Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
16 సంవత్సరాల నుంచి ఏమీ తినలేదు తాగలేదు.. ఎలా సాధ్యం..?
సాధారణంగా మనుషులు ఒక పూట తినకపోవడం వల్ల నీరసంగా అయిపోతారు. రెండు రోజులు తినకపోతే కళ్లు తిరిగినట్లుగా అవుతుంది. ఒక వారం తినకపోతే వారికి నిలబడ్డానికి కూడా శరీరం సహకరించదు అలాంటిది ఓ మహిళ 16 సంవత్సరాల నుంచి ఎలాంటి ఆహారాన్ని తీసుకోలేదు. కనీసం నీరు, ఎలాంటి పానియాల్ని కూడా ఆమె తాగలేదు. 16 సంవత్సరాలు తినకుండా ఆమె ఎలా జీవిస్తుంది, ఆమె ఎవరు, ఎందుకు అలా చేసిందో తెలుసుకుందాం.
ఆమె పేరు ములువర్క్ అంబా. ఇథియోపియాలో నివసిస్తున్న ములువర్క్ 10 ఏళ్ల వయసులో తినడం మానేశారు. ఆమె స్వంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఎలాంటి ఆహారాన్ని తీసుకోలేదు, అయినా కూడా ఆరోగ్యంగానే వుంటోంది. తన చదువును పూర్తి చేసుకొని ఉద్యోగం చేస్తోంది. తరువాత ఆసుపత్రికి వెళ్లి ఎన్ని పరీక్షలు చేయించుకున్నప్పటికీ తనకు ఎలాంటి సమస్య లేదని, అరోగ్యం నార్మల్‌గానే వుందని వైద్యులు చెబుతున్నారు. కడుపులో ఏ ఆహారాన్ని కూడా తాము కనుగ్గొనలేదు, కానీ అలా తినకుండా ఎలా బ్రతకగలుగుతుందో తమకు అర్థం కావడం లేదని వైద్యులు చెప్పారు.
గతంలో చాలా సార్లు ములువర్క్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కేవలం ఒకే ఒక్కసారి తిన్నట్టు ములువర్క్ చెప్పింది. గత 16 సంవత్సరాల నుంచి ఏమీ తినకుండా ఉండడం వల్ల తనకు బాత్‌రూం వెళ్లే అవసరం కూడా రాలేదంటోంది. కేవలం స్నానం చేయాడానికి మాత్రమే తాను బాత్‌రూం ఉపయోగిస్తానంటోంది. ఆమెకున్న సమస్య ఇథియోపియా ప్రధాని వరకు వెళ్లింది. ఆయన కూడా ఈమె పరిస్థితిని గమనించి పరీక్షించడానికి దుబాయ్ పంపించారు. వైద్యులకు కూడా ఈమెకు ఉన్న సమస్య అంతుపట్టడం లేదు. తనకున్న సమస్యను దేవుడికి వదిలేస్తున్నానని, ఇక తన చేతుల్లో ఏమీ లేదంటోంది.

కొందరు ఆహారం తినకుండా కేవలం నీరు పానియాలు తాగి, లేదా కనీసం నీరు తాగైనా దశాబ్దాలపాటు అలాగే వుంటారు. కానీ ములువర్క్ కేసులో పూర్తిగా భిన్నంగా వున్న విషయాన్ని పరిగనణలోకి తీసుకోవాలి. 16 సంవత్సరాల నుంచి ఆహారం మాత్రమే కాదు నీరు కూడా తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గిన్నిస్ రికార్డుల ప్రకారం ఒక మనిషి ఎలాంటి ఆహారం, నీరు లేకుండా 18 రోజుల పాటు మాత్రమే జీవించగలడు. గిన్నిస్ రికార్డుకు సంబంధించిన వారు కూడా ములువర్క్ పరిస్థితిని చూసి షాక్‌కు గురౌతున్నారు. సమాధానం దొరకని అనేక మిస్టరీల్లో ములువర్క్ కూడా ఒకటని అనుకోవచ్చు.
ఏమీ తినకుండా ఉన్నప్పటికీ ములువర్క్ శరీరంలో ఉన్న అవయవాలు ఎలా పనిచేస్తున్నాయ్. వాటికి బలం ఎక్కడి నుంచి వస్తుంది. రక్త ప్రసరణకు కావాల్సిన శక్తి, గ్లూకోజ్, నీరు ఎక్కడి నుండి అందుతున్నాయ్. శరీరం పెరగాలంటే కొవ్వు పదార్ధాలు, వైటమిన్లు తప్పనిసరిగా ఉండాలి. అవన్నీ ములువర్క్‌కు ఎలా అందుతున్నాయనేది అతి పెద్ద మిస్టరీగా అనుకోవచ్చు.
మనుషుల్లో ఇలా వింత లక్షణంతో ఉన్నవారు కూడా వుంటారు. ప్రకృతికి విరుద్ధంగా కూడా కొన్ని జరుగుతుంటాయ్. 10 ఏళ్ల వయసులో తినడం మానేసిన ములువర్క్ ఎలా బ్రతకగలుగుతుంది. వీటన్నింటికి సమాధానాలను వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారు. ములువర్క్‌లా మనుషులు ఎక్కువ సంఖ్యలో గనక వుంటే అప్పుడు పరిస్థితి ఊహించుకుంటే మొత్తం తలకిందులయ్యే అవకాశం వుంది.



Click it and Unblock the Notifications