Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Women’s Day 2025 Wishes: మనసుకు హత్తుకునేలా తెలుగులో ఉమెన్స్ డే విషెస్ ఈ విధంగా తెలపండి!
ఈ సృష్టికి మూలం ఆడది. ఆ ఆడదే లేకపోతే ఈ సృష్టే లేదని అంటుంటారు. తల్లిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా, బిడ్డగా అన్ని విధాలుగా స్త్రీలు మగాడి విజయంలో, జీవితంలో, మగాడి మనుగడలో కీలకమైన, ఉన్నతమైన పాత్ర పోషిస్తున్నారు. సాధారణ మనుషులకే కాదు.. దేవతలకు సైతం ధైర్యం, శక్తి.. ఒక ఆడదే. అలాంటి స్త్రీ నేడు ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప స్థానాలను అధిరోహిస్తోంది. దేశాన్ని నడిపిస్తోంది. పెద్ద పెద్ద కంపెనీలకు బాస్‌గా రాణిస్తోంది. ఎంతోమందికి జీవనోపాధిని కలిపిస్తోంది.
వారు మాత్రమే కాదు.. వంట గదిలో ఉండే ప్రతి స్త్రీ కూడా గొప్పదే. భర్త బయటికెళ్లి సంపాదిస్తే భార్య ఇంట్లోని వ్యవహారాలను చక్కదిద్దుతూ భర్త విజయంలో భర్త సంపాదనలో ఆమె తోడుగా నిలబడుతుంది. ఈ ప్రపంచంలోని ఆడవాళ్ళందరూ ఎంతో గొప్పవాళ్లే. వారి త్యాగం వెలకట్టలేనిది. వారి ప్రేమ అంతులేనిది. వారి విశ్వాసం అపారమైనది. అలాంటి ఆడవాళ్లకు ఓ రోజు ఉంటుంది. నేడు అంతర్జాతీయ మహిళల దినోత్సవం. అలాంటి రోజున, మీ తల్లికి, చెల్లికి, అక్కకు, భార్యకు, బిడ్డకు, మనసుకు హత్తుకునేలా.. మీలోని ప్రేమ ఉట్టిపడేలా కింద ఇచ్చిన విధానంగా మహిళల దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయండి.

మహిళల దినోత్సవ శుభాకాంక్షలు తెలుగులో
ప్రతి మహిళా ధైర్యానికి, సహనానికి, ప్రేమకు, త్యాగానికి ప్రతిరూపం. మహిళలు లేనిదే ఈ సృష్టి లేదు. మహిళలు లేనిదే రేపటి తరం లేదు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని మహిళలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
మహిళలు సమాజంలో అన్ని రంగాలలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. వారి శక్తి సామర్థ్యాలకు నా శత సహస్ర వందనాలు.
మహిళలందరికీ మంచి ఆరోగ్యం, సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ... మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
అమ్మ, సోదరి, భార్య, బిడ్డగా.. ఇంకా ఎన్నో రూపాల్లో ప్రేమను పంచే మహిళను గౌరవిద్దాం. ఆమెకు ఏ కష్టం రాకుండా కాపాడుకుందాం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు మీ జీవితంలో మరెన్నో విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నాను.
మహిళలు ఈ ప్రపంచానికి వెలుగు. వారిని గౌరవించడం, ప్రేమించడం మనందరి బాధ్యత. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
మహిళలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు మీ కలలను సాకారం చేసుకోవాలని కోరుకుంటున్నాను.
మహిళలు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. వారిని ఎల్లప్పుడూ గౌరవించాలి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
మహిళలు ఈ ప్రపంచానికి ఒక వరం. వారిని ప్రేమించడం, సంరక్షించడం మనందరి కర్తవ్యం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
మహిళలు ధైర్యానికి, శక్తికి, ప్రేమకు, త్యాగానికి ప్రతిరూపం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
మహిళలు లేనిదే ఈ ప్రపంచం లేదు. మహిళలను గౌరవించడం, ప్రేమించడం మనందరి బాధ్యత. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
మహిళలు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. వారిని ఎల్లప్పుడూ గౌరవించాలి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
ఈ సృష్టికి, మన జీవితానికి మూలం మహిళ. అమ్మగా ప్రేమను పంచుతుంది. సోదరిగా తోడుగా ఉంటుంది. భార్యగా జీవితాన్ని ఇస్తుంది, బిడ్డగా బాధ్యతలను గుర్తుచేస్తుంది. అన్ని రంగాల్లో, అన్ని విధాలుగా మనలో భాగం అవుతుంది. అలాంటి మహిళలందరికీ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు



Click it and Unblock the Notifications