Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఏందయ్యా ఇది: అద్దంలో ఇంత అందంగా ఉంటే, ఫోటో ఏంటి ఇంత అగ్లీగా ఉంది?
మీకెప్పుడైనా ఇలానే అనిపించిందా? అద్దంలో చూస్తే ఎంతో అందంగా కనిపించే మీ మొఖం కాస్తా, ఫోన్ కెమెరా ఓపెన్ చేసి, క్లిక్ మనిపించి, చూస్తే వెరైటీగా లేదా అగ్లీగా అనిపించిందా? మొఖం సన్నగా అయినట్లు, ముక్కు పెద్దగా కనిపించిందా? మీ ఒక్కరికే అలా అయిందని అనుకోవద్దు. చాలా మంది ఇలాగే ఫీలయ్యారు. నిజానికి ఇందులో సైంటెఫిక్ రీజన్ కూడా ఉందట. అదేంటో చూద్దాం రండి..
అద్దంలో కనిపించేది మన ప్రతిబింబం. మీరు గమనించారంటే అన్ని రివర్స్‌లో కనిపిస్తుంటాయి. మీరు వేసుకున్న టీ షర్టులోగో కింద రాసున్నది రివర్స్‌లో కనిపిస్తుంది. అందుకు కారణమేంటంటే, ప్రతిబింబాన్ని చూపించడం. నిజానికి, దీనికి బాగా మనం అలవాటు పడిపోయున్నాం. మహిళలు రోజులో ఎన్నిసార్లు అద్దంలో తమ మొఖాన్ని చూసుకుని ఉంటారు? ఆ ప్రతిబింబాలు ఇన్వర్షన్ అని తెలిసి కూడా అలవాటు పడిపోయుంటాం. అందుకే అద్దంలో ప్రతిబింబాలకు మనం అడ్జస్ట్ అయ్యాం. అయితే, ఫొటోల్లో కంటే, అద్దంలోనే ఎందుకు అందంగా కనిపిస్తామో తెలుసా?

Image courtesy
మన బ్రెయిన్ ఆ పనులు చూసుకుంటుంది. అంటే, ప్రతిబింబాన్ని బట్టి, మన మొఖంపై పడే వెలుగు, దూరం అన్నింటిని చకచకా అంచనా వేసి, ఏ యాంగిల్‌లో అయితే అందంగా ఉన్నామో అలా మనం మారాలని బ్రెయిన్ ఇన్‌స్ట్రక్ట్ చేసేస్తుంది. మనం అందుకు తగ్గట్లు మన పొజిషన్ మార్చుకుని, కూల్‌గా, క్యూట్‌గా ఉన్నాం అని ఫీలవుతాం. కాంప్లిమెంట్ ఇచ్చుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే, అందరి మొఖాకృతులు పెర్‌ఫెక్ట్‌గా సిమెట్రిక్‌గా ఉండవు. అంటే, రెండువైపులా మొఖాకృతి ఒకేలా ఉండకపోవచ్చు. ఇది తెలిసిందే, రోజూ అద్దంలో చూసుకునే మనం దానికి అలవాటు పడ్డాం.
ఫొటోల్లో అగ్లీగా ఎందుకు?
అందుకు కారణం కెమెరా లెన్స్‌లు. ఫొటోల్లో ఎందుకు మనం భిన్నంగా కనిపిస్తామని చాలా రీసెర్చ్‌లు కూడా చేశారు. 35 mm, 70 mm, 120mm ఇలా రకరకాల లెన్స్‌ల్లో ముఖాలను కాప్చర్ చేసినప్పుడు ఫేస్ డిస్టార్షన్ అంటే అసలైన మొఖం ఎలా భిన్నంగా మారిపోయి క్యాప్చర్ అవుతుందో చెప్పేశారు. అలా ఒక్కో లెన్స్‌లో ఒక్కోలా కనిపిస్తుంది.
లైట్స్, ఫోకస్..
ఇంకో విషయం ముఖ్యంగా ఫొటో తీసుకోవడం అంటే, అక్కడున్న వాతావరణాన్ని కూడా చూసుకోవాలి. గాలి, లైటింగ్ ఇలాంటి ఫ్యాక్టర్స్‌కూడా కీలకమే. పైగా సిమ్మెట్రికల్ ఫేసెస్‌ను ప్రాసెస్ చేయడంలోనూ కొన్ని మార్పులు ఉండొచ్చని నిపుణులు చెప్పుతున్నారు.
ఇంకేం కారణాలుంటాయి?
డిస్టెన్స్, కెమరా యాంగిల్ కూడా ముఖ్యమే. పైగా సెల్ఫీలు మొబైల్ ఫ్రంట్ కెమరాతో తీసుకున్నారంటే, ఆ మార్పు మీకు బాగా తెలుస్తుంది. కొంతమంది కొన్ని ఫోజుల్లో చక్కగా కనిపిస్తారు. దానర్థం, వారికి ఫలానా ఫోజ్ బాగా నప్పింది అని. మరో విషయమేంటంటే, అద్దంలో మన లుక్‌ను మన బ్రెయిన్ ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ ఆధారంగా మార్చేసుకుంటాం అప్పటికప్పుడు. కానీ, ఫొటోలు అలా కాదు కదా. లెన్స్ కరెక్షన్స్, డిస్టన్స్, యాంగిల్, లైటింగ్ ఇలా చాలా ఉంటాయి.
అద్దంలో మనకు కనిపించే మొఖం కూడా ప్రతిబింబమే కానీ, ఆ అడ్జెస్ట్‌మెంట్‌లకు మనం బాగా అలవాటు పడ్డాం. వెంటనే మొఖం ఎటుతిప్పి చూస్తే అందంగా ఉండాలో తెలుసుకుంటాం. ఇక ఫొటోల్లో లుక్ బాగా రావాలంటే చాలా కాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, అద్దంలో స్టన్నింగ్‌గా ఉండి, ఫొటోల్లో అగ్లీగా కనిపిస్తే ఫీలవకండి. మీరు సహజంగా అందంగానే ఉన్నారు.



Click it and Unblock the Notifications