Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
కుక్కలు రాత్రి సమయంలో అరవడం వెనక రహస్యం మీకు తెలుసా..?
ఈ సృష్టిలో ఎన్నో రహస్యాలు దాగివున్నాయ్. వాటి గురించి కొందరికి మాత్రమే తెలుసు. మన హిందూ శాస్త్రంలో వీటి గురించి పండితులు ముందుగానే తెలుసుకున్నారు. ఎన్ని రహస్యాలు వున్నా సరే వాటిని మన రుషులు, పండితులు చేధించి కనుగ్గొన్నారు. మన ఇంటికి సమీపంలో రాత్రి సమయంలో కుక్కలు అరవడం మనం విని వుంటాం. రాత్రి సమయంలో కుక్కలు అరపు చాలా భయానకంగా వుంటుంది. అలా కుక్కలు ఉదయం అరవడం మనం దాదాపు విని వుండం. కానీ రాత్రి కుక్కల అరుపు వింతగా వుంటుంది. ఏడుస్తున్నట్టు వుంటుంది, లేదా ఏదో ప్రత్యేక జీవి అరుస్తున్నట్లు వుంటుంది. అసలు కుక్కలు ఎందుకు రాత్రి సమయంలో అలా ఎందుకు అరుస్తాయో. వాటి వెనక వున్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం.
కుక్కలు రాత్రి సమయంలో ఎందుకు అరుస్తాయో తెలుసా..?
రాత్రి సమయంలో కుక్కలకు ఆత్మలు కనిపిస్తాయ్. ఈ ఆత్మలను చూసే కుక్కలు అరుస్తుంటాయ్. ఆత్మలు ఆ కుక్కల చుట్టూ వున్నప్పుడు అరుస్తాయ్. ఆత్మలు వున్నప్పుడు నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా వుంటుంది. ఆ నెగటివ్ ఎనర్జీ ఈ కుక్కలపై పడుతుంది.

ఎవరి ఇంటిముందైతే కుక్కలు రాత్రి సమయంలో అరుస్తాయో, వారి ఇంటి ముందు ఆత్మలు తిరుగుతుంటాయని అంటున్నారు. అయితే దీన్ని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. దీనికి శాస్త్రవేత్తలు కొన్ని కారణాలను చెబుతున్నారు.
రాత్రి సమయంలో కుక్కలు ఒంటరి కావడం వల్ల ఇలా అరుస్తుంటాయ్. మిగతా కుక్కల కోసమే ఇలా అరుస్తుంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇలా అరవడం వల్ల ఇతర కుక్కలు ఆ కుక్క దగ్గరికి వస్తుంది.
కొన్ని సందర్భాల్లో మనం మన ఇంటి చుట్టుపక్కల వున్న కుక్కలను ఆహారాన్ని పెడుతుంటాం. ఒక రాత్రి గనుక ఆహారం పెట్టడం మరిచిపోతే ఆ రోజు రాత్రి కుక్క ఇంటి ముందర ఆహారం కోసం అరుస్తుంది.

కుక్కలకు సొంత అడ్డా వుంటుంది. అంటే కుక్కలకు వాటికి సంబంధించి ప్రత్యేకమైన ఏరియా వుంటుంది. ఇది మా ఏరియా అని ఇతర కుక్కలకు చెప్పడానికి ఇలా అరుస్తుంటాయని చెబుతున్నారు. ఇలా అరవడం వల్ల ఇతర ఏరియా కుక్కలు అక్కడికి రాకుండా వుంటాయ్.
కుక్కలకు విపరీతమైన ఆకలి వున్నప్పుడు కూడా ఇలాగే అరుస్తుంటాయని చెబుతున్నారు. ఆహారం దొరకనప్పుడు కడుపుకాలి ఇలా అరుస్తాయని అంటున్నారు. ఆహారం పెడితే ఆ కుక్కలు అరవడం ఆపేస్తాయ్.
కుక్కకు ఏదైనా దెబ్బ తగిలితే కూడా ఇలా అరుస్తాయ్. దెబ్బ తగిలిన బాధను భరించలేక ఏడుస్తూ వుంటాయ్. ఇది కూడా కుక్కలు అరవడానికి కారణంగా చెబుతున్నారు.
కుక్కల వయసు పెరుగుతున్నా కొద్దీ వాటి శరీరంలో, మెదలల్లో జరిగే మార్పుల వల్ల కూడా కుక్కలు అరుస్తుంటాయ్. యవ్వనంలో వున్న కుక్క ఒంటరిగా మారినప్పుడు ఈ పరిస్థితి వస్తుంది.
మజీదు నుంచి వచ్చే అజాన్ విని కూడా కుక్కలు వాటిని అనుకరిస్తూ అరుస్తాయని అంటున్నారు. బ్యాండ్, డీజే చప్పుళ్లను విని కూడా కుక్కలు అరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ పై విషయాలన్నింటినీ కుక్కలను దగ్గరి నుంచి పరిశోధనలు చేసిన వారు చెప్పినవే. కాబట్టి కుక్కలు ఆత్మలను చూసి అరుస్తాయనడంలో ఎలాంటి నిజం లేదని శాస్త్రవేత్తలు కుండబద్దలు కొడుతున్నారు. మీ వీధిలో కుక్కలు ఎప్పుడైనా అరిస్తే వాటికి కొన్ని బిస్కెట్లు ఇంటి లోపలి నుంచే బయటకు వేసి చూడండి. అప్పుడు మార్పు ఖచ్చితంగా కనబడుతుంది.



Click it and Unblock the Notifications