Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
రియల్ ఇండియన్ పెళ్లాం: కదులుతున్న బండిమీద మహిళ చేసిన పనికి షాక్..వీడియో చూడండి
పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్? పెళ్లి చేసుకున్నాక ఎలా ఉంది అనే ప్రశ్నలకు ఎందుకు బ్రో ఆ టార్చర్ అని సమాధానం చెబుతున్నారు చాలామంది నేటి యువత. పెళ్లి తర్వాత ప్రశాంతత పోతుందని, మనశ్శాంతిగా ఉండలేమంటూ పలు కారణాలను చెబుతుంటారు. అయితే అందరికీ ఇలానే ఉండదు కానీ..కొందరికి మాత్రం పెళ్లి ఓ నరకంలానే ఉంటదేమో అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం ఓ మహిళ.. రోడ్డుపై బండి నడుపుతున్నా వదలకుండా భర్తను చెప్పుతో చితకొట్టింది.
ఘర్ కీ కలేష్ అనే పేరుతో ఉన్న ఎక్స్ అకౌంట్ లో షేర్ చేసిన ఓ వీడియోలో..ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ మహిళ తన భర్తతో కలిసి బైక్ పై ప్రయాణిస్తుంది. అయితే ఇద్దరూ తలకు హెల్మెట్ ధరించలేదు. అయితే భర్త డ్రైవ్ చేస్తుండగా..భార్య బైక్ వెనుక కూర్చుంది. అయితే కొద్ది సేపటికి బీజీ రోడ్డుపై బైక్ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వెనుక నుంచి ఆ మహిళ తన కాలి చెప్పు చేత్తో తీసుకొని బైక్ నడుపుతున్న తన భర్తను కొట్టడం ప్రారంభించింది. భర్తను వెనుక నుంచి చెప్పుతో అతడి చెంపలు రెండూ వాయిస్తూనే ఉంది. వీపు మీద చెప్పుతో బాదిపడేసింది. అయితే ఈ సమయంలో అతడు కంట్రోల్ తప్పి ఏదైనా వాహనానికి లేదా వ్యక్తలకు యాక్సిడెంట్ చేస్తాడేమోనన్న ఆలోచన లేకుండా బైక్ వెనుక కూర్చొన్న మహిళ దారుణంగా భర్తను చెప్పుతో కొట్టింది. అంతేకాకుండా కొడుతూ పెద్ద పెద్దగా భర్తపై కేకలు వేసింది.

భార్య చితక్కొడుతున్నా అతడు మాత్రం డ్రైవింగ్ మీదనే ఫోకస్ పెడుతూ తల కొంచెం కూడా వెనక్కి తిప్పకుండా యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్తగా బైక్ నడుపుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోకి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. కామెంట్ల రూపంలో ఈ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు.
ఆ మహిళ కారణంగా యాక్సిడెంట్ అయ్యి అమాయకులు చనిపోయే ప్రమాదం ఉందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేయగా..ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ రోడ్లపై ఇదేం పనంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు.
ఇలాంటివి చూసినప్పుడే పెళ్లంటేనే భయం వేస్తోందని మరికొందరు నెటిజన్లు చమత్కారంగా కామెంట్స్ చేశారు. ఇండియాలో పెళ్లాలు అంటే ఇంతే బ్రో అంటూ మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేశారు. మొత్తానికి ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్స్ వచ్చాయి. అయితే అసలు ఆ మహిళ భర్తను కొట్టడానికి కారణం మాత్రం తెలియరాలేదు.



Click it and Unblock the Notifications