Latest Updates
-
మందులతో పనిలేని బెస్ట్ డిటాక్స్ డ్రింక్.. అల్సర్‌ను పోగొట్టే కమ్మనైన తమలపాకు రసం.! -
రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ దొన్నె బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి -
మెనోపాజ్ తర్వాత మహిళల్లో అనారోగ్యానికి కారణాలివే.. ఈ భాగాలపైనే ఎక్కువ ఎఫెక్ట్.! -
దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.! -
లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.! -
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.!
దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా!
రాజస్థాన్ అనగానే మనకు అక్కడి ప్రజలు ధరించే రంగురంగుల బట్టలు, రాజుల కాలం నాటి అందమైన కోటలు, ఎడారి, రాజసం ఉట్టిపడే సంస్కృతి గుర్తుకొస్తాయి. కానీ అదే ఎడారి ప్రాంతపు మారుమూల గ్రామాల్లో దశాబ్దాలుగా ఆడపిల్లల జీవితాలను నిలువునా దహించేస్తున్న ఒక భయంకరమైన చీకటి కోణం దాగి ఉందన్న నిజం చాలామందికి తెలియదు. అదే మోల్కి బహు సంప్రదాయం.
స్థానిక భాషలో మోల్కి బహు అంటే అక్షరాలా కొనుక్కొచ్చిన కోడలు అని అర్థం. పేరుకు కోడలే అయినా, ఆమె బతుకంతా బానిసత్వమే. ఈ దారుణమైన ఆచారానికి ప్రధాన కారణాలు..నిరుపేదరికం, ఆడపిల్లల భ్రూణహత్యల వల్ల తలెత్తిన తీవ్రమైన లింగ నిష్పత్తి అసమానతలు.

దేశంలోని మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా అబ్బాయిలకు పెళ్లి చేయడానికి అమ్మాయిలు దొరకని పరిస్థితి. దీంతో అక్కడి డబ్బున్న వ్యక్తులు.. మధ్యవర్తుల ద్వారా రాజస్థాన్ ఎడారి గ్రామాల్లోని నిరుపేద కుటుంబాలను ఆశ్రయిస్తున్నారు. కేవలం లక్ష నుంచి మూడు లక్షల రూపాయల నోట్ల కట్టలను ఆశచూపి, యువతులను కొనుక్కుని వెళ్తున్నారు. అయితే ఆ యువతికి అసలు నరకం అత్తగారింట్లో అడుగుపెట్టిన తర్వాతే మొదలవుతుంది.
డబ్బుపెట్టి కొనుక్కొచ్చిన కోడలు కాబట్టి, ఆమెకు ఆ ఇంట్లో మనిషిగా కనీస గౌరవం, స్వేచ్ఛ ఉండవు. అత్యంత హేయమైన, గుండెల్ని పిండేసే వాస్తవం ఏమిటంటే.. ఆమె ఆ ఇంటికి తీసుకొచ్చిన ఒక్కడికే భార్య కాదు. ఆ కుటుంబంలోని మగవారందరికీ అంటే అన్నదమ్ములు, బాబాయిలు, చివరకు కన్నతండ్రి వయసున్న మామకు కూడా. ఆమె శారీరకంగా భార్యగా ఉండాల్సిన దుస్థితి. ఇంట్లో ఎంతమంది మగవాళ్లు ఉంటే, అందరి అకృత్యాలనూ, కామవాంఛలనూ ఆమె భరించాలి.

ఇంతటి అమానుషమైన చర్యను ఆ కుటుంబాలు సిగ్గులేకుండా సమర్థించుకుంటాయి కూడా. తలా ఒకరిని పెళ్లి చేసుకుంటే ఆస్తి పంపకాలు చేయాల్సి వస్తుందని, భూమి ముక్కలు కాకుండా ఉండాలంటే ఇంట్లోని మగవాళ్లందరికీ ఒకే భార్య (కొనుక్కొచ్చిన కోడలు) ఉండటమే సరైనదని వారు వాదిస్తారు. మనిషి ప్రాణం కంటే, ఆడదాని ఆత్మగౌరవం కంటే ఆస్తే ముఖ్యమనుకునే ఈ క్రూరమైన ఆలోచనా విధానం సభ్యసమాజానికే తలవంపులు.
ఇది కేవలం ఒక పాత ఆచారం కాదు.. ఒక మహిళ కనీస ప్రాథమిక మానవ హక్కులను, స్వేచ్ఛను మంటగలిపే పచ్చి నేరం. అభివృద్ధి పథంలో దేశం దూసుకుపోతోందని గొప్పలు చెప్పుకుంటున్న ఈ కాలంలోనూ, ఒక ఆడబిడ్డను వస్తువులా కొని, కుటుంబం మొత్తం పంచుకోవడం సిగ్గుచేటు.



Click it and Unblock the Notifications
