుతుంది. ఆ వేడికి మామూలు రబ్బరు అయితే కరిగిపోతుంది లేదా పేలిపోతుంది. కానీ ఈ కార్బన్ బ్లాక్ ఆ వేడిని టైరులోని ఏ ఒక్క భాగంలోనో ఉండిపోకుండా, టైరు అంతటా సమానంగా విస్తరించేలా చేస్తుంది. తద్వారా టైరు కరిగిపోకుండా, డ్యామేజ్ కాకుండా రక్షిస్తుంది. అంతేకాకుండా ఎండల వల్ల వచ్చే యూవీ కిరణాలను కూడా ఇది సమర్థవంతంగా తిప్పికొడుతుంది.

చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం! చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం!

బలమే భద్రతకు అసలు సిసలైన పునాది

మన ప్రయాణంలో ఎగుడుదిగుడు రోడ్లు, గుంతలు, ఆకస్మిక బ్రేకులు సర్వసాధారణం. వాహనం బరువు మొత్తాన్ని మోస్తూ, ఇలాంటి ఒత్తిళ్లను తట్టుకుని మనకు సాఫీగా, సురక్షితమైన ప్రయాణాన్ని అందించాలంటే టైర్లు రాతిలా బలంగా ఉండాలి. కార్బన్ బ్లాక్ టైరుకు సాగే గుణాన్ని ఇచ్చి, రోడ్డు మీద అరుగుదల, చిరుగుదలను తగ్గించి భద్రతను పెంచుతుంది.

ఆధునిక టైర్లు.. ఒక టెక్నాలజీ అద్భుతం

అయితే నేటి ఆధునిక టైర్లను కేవలం రబ్బరు, కార్బన్ బ్లాక్ తో మాత్రమే చేయడం లేదు. ఇది ఒక అత్యాధునిక తయారీ ప్రక్రియ. ఇందులో సహజ రబ్బరు, కృత్రిమ రబ్బరుతో పాటు స్టీల్ వైర్లు, పాలిస్టర్ లాంటి టెక్స్ టైల్ ఫైబర్స్, మరెన్నో రసాయనాలను ఉపయోగిస్తున్నారు.

Story first published: Thursday, September 10, 2026, 10:36 [IST]
Desktop Bottom Promotion