Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
భూమిపై అత్యంత ఖరీదైన లోహం ఇదే..బంగారం,డైమండ్స్,ప్లాటినం కాదు..ఎక్కడ దొరుకుతుందో తెలుసా!
ఈ భూమ్మీద అత్యంత ఖరీదైన లోహం లేదా మెటల్ ఏది అని ఎవరినైనా అడిగితే చాలామంది ఠక్కున బంగారం అని సమాధానమిస్తుంటారు. మరికొందరు అయితే డైమ్ండ్స్, ప్లాటినం,వెండి అని చెబుతారు. అయితే వీటన్నింటికి మంచి ఖరీదైనవి ఈ భూమ్మీద చాలానే ఉన్నాయన్న విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు. అలాంటి అత్యంత ఖరీదైన మెటల్స్ లో ఒకటి రోడియం(rhodium). ఇది చాలా అరుదైన లోహం. దీన్ని నోబుల్ మెటల్ అని పిలుస్తారు.
బంగారం కన్నా అరుదైన లోహం ఇది. ఇది ఎక్కడ ఉన్నది కనిపెట్టాలన్నా కష్టమే..కొనాలన్నా కూడా కష్టమే. కొన్ని రకాల రోడియం చిన్న మిల్లీగ్రామ్ ఖరీదే కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఇది చూడటానికి వెండి-తెలుపు కలగలసినట్లు ఉంటుంది. గట్టిగా ఉండి అసలు తప్పు పట్టదు. రోడియం రేడియోధార్మిక లోహం..అంటే అది విచ్ఛిన్నమైనప్పుడు శక్తిని విడుదల చేస్తుంది. రోడియం సహజంగా యురేనియం ధాతువు కంటే తక్కువగా ఉంటుంది. ఇది చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు. గడిచిన కొన్నేళ్లలో రోడియం ధర భారీగా పెరిగిపోయింది.

రోడియం ఎందులో ఉపయోగిస్తారు
సాధారణ రోడియం ధర ఒక గ్రాముకి రూ.13 వేలు వరకు ఉంటుంది. అత్యంత అరుదైనవి కావడం,దీని ఉపయోగాల కారణంగా ఇది అంత ధర పలుకుతుంది. దీనిని ఎక్కువగా ఆటో మొబైల్ ఇండస్ట్రీలో వాడతారు. ఆటోమొబైల్స్ లోని కెటలైటిక్ కన్వర్టర్లలో దీనిని ఉపయోగించడం వల్ల..ఇది వాహనాల నుండి వెలువడే హానికరమైన వాయువులను (కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్‌లు) తక్కువ హానికరమైన వాటిగా మార్చడంలో సహాయపడుతుంది..తద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుంది. వైట్ గోల్డ్ జ్యూవెలరీకి మెరిసేలా చేయడానికి కూడా రోడియం ఉపయోగిస్తుంటారు. ఆభరణాలు,ఇతర అలంకరణ వస్తువులపై ఎలక్ట్రోప్లేటింగ్ కు దీన్ని వాడుతుంటారు.
విమానాల స్విచ్ లు, న్యూక్లియర్ పానల్స్, హెయిర్ క్రీమ్స్ వంటి అనేక ప్రొడక్టులలో కూడా దీన్ని వాడుతుంటారు. విమానాల్లోని హెడ్‌లైట్ రిఫ్లెక్టర్ లకు రోడియంను పూతగా వేస్తారు. 19వ శతాబ్దంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ట్రీట్మెంట్ లో కూడా రోడియం ఉపయోగించబడినట్లు ఆధారాలున్నాయి. దీని రేడియో ధార్మిక లక్షణాల వల్ల కలిగే ప్రమాదాల దృష్యా మెడిసిన్ వాడకంలో, దుస్తులు, పెయింట్స్ లో దీని వాడకం నిలిపివేయబడింది. ప్రపంచంలో ఏటా సుమారు 20-30 టన్నుల రోడియం మాత్రమే ఉత్పత్తి అవుతుంది..అదే బంగారం అయితే 3000 టన్నులకు పైగా ఉత్పత్తి అవుతుంది.
ఎక్కడ దొరుకుతుంది
కొన్ని రిపోర్టుల ప్రకారం భారత మిత్ర దేశాలైన రష్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో ఎక్కువగా రోడియం మైనింగ్ చేయబడుతోంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే రోడియంలో 80% దక్షిణ ఆఫ్రికా నుంచే వస్తుంది, మిగిలినది కెనడా, రష్యా వంటి దేశాలలో లభిస్తుంది. దీనిని భూమి లోపలి నుంచి తీయడం తర్వాత రిఫైన్ చేయడం చాలా కష్టతరం,ప్రమాదకరమైన పని.



Click it and Unblock the Notifications