Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
లండన్ వీధుల్లో లుంగీ యువతి.. వీడియో వైరల్..!
లుంగి డ్యాన్స్ లుంగి డ్యాన్స్ పాట ఎంత పాపులారిటీ సాధించుకుందో మనకు తెలిసిందే. ఈ పాటలో లుంగీ విలువ ొమత్తం ప్రపంచానికి తెలిసిపోయింది. ఇక లుంగీలతో ఎన్నో స్టంట్లు, షోలు, ప్రయోగాలు ఎన్నో వచ్చాయ్. అయినా లుంగీ క్రేజ్ తగ్గలేదు. లుంగీని పైకి ఎత్తే స్టైల్ ఆ సీన్ అదిరిపోతుంది. సరిగ్గా ఇలాంటిదే ఒక దృష్యం నెటిజన్లను ఆకట్టుకుంది. లండన్ వీధుల్లో వాలెర్ దానియా అనే ఓ తమిళ యువతి లుంగీ కట్టుకొని వీడియో చేయడంతో అది పోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
లుంగీ మన భారతీయ సంస్కృతిని ముఖ్యంగా దక్షిణ భారతీయ సంస్కృతిని చాటి చెబుతుంది. ఫ్యాషన్‌లో కూడా లుంగీకి మించింది ఉన్నదా అని ఒక సారి ఆలోచించుకోవచ్చు. లుంగీపై టీ షర్ట్ వేసి కళ్లజోడు పెట్ట లండన్ వీధుల్లో తిరుగుతున్న వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. వీడియో అపలోడ్ అయిన కొన్ని గంటల్లోనే వేల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

లుంగీ చరిత్ర తెలిస్తే షాక్ కావాల్సిందే
సాధారణంగా లుంగీని తెలుగువారి కంటే తమిళవారే ఎక్కువగా ధరిస్తుంటారు. తెలుగువారు పడుకునే ముందు మాత్రమే లుంగీని ఎక్కువగా ధరిస్తే తమిళవారు మాత్రం అన్ని పనులకు, అన్ని వేళల్లో లుంగీనే ధరిస్తూ వుంటారు. ఒక లుంగీ సైజు సుమారుగా 79 ఇంచుల పొడవుంటుంది. తమిళనాడులో మాత్రమే కాదు లుంగీని మరింత ఎక్కువగా ఉపయోగించేది బంగ్లాదేశ్‌లో. ఇది వేసుకున్న తరువాత ఇచ్చిన కంఫర్ట్ ఇంకేది ఇవ్వదని లుంగీ ప్రియుల అభిప్రాయం. బంగ్లాదేశ్ లోనే కాదు మయన్నార్, శ్రీలంక, ఇండొనేసియాలో కూడా లుంగీకి చాలా ప్రాముఖ్యతు వున్నాది.
సాధారణంగా లుంగీ కాటన్‌లో వుంటుంది. సిల్క్‌లో కూడా అందుబాటులో వుంటుంది. ఎన్ని సంవత్సరాలైనా లుంగీని మాత్రం విడిచిపెట్టడం లేదు. కొన్ని సంస్కృతులు కాలం మారుతున్నా కొద్దీ మారుతుంటాయ్. బట్టలు వేసుకునే విధానంలో కూడా మార్పు వస్తుంది. కానీ లుంగీ విషయంలో భిన్నంగా వుంది.
లుంగీ ధోతి ఒకటి కాదు
కొంత మంది లుంగీ ధోతీని కలిపి చెబుతారు. కానీ రెండింటికీ చాలా వ్యత్యాసం వుంది. పూర్వ కాలంలో పురాణ కథల్లో మనం ధోతీ పద్ధతిని చూడవచ్చు. కానీ లుంగీ విధానానని తక్కువగా చూస్తాము. లుంగీ కట్టుకునే విధానం కూడా ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా వుంటుంది. పశ్చిమ బెంగాళ్‌లో కుడి పక్క నుండి లుంగీని కట్టుకుంటే తమిళనాడులో ఎడమపక్క నుంచి కట్టుకుంటారు. కేరళలో లుంగీల రంగా చాలా బ్రైట్ గా వుంటుంది, బంగ్లాదేశ్‌లో ఎక్కువగా చెక్స్ డిజైన్ లుంగీలను వేసుకుంటారు. లుంగీ కట్టుకునే విధానం, దాని రంగు, బట్టను బట్టి వారు ఏ రాష్ట్రానికి చెందిన వారో సులభంగా చెప్పేయవచ్చు. బంగ్లదేశ్, శ్రీలంకలో లంగీని ప్రతీ రోజు ధరిస్తారు.
చోళ రాజుల కాలంలో లుంగీ పుట్టిందని చరిత్ర చెబుతుంది. బహుశా చోలులే ఈ లుంగీ సంస్కృతిని ప్రవేశపెట్టి వుంటారు.
లుంగీ శరీర ఆరోగ్యం
నేటి కాలంలో జీన్స్, ఇతర టైట్‌స్కిన్‌ల వల్ల వీర్యకణాలు దెబ్బతింటున్నాయని పరిశోధకలు చెబుతున్నారు. తమిళనాడు, కేరళ, బంగ్లాదేశ్ లో చాలా మంది పురుషులకు ఈ సమస్య వుండకపోవచ్చు, బహుశా వారు లుంగీలే ఎక్కువగా వేసుకోవడం వల్ల ఉందవచ్చు.



Click it and Unblock the Notifications