Latest Updates
-
గొంతు గరగరను తగ్గించే,రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి కొత్తిమీర సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
రైస్ vs చపాతీ..రాత్రి డిన్నర్ లోకి ఏది తినాలి?..డాక్టర్ దీప్తి చెప్పిన కీలక విషయం.. -
రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
కొరియన్ల లాగా మెరిసే చర్మం మీ సొంతం కావాలా? అయితే ఈ 5 పండ్లు తినాల్సిందే! -
బరువు తగ్గించి, రక్తాన్ని పెంచే పనస గింజల లడ్డూ.. ఈ స్వీట్ తింటే ఎముకలు దృఢంగా, కంటిచూపు మెరుగ్గా! -
వందల రోగాలను నయం చేసే మునగాకుతో టేస్టీ పూరీ..ఎలా చేసుకోవాలంటే.. -
దోశ, రైస్, చపాతీలోకి కిర్రాక్ అనిపించే చికెన్ చాప్స్..ఈ ఆదివారం స్పెషల్ గా మారిపోతుంది -
టిఫిన్స్ లోకి ఈ వెల్లుల్లి చట్నీ చేస్తే..రోజూ తినేదాని కన్నా ఎక్కువ తినేస్తారు! -
ఆదివాసీ ఫిష్ ఫ్రై..గారెల్లా కరకరలాడుతూ భలే రుచిగా -
అయ్యయ్యో పాపం తాత..75 ఏళ్ల వ్యక్తితో 30 ఏళ్ల యువతి పెళ్లి వ్యవహారంలో భారీ ట్విస్ట్..వీడియో చూడండి
మా కంపెనీలో ఎందుకు పని చేయాలనుకుంటున్నారు? అభ్యర్థి ఆన్సర్ తో నెట్టింట రచ్చ..
కాలేజీ చదువులు అయిపోయి ఉద్యోగం కోసం ఏదైనా కంపెనీకి వెళ్లినా లేదా ఒక చోట ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం మారదాం అనుకుని నిర్ణయించుకుని మరో ఆఫీసుకి ఇంటర్వ్యూకి పోతే అక్కడ తరచుగా ఎదురయ్యే ప్రశ్న.. మీరు మా కంపెనీలో ఎందుకు పని చేయాలనుకుంటున్నారు?.. దీంతో మీ కంపెనీ సూపర్, డూపర్, నా కెరీర్ ఎదుగుదలకు ఇదే సరైన వేది అంటూ ఎంతో కొంత నాటకీయంగా, కార్పొరేట్ స్టైల్ లో సమాధానాలు ఇస్తుంటారు అభ్యర్థులు. కానీ ఒక ఉద్యోగార్థి మాత్రం ఈ రొటీన్ సమాధానాలకు భిన్నంగా, కుండబద్దలు కొట్టినట్లు ఇచ్చిన జవాబు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చకు దారి తీసింది.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ రెడ్డిట్ లోని r/careeradvice కమ్యూనిటీలో ఒక యువకుడు తన ఇంటర్వ్యూ అనుభవాన్ని షేర్ చేసకున్నాడు. గత నెల రోజుల్లో ఏకంగా 7 నుంచి 8 ఇంటర్వ్యూలకు హాజరైన ఆ అభ్యర్థి, పదే పదే అవే అబద్ధాలు చెప్పలేక తీవ్రంగా విసిగిపోయాడు. తాజా ఇంటర్వ్యూలో చివర్లో హెచ్‌ఆర్ అదే పాత ప్రశ్నను అడిగాడు.

అప్పుడు ఆ అభ్యర్థి..నిజం చెప్పాలంటే మీరు ఇచ్చిన ఉద్యోగ ప్రకటన ప్రకారం ఈ పోస్ట్ కు జీతం చాలా బాగుంది. పైగా నాకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం. అదే సమయంలో, ఈ జాబ్ కు కావాల్సిన అర్హతలు నాకున్నాయి, మీరు అప్పగించే పనిని నేను వంద శాతం పర్ఫెక్ట్ గా చేయగలను అని నమ్ముతున్నాను అని తేల్చి చెప్పాడు.
ఈ సూటి సమాధానం విన్న హెచ్ఆర్ ఆశ్చర్యపోలేదు సరికదా.. చిరునవ్వుతో తల ఊపుతూ అంగీకారం తెలిపాడు. మీ నిజాయితీని నేను నిజంగా మెచ్చుకుంటున్నాను. చాలామంది ఈ ప్రశ్నకు ఏవేవో గొప్పలు చెప్పడానికి ప్రయత్నిస్తారు, కానీ మీరు వాస్తవం చెప్పారు అని ప్రశంసించాడు. అయితే ఆ తర్వాత ఆ కంపెనీ నుండి అభ్యర్థికి ఎలాంటి పిలుపు రాలేదు కానీ తన ఈ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్ తనను మిగతా వారిలో ప్రత్యేకంగా నిలబెట్టిందని అతను సంతోషం వ్యక్తం చేశాడు.

నెట్టింట మొదలైన ఆసక్తికర చర్చ
ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు ఆ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. మరోవైపు, కొందరు హెచ్ ఆర్ నిపుణులు, సీనియర్లు మాత్రం దీన్ని తప్పుబట్టారు. ఒక యూజర్ స్పందిస్తూ.. నేను కూడా ఒకప్పుడు ఇలాంటి సమాధానం చెప్పిన అభ్యర్థికి మర్యాదపూర్వకంగా తల ఊపాను, కానీ ఆ తర్వాత అతనికి ఉద్యోగం ఇవ్వలేదు. ఎందుకంటే ఈ ప్రశ్న అడిగేది ఏదో గొప్ప సమాధానం ఆశించి కాదు, మీలో ఈ పని పట్ల ఎంత ఆసక్తి ఉందో తెలుసుకోవడానికి మాత్రమే అని వివరించారు.
ఏది ఏమైనా, కార్పొరేట్ ప్రపంచంలో నిజాయితీ అనేది ఏ స్థాయిలో ఉండాలి, ఇంటర్వ్యూలలో ఎంతవరకు ఓపెన్ గా మాట్లాడాలి అనే విషయాలపై ఈ ఘటన ఒక ఆసక్తికరమైన ప్రశ్నను రేకెత్తించింది.



Click it and Unblock the Notifications
