Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
Human rights day 2024: మానవ హక్కుల దినోత్సవం ఎందుకు? ప్రాముఖ్యత,చరిత్ర ఇదే
ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి..యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (UDHR)తీర్మానాన్ని ఆమోదించింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా డిసెంబర్ 10న మానవహక్కుల దినోత్సవాన్ని(Human rights day)జరుపుకుంటారు. వివక్షత లేని మానవ సమాజ నిర్మాణమే ఈ అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవ లక్ష్యం. "మన హక్కులు, మన భవిష్యత్తు,ఇప్పుడే(our rights,our future,right now)"అనే థీమ్ తో ఈ సంవత్సరం హ్యూమన్ రైట్స్ డేని నిర్వహిస్తున్నారు.
మానవ హక్కుల నిర్వచనం ప్రకారం ప్రతి వ్యక్తికి జాతి,మతం,లింగం,రంగు, భాష,ఆర్థిక స్థాయిని,ఇతర అంశాలను బట్టి కాకుండా హక్కులు సమానంగా ఉంటాయి. అందులో ముఖ్యమైన హక్కులు, జీవన హక్కు, స్వేచ్ఛ,సమానత్వం, భావ ప్రకటన స్వేచ్ఛ. ఈ హక్కులను ఉల్లంఘించకుండా పరిరక్షించడం ప్రతి ప్రభుత్వానికీ బాధ్యతగా ఉంటుంది.

మానవ హక్కుల దినోత్సవం చరిత్ర
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా 1950లో మానవ హక్కుల దినోత్సవం అధికారికంగా జరుపుకోబడింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన UDHRని డిసెంబర్ 10,1948న స్వీకరించినందుకు గౌరవంగా ఈ తేదీని ఎంచుకున్నారు. భవిష్యత్తులో జరిగే దురాగతాలను నిరోధించడం, మానవ గౌరవాన్ని కాపాడడం దీని ఉద్దేశ్యం. ఇది ఏర్పాటు అయినప్పటి నుండి వివక్ష, అసమానత,అణచివేత వంటి మానవ హక్కులకు సంబంధించి జరుగుతున్న పోరాటాల గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. UDHR ప్రపంచంలోనే అత్యధికంగా అనువదించబడిన డాక్యుమెంట్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కలిగి ఉంది.. ఇది 530కి పైగా భాషల్లోకి అనువదించబడింది.
మానవ హక్కుల దినోత్సవం ప్రాముఖ్యత
రెండవ ప్రపంచ యుద్ధపు వినాశకరమైన ప్రభావాలు ప్రాథమిక మానవ హక్కులను రక్షించడానికి ప్రపంచవ్యాప్త నిబద్ధత యొక్క తక్షణ అవసరాన్ని ఎత్తి చూపాయి. ఈ పరిణామం చివరికి UDHR ఏర్పడటానికి దారితీసింది. ఇది ఆశకు చిహ్నంగా మారింది. మానవ హక్కులు కేవలం విలాసవంతమైనవి కావు ప్రజలందరికీ ప్రతిచోటా హక్కు అని నిరూపిస్తుంది.
మానవ హక్కుల దినోత్సవం వేడుకలు
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. సదస్సులు,సెమినార్లు, అవగాహన కార్యక్రమాలు ద్వారా మానవ హక్కుల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి చర్యలు తీసుకుంటారు. మనదేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ రోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ ఏడాది వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
మానవ హక్కుల గురించి ప్రముఖులు చెప్పిన కోట్స్
-మనుషుల హక్కులను తిరస్కరించడమంటే వారి మానవత్వాన్ని సవాలు చేయడమేనని నెల్సన్ మండేలా అన్నారు.
-మానవ హక్కులు ప్రభుత్వం అందించే ప్రత్యేక హక్కు కాదని..మానవత్వం కారణంగా ప్రతి మనిషికి లభించే హక్కు అని మదర్ థెరిసా అన్నారు.
-న్యాయం, మానవ హక్కుల పట్ల గౌరవం లేకుంటే శాంతి ఉండదని ఐరీన్ ఖాన్ తెలిపారు.



Click it and Unblock the Notifications