Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
కుర్‌కురే తేకపోవడం వల్ల విడాకులిచ్చిన భార్య !
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డైవర్స్ చిన్న విషయంగా మారిపోయింది. చిన్న చిన్న కారణాలకు కూడా ఇద్దరూ విడిపోతున్నారు. వారి కారణాలు చూస్తే అటు నవ్వాలా లేక బాధపడాలా అనే పరిస్థితి నెలకొంది. రోజూ ఇటువుంటి సంఘటనులు చాలానే జరుగుతున్నాయ్. తాజాగా ఓ మహిళ తన భర్త కుర్ కురే తేలేదనే కారణంతో ఆమె అతనికి డైవర్స్ ఇచ్చేసింది. ఈ సంఘటన గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
ఉత్తర్‌ప్రదేశ్‌లోకి ఆగ్రాలో ఓ మహిళ తనకు తన భర్తతో విడుకులు కావాలని కోర్టులో అప్పీలు చేసుకుంది. దీనికి ఆమె చెప్పిన కారణం అక్కడున్న అందరికనీ ఆశ్చర్యానికి గురిచేసింది. భార్యకు రోజూ కుర్‌కురే తినే అలవాటు వుంది. భార్య ఇష్టాన్ని కాదనకుండా ఆమె భర్త రోజూ కుర్‌కురే తెచ్చేవాడు. ఆమె తింటూనే ఈ విషయానికి సంబంధించి వారిద్దరి మధ్య ప్రతీ రోజూ గొడవలు జరుగుతూనే వుండేవి. ఒక రోజు భర్త అలవాటు తప్పి ఆమెకు కుర్‌కురే తేవడం ఆపేశాడు. దీంతో భార్యకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ఈ విషయానికి సంబంధించి భార్యా భర్తల మద్య తీవ్ర గొడవలు కూడా జరిగాయ్.

గొడవ తరువాత భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తరువాత ఆమె పోలీసుల వద్దకు వెళ్లి తనకు తన భర్తతో విడాకులు కావాలని దరఖాస్తు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరికీ గత సంవత్సరమే వివాహమైంది. మొదట్లో ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఇద్దరి మధ్య గొడవలు తీవ్రమయ్యాయ్. భార్య చిరుతిళ్లు ఎక్కువ తినడం వల్ల కూడా ఇద్దరి మధ్య గొడవలకు ప్రధాన కారణమని చెప్పాడు. తన భర్త తనను కొట్టడం వల్ల తాను పుట్టింటికి వెళ్లినట్టు భార్య పోలీసులకు వివరించింది.
ఈ కుర్‌కురే డైవర్స్‌ను దృష్టిలో పెట్టుకొని డైవర్స్‌కు గల ప్రధాన కారణాలను మీకు వివరిస్తున్నాం. కన్ని పరిశోధనలు, పరిశీలను తరువాత డైవర్స్‌కు కొన్ని కారణాలు ప్రధానంగా ఉన్నట్లు కనుగ్గొన్నారు.
కమిట్‌మెంట్ లేకపోవడం కూడా డైవర్స్‌కు ప్రధాన కారణంగా చెబుతున్నారు. వివాహం అయిన తరువాత ఇద్దరూ కలకాలం బ్రతుకుతామని బలమైన కమిట్‌మెంట్‌తో వుండాలి. ఇద్దరూ తరచుగా వాదనలు చేసుకోవడం వల్ల కూడా డైవర్స్‌కు కారణంగా తెలుస్తోంది. చిన్ని వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల కూడా డైవర్స్ అవకాశాలు ఉన్నాయంటున్నారు.
పెళ్లి చేసుకున్న తరువాత వివాహం చేసుకున్న పార్ట్‌నర్ నుంచి ఎక్కువగా ఆశించడం వల్ల కూడా ఈ గొడవలకు కారణంగా చెబుతు్నారు. భార్యా భర్తలిద్దరి మధ్య ఎక్కువ వ్యత్యాసం వుంటే డైవర్స్‌కు కారణం అవుతుందని అంటున్నారు. పెళ్లికి సరిగ్గా సిద్ధం కాకుండా ఉండడం వల్ల కూడా విడాకులకు కారణమవుతుందంటున్నారు. గృహ హింస కూడా డైవర్స్‌కు కారణంగా చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు డైవర్స్‌కు కారణమవుతున్నాయని అంటున్నారు. కుటుంబ సహకారం లోపించడం వల్ల కూడా డైవర్స్‌లు అవుతాయంటున్నారు. భార్యా భర్త ఇద్దరి మతాలు వేరు కావడం వల్ల కూడా విడాకులు జరుగుతాయంటున్నారు. మొత్తంగా కమిట్‌మెంట్ లేకపోవడం వల్ల జరిగే విడాకుల శాతం 73 శాతం పైగానే ఉన్నట్లు కనుగ్గొన్నారు. తరువాత ఎక్కువగా వాదించడం వల్ల 55 శాతం విడుకులు అవుతున్నాయంటున్నారు.



Click it and Unblock the Notifications