Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
భార్య భర్తకు ఎడమవైపు పడుకోవాలంటారు.. ఎందుకో తెలుసా?
హిందూ సాంప్రదాయ ప్రకారం వాస్తు శాస్త్రానికి అధిక ప్రాధాన్యత ఉంది. ఇంటికి, కార్యాలయానికి, వ్యాపారానికి వాస్తు నియమాలు పాటించాలని సూచిస్తుంటారు పండితులు. ఇంట్లోని కుటుంబసభ్యులు ఆనందంగా ఉండటానికి వాస్తు శాస్త్ర నియమాలు పాటించాలంటారు. అలాగే దంపతులు ఇద్దరు సుఖంగా, సంతోషంగా ఉండటానికి కొన్ని నియమాలు పాటించాలి.
భార్య భర్తకు ఎప్పుడూ ఎడమవైపు కూర్చోవాలని చెప్పడం తెలిసిందే. అలాగే పడుకునేటప్పుడు కూడా భార్య భర్తకు ఎడమవైపు పడుకోవాలని చెబుతారు. అలా ఎందుకు చెబుతారో, దాని ప్రాధాన్యాత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అర్థనారేశ్వరుడిలో ఎడమ వైపునే పార్వతి:
పురాణాల ప్రకారం పరమశివుడిని అర్థనారేశ్వరుడిగా కొలుస్తారు. శివుడు తన ఎడమవైపు ఉండే అర్థభాగాన్ని పార్వతికి సమర్పించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలా భార్యలు భర్తలకు ఎడమవైపు ఉండాలని అంటారు. అలా హిందూ మతంలో భార్యను వామంగి అని పిలుస్తారు. వామంగి అంటే ఎడమ అవయవం కలిగినదని అర్థం. పురుషుని ఎడమ భాగాన్ని స్త్రీలో భాగంగా పరిగణిస్తారు. ఏదైనా శుభకార్యంలో కూడా భార్య భర్తకు ఎడమ వైపు కూర్చోవాలని చెప్పడం వెనక కారణం కూడా ఇదే. అలాగే భార్యలు తమ భర్తలకు ఎడమ వైపు పడుకోవాలని చెబుతారు.
ఆనందం, శ్రేయస్సు:
భార్య భర్తకు ఎడమ వైపున పడుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది వైవాహిక జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా, పూర్తి శ్రేయస్సును కలిగిస్తుందని నమ్మకం. భార్య భర్తకు ఎడమవైపు పడుకోవడం వల్ల భర్త ఆరోగ్యం బాగుంటుందని అంటారు. భార్యా భర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని చెబుతారు.
పూజల సమయంలో ఎడమవైపున, ఈ సమయంలో కుడివైపున:
పూజాది కార్యక్రమాలు చేసే సమయంలో భార్య భర్తకు ఎడమ వైపున కూర్చోవాలని పండితులు చెబుతుంటారు. అయితే కన్యాదానం, వివాహం, యజ్ఞకర్మ, జాతకర్మ, నామకరణం, అన్నప్రాశన సమయాల్లో మాత్రం భార్య భర్తకు కుడివైపున కూర్చోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
లౌకికమైన పనుల్లో భార్య భర్తకు ఎడమవైపున కూర్చోవాలని అంటారు. ఎందుకంటే ప్రాపంచిక పనుల్లో స్త్రీలదే ఆధిపత్యంగా పరిగణిస్తారు. స్త్రీ అంశమే అత్యున్నతమైనదిగా చెబుతారు.
యజ్ఞం, కన్యాదానం, వివాహం ఈ పనులన్నీ అతీంద్రియమైనవిగా పరిగణించబడతాయియ. అవి పురుషాధిక్యతను చూపిస్తాయి. అందుకే ఈ పనులు చేసే సమయంలో భార్య భర్తకు కుడివైపున ఉండాలని, కూర్చోవాలని సూచిస్తారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications