Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Guinness Records : 69 మందికి జన్మనిచ్చిన మహిళ..! అసాధ్యమంటున్న వైద్యులు..!
ఒక మహిళ సహజంగా ఇక బిడ్డకు జన్మనివ్వాలంటే 9 మాసాల సమయం పడుతుంది. అంటే సుమారుగా 1 సంవత్సరం అని అనుకోవచ్చు. ప్రస్తుుత జీవన పరిస్థితుల్లో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నవారు చాలా మంది ఉన్నారు. ఒక్క బిడ్డకు కూడా జన్మనివ్వలేక అనేకమంది దంపతులు బాధపడుతున్నారు. అలాంటిది ఒక మహిళ 69 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఆమె పేరే వాలంటీనా వస్సిల్‌యేవా. రష్యాకు చెందిన వాలంటీనా వస్సిల్‌యేవా అసలు 69 మంది పిల్లలకు ఎలా జన్మనిచ్చింది. ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గిన్నిస్ రికార్డు
ప్రపంచంలో ఎక్కువ మందికి జన్మనిచ్చిన తల్లిగా ఎవ్వరికి కూడా సాధ్యం కాని రికార్డును సాధించి వాలంటీనా గిన్నిస్ రికార్డులోనూ స్థానం సంపాదించుకుంది. వాలంటీనా 18వ శతాబ్దంలో పుట్టారు. ఆమె భర్త ఫీడర్ వస్సిల్‌యేవ్ కలిసి ఈ 69 మంది సంతానానికి తల్లిదండ్రులయ్యారు.

కవలలు ఎక్కువ
69 మందికి జన్మనిచ్చిన ఆ తల్లి వాలెంటీనా వస్సిస్‌యెవా 1707లో రష్యాలోని శుయా నగరంలో రైతు కుటుంబంలో ఆమె జన్మించింది. అయితే 69 మందిని ఎలా ప్రసవించిందని చాలా మంది షాక్‌కు గురికావచ్చు. అయితే వాలంటీనా చాలా మార్లు కవలలకు, ముగురు పిల్లలకు, కొన్ని సార్లు ఒకేసారి నలుగురిని ప్రసవించింది. అప్పటి పరిస్థితుల్లో వైద్య సదుపాయాలు సరిగ్గా లేకపోయినా ఇంత మందికి ఆరోగ్యంగా జన్మనివ్వడం ఆశ్చర్యకర విషయంగా వైద్యులు పరిగణిస్తున్నారు.
27 సార్లు ప్రసవం
ప్రతీ డెలివరీ కూడా సురక్షితంగానే జరిగింది. కేవలం ఇద్దరు పిల్లలు మాత్రమే ప్రసవసమయంలో చనిపోయారు. వాలంటినీ 16 సార్లు కవలలకు జన్మనిచ్చింది, 7 సార్లు ముగ్గురికి ఒకసారి జన్మనిచ్చింది. ఇక 4 మార్లు నలుగురు పిల్లలు ఒకేసారి జన్మించారు. ఇలా ఒకేసారి ముగ్గురు, నలుగురికి జన్మనివ్వడం అదీ చాలా సార్లు జరగడంతో గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. మొత్తం తన జీవితంలో 27 సార్లు ప్రసవించి 69 పిల్లలకు తల్లైంది.
ఆశ్చర్యంలో వైద్యులు
అయితే ఇదంతా కట్టుకథేనని దీంట్లో నిజం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. వైద్యవిభాగంలో పనిచేసిన వారు ఈ కేసును చూసి ఆశ్చర్యపోతున్నారు. రష్యాలో 18వ శతాబ్దంలో ఉన్న వైద్య సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుంటే ఇలా జరగడం అసాద్యం అని రష్యా ప్రముఖ వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
గిన్నిస్ రికార్డ్ సంస్థ గిన్నిస్ రికార్డ్ టైటిల్‌ను అందించేప్పుడు అన్నీ పరిశీలించి, వాస్తవాలను ఆధారాలతో బేరేజీ వేసుకున్న తరువాతే గిన్నిస్ రికార్డ్ అవార్డును బహూకరిస్తుంది. వాలంటీనా విషయంలో కూడా అదే జరిగి ఉంటుంది.



Click it and Unblock the Notifications