Latest Updates
-
స్పెషల్ అంటే ఇలా ఉండాలి.. వీకెండ్లో మజా ఇచ్చే కొబ్బరి పాల చికెన్ పులావ్.. ఇంటిల్లిపాదికీ పండగే.! -
మీరు సెప్టెంబర్లో జన్మించారా.. మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా.? -
నేపాల్ దేశంలో ఎంతో ఫేమస్..ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే తెల్ల నువ్వుల చట్నీ చేసుకోండిలా.. -
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం!
మహిళలు రాత్రుళ్లు జుట్టు విరబోసి ఎందుకు పడుకోవద్దో తెలుసా?
మహిళలు జుట్టు విరబోసుకోవద్దని హిందూ సాంప్రదాయం చెబుతోంది. అలాగే స్త్రీలు రాత్రి సమయంలో పడుకునేటప్పుడు జుట్టు విరబోసుకోవద్దని శాస్త్రాలు చెబుతున్నాయి. రాత్రిపూట జడ వేసుకోకుండా లూజ్ గా వదిలేసి పడుకోవడం వల్ల పలు సమస్యలు ఎదురవుతాయని అంటారు.
హిందూ సాంప్రదాయాల ప్రకారం రాత్రి సమయంలో మహిళలు జుట్టు లూజ్ గా వదిలేసి పడుకుంటే దుష్ట శక్తుల ప్రభావం పడుతుందని చెబుతారు. రాత్రిపూట జుట్టు వదులుగా ఉంచి పడుకోవడం వల్ల కలిగే దుష్ప్రభవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో మహిళలు, అమ్మాయిలు జుట్టు విప్పుకోవడం ఫ్యాషన్ గా చూస్తున్నారు. ప్రత్యేక దుస్తులపైకి ఓపెన్ హెయిర్ స్టైల్ ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయింది. వెవీ హెయిర్, కర్లీ హెయిర్ అంటూ వివిధ రకాల ఓపెన్ హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తున్నారు. ఆఫీసుకు, కాలేజీలకు, పార్టీలకు, ఫంక్షన్లకు జుట్టు కట్టుకోకుండా స్టైల్ చేస్తున్నారు. రాత్రుళ్లు కూడా జుట్టు విరబోసుకుని పడుకుంటారు కొంతమంది. కానీ ఇలా వెంట్రుకలను జడ వేసుకోకపోవడం సరికాదని వేదాలు చెబుతున్నాయి. రాత్రి పడుకునేటప్పుడు జుట్టు వేసుకోకపోతే ప్రతికూల ప్రభావం పడుతుందని సూచిస్తున్నాయి.
ప్రతికూల శక్తుల ప్రభావం:
రాత్రి సమయంలో ప్రతికూల శక్తులు, చెడు శక్తులు చురుకుగా ఉంటాయి. వదులైన జుట్టు ఈ ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. వదులుగా ఉన్న వెంట్రుకలు ఒకదానికొకటి రాపిడి జరిగి రాజ-త ఆధిపత్య శక్తి ప్రవాహం సృష్టించబడుతుంది. ఈ ఎనర్జీని ప్రతికూల శక్తులు ఆకర్షించుకుంటాయి. దీని వల్ల శరీరంలోకి ప్రతికూల శక్తులు ప్రవేశించి సమస్యలు తెచ్చిపెడతాయి.
కుటుంబ సమస్యలు తలెత్తుతాయి:
రాత్రి సమయంలో జుట్టు వదులుగా ఉంచుకుని పడుకుంటే కుటుంబ సమస్యలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా నిద్రపోవడం వల్ల దంపతుల మధ్య సాన్నిహిత్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నాయి. కలహాలు పెరిగి మానసిక ప్రశాంతత దూరం అవుతుందని చెబుతున్నాయి.
నలుపు రంగు శనిని సూచిస్తుంది:
నలుపు రంగు శనికి ఇష్టమైన రంగుగా పరిగణిస్తారు. రాత్రి పూట నల్లని జుట్టును వదులుగా ఉంచి పడుకుంటే శని ప్రభావం పడి జీవితంలో సమస్యలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. తలపెట్టిన పనులు పూర్తి కాక ఇబ్బందులు ఎదురవుతాయి.
శాస్త్రీయ కారణాలు:
శాస్త్రీయంగా కూడా రాత్రి పడుకునే సమయంలో జుట్టును వదులుగా ఉంచి పడుకోవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. జుట్టు వదులుగా ఉంచి పడుకుంటే జుట్టుకు దిండుకు మధ్య ఘర్షణ ఏర్పడి జుట్టు రాలుతుందని సూచిస్తున్నారు. జుట్టు చిట్లిపోతుంది, చివర్లు చీలిపోతాయని అంటున్నారు. జుట్టు సమస్యలు రావొద్దంటే రాత్రి సమయంలో జడ వేసుకోవడం మంచి మార్గమని వైద్యులు చెబుతున్నారు. రాత్రి సమయంలో జుట్టు వదులుగా ఉంచడం వల్ల తలెత్తే సమస్యలు
* హెయిర్ బ్రేకేజ్
* చివర్లు చీలిపోవడం
* జుట్టు రాలడం
* జుట్టు పెళుసుగా మారడం
* జుట్టు పొడిగా మారి చిట్లిపోవడం
* జుట్టు చిక్కులు పడటం
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications