Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం: ఎయిడ్స్ గురించి కొన్ని ఆసక్తికర నిజాలు.. ప్రజల్లో ఉన్న అపోహలు ఇవే!
ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీని ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఎయిడ్స్ దినోత్సవాన్ని "సరియైన మార్గంలో వెళ్దాం: నా ఆరోగ్యం, నా హక్కు'' అనే నినాదంతో జరుపుకుంటున్నారు. ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు, ఎయిడ్స్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఈ స్టోరీలో ప్రజల్లో ఎయిడ్స్‌పై ఉన్న అపోహలు, ఎయిడ్స్ గురించి తెలియని కొన్ని నిజాల గురించి తెలుసుకుందాం.
ఎయిడ్స్ చికిత్స లేని వ్యాధి..
ఎయిడ్స్ అనేది ఒక చికిత్స లేని వ్యాధి. ఈ వ్యాధికి ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా చికిత్సను కనుగొనలేదు. ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి రక్తాన్ని మరొక వ్యక్తికి ఎక్కించడం ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. అలాగే వ్యాధి ఉన్న వ్యక్తికి వేసిన సూదులను మరొక వ్యక్తికి వేయడం వల్ల.. అలాగే ఎయిడ్స్ ఉన్న వ్యక్తితో లైంగిక సంబంధంలో పాల్గొనడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. అయితే ఈ ఎయిడ్స్‌ను కొన్ని జాగ్రత్తలు పాటిస్తే నివారించొచ్చు. అవేంటో కింద తెలుసుకుందాం.

ముందుగా శరీరంపై ఎయిడ్స్ ప్రభావం ఎంతంటే?
ఒక వ్యక్తికి HIV సోకినప్పుడు అది శరీరంలోని జీవ కణాలపై దాడి చేస్తుంది. దీని కారణంగా ఎయిడ్స్ సోకిన వ్యక్తులు చాలా తొందరగా అనారోగ్యానికి గురవుతారు. జ్వరం, జలుబు, ఏదైనా రోగాలకు గురి కావడం ఎయిడ్స్ సోకిన వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే ఎయిడ్స్ సోకిన వ్యక్తులు సరైన చికిత్స, సరైన జీవన విధానంతో వ్యాధి సోకిన 15-20 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించగలరనే ఉదాహరణలు కూడా ఉన్నాయి.
ఎయిడ్స్ లక్షణాలు ఏమిటి?
ఎయిడ్స్ సోకిన వ్యక్తిలో కనిపించే లక్షణాలు మరొక వ్యక్తిలో కనిపించకపోవచ్చు. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఈ లక్షణాలు మారుతూ ఉంటాయి. అయితే సాధారణంగా ఈ వ్యాధి సోకిన వ్యక్తుల్లో రాత్రుల్లో చెమటలు పుట్టడం, కండరాల నొప్పులు, గొంతు నొప్పి, జ్వరం, చలి, దద్దుర్లు, అలసట, కండరాల నొప్పులు, శోషరస గ్రంథుల వాపు, నోటి పూతలు వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.
ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
గర్భిణీ స్త్రీకి హెచ్‌ఐవి సోకినట్లయితే , నవజాత శిశువుకు హెచ్‌ఐవి సంక్రమించకుండా ఉండటానికి డాక్టర్ ఆమెకు హెచ్‌ఐవి మందుని సిఫారసు చేస్తారు, అయితే అసురక్షిత శృంగారంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా పాల్గొనకూడదు. శృంగారంలో పాల్గొనే ముందు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కండోమ్స్ వాడాలి. అయితే ప్రజల్లో ఎయిడ్స్‌పై కొన్ని అపోహలు ఉన్నాయి. అవేంటంటే?
ఎయిడ్స్ రోగిని తాకడం వల్ల వ్యాపిస్తుంది..
ఎయిడ్స్ ఉన్న రోగిని తాకడం వల్ల ఇంకొక వ్యక్తికి ఆ రోగం సోకె అవకాశం ఉందని ప్రజల్లో ఓ అపోహ ఉంది. అయితే ఈ అపోహలో ఎలాంటి నిజం లేదని అర్ధం చేసుకోవాలి. HIV ప్రత్యక్షంగా రోగిని తాకడం వల్ల సోకదు. రక్తం, వీర్యం, యోని ద్రవం శారీరక ద్రవాల మార్పిడి ద్వారా వ్యాపిస్తుంది.
HIV దోమల ద్వారా వ్యాపిస్తుంది
ఈ ఎయిడ్స్ అనేది దోమల వల్ల కూడా వ్యాపిస్తుందనే అపోహ ప్రజల్లో ఉంటుంది. అయితే ఈ వైరస్ దోమల వల్ల వ్యాపించదు. వైరస్ కీటకాలలో మనుగడ సాగించదు, కాబట్టి దోమలు ఒక వ్యక్తి నుండి మరొకరికి వైరస్‌ను వ్యాప్తి చేయవు.
ఎయిడ్స్‌ని చూడగానే గుర్తించవచ్చా?
ఎయిడ్స్‌ను చూడగానే గుర్తించలేము. ఒక వ్యక్తికి సోకిన వెంటనే ఆ వ్యక్తికి రోగం ఉందని మీరు చెప్పలేరు. సాధారణ పరీక్షలు మాత్రమే వైరల్ సంక్రమణ లక్షణాలను గుర్తించగలవు.
కొందరికి మాత్రమే ఈ వ్యాధి సోకుతుంది?
ప్రజల్లో ఈ అందరికీ సోకదు, కొందరికి మాత్రమే సోకుతుందనే వార్త ప్రచారంలో జరుగుతుంటుంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. తరగతి, లింగం, లైంగిక ధోరణితో సంబంధం లేకుండా అందరికీ ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
HIV నిరోధించడానికి ఏమి చేయాలి?
HIV లేని వ్యక్తులు HIV వైరల్ ఇన్‌ఫెక్షన్‌ను నివారించడానికి ప్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ (PrEP) మందులను పరిగణించాలి. అలాగే రెగ్యులర్ చెకప్ చేయిస్తూ ఉండాలి. దీంతో పాటు లైంగిక చర్యల్లో పాల్గొనేటప్పుడు కచ్చితంగా కండోమ్ వినియోగించాలి.



Click it and Unblock the Notifications











