Latest Updates
-
నాన్‌వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల
Robot Receptionist: రోబో రిసెప్షనిస్ట్‌పై దాడి, కర్రతో చితక్కొట్టిన మహిళ
చైనాలో రోబోల వాడకం పెరిగిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలోని ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి బదులు రోబోలను ఎక్కువగా వాడుతున్నారు. వాటితోనే రోగులకు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. దీంతో రోగులకు వైద్యులకు మధ్య ఉండాల్సిన మానవ బంధం ఉండట్లేదు. దీని వల్ల కొన్నిసార్లు రోగులు అసంతృప్తికి, ఆగ్రహానికి గురవుతున్నారు.
తాజాగా ఓ మహిళ రోబో రిసెప్షనిస్టుపై దాడి చేసింది. కర్రతో ఇష్టారీతిగా కొట్టింది. దీంతో ఆ రోబో పరికరాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ నెల 23వ తేదీన ఇది జరిగింది. ఈశాన్య తీరంలోని జియాంగ్సు ప్రావిన్స్ జుజౌ నగరంలోని జుజౌ మెడికల్ యూనివర్సిటీ దవాఖానాలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.

హాస్పిటల్ రిసెప్షన్ కౌంటర్ వద్ద ఉన్న రోబోపై ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి చేసింది. ఆ రోబోనూ తిడుతూ కర్రతో కొట్టింది. రోబో చేతులపై తలపై వివిధ భాగాలపై కొట్టడంతో దాని ముక్కలు చెల్లాచెదురుగా పడ్డాయి. మహిళ తీవ్ర ఆగ్రహంతో రోబోపై దాడి చేయడాన్ని అక్కడే ఉన్న రోగులు, ఆస్పత్రి సిబ్బంది గమనించినప్పటికీ దగ్గరికి వెళ్లే సాహసం చేయలేకపోయారు.
ఆస్పత్రి సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. కాగా చైనా ఆసుపత్రుల్లో రోబోల వాడకం పెరిగిపోయింది. వైద్యులను, వైద్య సిబ్బందిని తగ్గించి రోబోలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. సాధారణ ఆరోగ్య పరీక్షలకు రోబోలను వాడుతున్నారు.
రిసెప్షన్ కౌంటర్లు, ఇతర విభాగాల్లో రోబోలు కనిపిస్తున్నాయి. అయితే దీని వల్ల రోగులకు వైద్యులతో ఉండాల్సిన మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి. చాలా సార్లు రోబోలు రోగుల భావోద్వేగాలను అంచనా వేయడం విఫలమవుతున్నాయి. దీంతో రోబోలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. తాజాగా జరిగిన ఘటనలో మాత్రం మహిళ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని కొందరు చెబుతున్నారు. మహిళ రోబోపై దాడి చేయడానికి గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు.



Click it and Unblock the Notifications