Latest Updates
-
బ్రెడ్ లేకుండానే అదిరిపోయే శాండ్ విచ్.. ఇలా చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
2026 జూన్ 2: శని సంచారంతో ఈ రాశుల వారికి కెరీర్, ఆర్థిక స్థితిగతుల్లో ఊహించని మార్పులు, అదృష్టం! -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి భారీ అదృష్టం.. మీ రాశి ఉందా? - మంగళవారం, 02 జూన్ 2026 -
సన్ స్క్రీన్ ఎంత రాయాలో తెలుసా? చర్మ నిపుణులు చెబుతున్న సీక్రెట్ ఇదే! -
కొబ్బరి నీళ్లు స్ట్రాతో నేరుగా తాగుతున్నారా? అయితే ఈ ప్రాణాంతక నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
భార్యా భర్తలు పక్కపక్కన కూర్చుని ఫోన్లు చూస్తున్నారు ఈ దృశ్యం మీ ఇంట్లోనూ ఉందా? -
చికెన్ లవర్స్ కు పండుగే.. రెండు రకాల సాస్ లతో అదరగొట్టే బ్యాంగ్ బ్యాంగ్ చికెన్.. -
బయట దొరికేలాగే.. ఇంట్లోనే ఆరోగ్యకరమైన రెడ్ సాస్ పాస్తా ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారు! -
బాధ పెడుతున్నా వదిలిపెట్టలేకపోతున్నారా? మనస్తత్వ శాస్త్రం చెప్పే కారణం ఇది -
నోరూరించే రొయ్యల కొబ్బరి గ్రేవీ.. రెస్టారెంట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా!
స్త్రీలు స్నానం చేయకుండా ఈ పనులు చేస్తే లక్ష్మీ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది
సంతోషకరమైన, సాఫీగా సాగిపోయే జీవితం కావాలానే అందరూ కోరుకుంటారు. అందుకోసమే కష్టపడతారు, తాపత్రయ పడతారు. హాయిగా, ఏ బాదరాబందీ లేకుండా, కష్టనష్టాలు ఎదురవకుండా ఉండాలని దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు. పూజాది కార్యక్రమాలు చేయడం, మొక్కులు చెల్లించుకోవడం, ఇంట్లో పూజలు నిర్వహించడం, తీర్థయాత్రలకు వెళ్లడం లాంటివన్నీ.. జీవితంలో ఏ లోటు లేకుండా హాయిగా, సంతోషంగా జీవించాలన్న కోరికతో చేసేవే.
అయితే కొన్ని తెలిసీ తెలియక చేసే తప్పుల వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి.. ఆయా తప్పులను నివారించడం ముఖ్యం. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఇంట్లో స్త్రీలు సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుదీరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి స్త్రీలు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

కొందరు మహిళలు ఇతర పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఉదయం వేళ స్నానం చేయరు. స్నానం చేయకుండానే చాలా పనులు చక్కబెట్టేస్తుంటారు. అయితే కొన్ని రకాల పనులను స్నానం చేయకముందే చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. ఆ పనులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
డబ్బు ముట్టుకోవద్దు:
డబ్బును, సంపదను లక్ష్మీదేవికి ప్రతిరూపంగా పరిగణిస్తారు. అందుకే డబ్బు కింద పడ్డా, కాళ్లు తగిలినా మొక్కుతుంటారు. అలా లక్ష్మీ దేవికి ప్రతిరూపమైన డబ్బును స్నానం చేయకముందు ముట్టుకోవద్దని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహిస్తుందట. లక్ష్మీదేవి ఆగ్రహం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. దరిద్రం వస్తుంది. అందుకే స్త్రీలు ఉదయం వేళ నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాతే పనులు ప్రారంభించాలని పెద్దలు చెబుతుంటారు. స్నానం చేయకముందు డబ్బు ముట్టుకోవద్దని అనడం వెనక కారణం ఇదే.
స్నానం చేయకుండా తులసిని తాకొద్దు:
తులసీ మొక్క లక్ష్మీ దేవికి ప్రతిరూపం. ఇంట్లోని తులసి పెంచడం, పూజించడం చాలా పవిత్రమైన కార్యంగా భావిస్తారు. రోజూ ఉదయం పూజ చేసిన అనంతరం తులసి మొక్కకు నీరు పోయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం స్నానం చేసిన తర్వాత పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని తులసి మొక్కకు నీళ్లు పోయాలి. ఇది నియమం.
సాయంత్రం వేళ నీళ్లు పోసే ముందు కూడా శుభ్రంగా కాళ్లు, చేతులు కడుక్కొని బొట్టు ధరించి అనంతరం తులసి మొక్కకు నీళ్లు పోయాలి. స్నానం చేయకుండా తులసికి నీళ్లు పోయడం, తులసి ఆకులను తాకడం నిషిద్ధం. ఇలా చేయడం వ్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు.
జుట్టు దువ్వడం:
తలస్నానం చేసే ముందు జుట్టు దువ్వుకుంటున్నారా.. చాలా మంది తలస్నానం చేసే ముందు జుట్టు దువ్వుకుంటుంటారు. కానీ ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో జుట్టు విరబూసుకుని దువ్వుకోవడం వల్ల దారిద్ర్యం వస్తుందని అంటారు. ఇలా చేయడం ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని అంటారు. అందుకే స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత మాత్రమే జుట్టు దువ్వుకోవాలని శాస్త్రం చెబుతోంది.
వంటగదిలోకి వెళ్లడం:
ఈ రోజుల్లో స్నానం చేయకుండానే వంటగదిలోకి వెళ్లడం, అల్పాహారం చేయడం లాంటివి చేస్తున్నారు. ఉదయం వేళ నిద్రలేచి స్నానం చేశాకే వంటగదిలోకి వెళ్లి వంట చేయాలంటే శ్రమతో కూడుకున్న వ్యవహారం కావడంతో చాలా మంది స్నానం చేయకుండానే వంట మొదలు పెడుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం నిషిద్ధం. వంటగదిలోని పొయ్యిని లక్ష్మీ దేవిగా చూస్తారు. అలాంటిది స్నానం చేయకుండానే పొయ్యిని వెలిగిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సిందే.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications