Latest Updates
-
Sunday Recipe: చికెన్ ముక్క.. మసాలా చిక్క..ఆహా అనిపించే పంజాబ్ స్టైల్ చికెన్ గ్రేవీ -
గ్యాస్ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టే హెల్తీ టమాటా పొంగల్.. బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే.! -
మద్యపానం కొందరికి వ్యసనమైతే.. మరికొందరికి ఎందుకు కాదు.. సన్నీడియోల్ అనుభవం ఇదే.! -
సొంత రాశిలోకి శుక్ర గ్రహ సంచారం: ఈ నాలుగు రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో అదృష్టం -
నేపాల్ వరదల్లో చేతివాటం.. మృతదేహం నుంచి బంగారం చోరీ.. వైరల్ వీడియో.! -
సగ్గుబియ్యంతో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. మెత్తగా, స్పాంజీలా నోట్లో వేస్తే కరిగిపోయేలా కమ్మనైన దోశలు.! -
చుండ్రు సమస్యతో పాటు జుట్టు ఎక్కువగా రాలిపోతుందా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
గుండె ఆరోగ్యంతో పాటు బరువును అదుపులో ఉంచే చట్నీ.. వారానికి ఒక్కసారైనా డైట్లో ఉండాల్సిందే.! -
రెస్టారెంట్ స్టైల్ టేస్టీ స్టార్టర్.. ఇంట్లోనే ఈజీగా స్పైసీ చిల్లీ ఎగ్.. ఎలా చేయాలంటే.! -
కిచెన్‌లో ఉండే ఈ చిన్న ఐటం.. అజీర్తి సమస్యే కాదు బరువును సైతం తగ్గిస్తుందని తెలుసా.?
World cycle day 2026: ప్రపంచ సైకిల్ దినోత్సవం.. ఈ ఏడాది ప్రత్యేక థీమ్ ఇదే.!
ప్రతి యేటా జూన్ 3న 'ప్రపంచ సైకిల్ దినోత్సవం’గా ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తోంది. ప్రతి యేటా ఒక ప్రత్యేక థీమ్‌తో ప్రపంచానికి సందేశం అందిస్తూ సైక్లింగ్‌పై అవగాహన కల్పిస్తోంది. కాగా, ఈ ఏడాది 'పచ్చని భవిష్యత్తు కోసం సైక్లింగ్’ అనే థీమ్‌తో ఐక్యరాజ్యసమితి.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సిద్ధంగా ఉంది.

ఒకప్పుడు రవాణాకి సైకిల్ కీలకంగా భావించే ప్రజలు.. ఈ కాలంలో వాటిని మరుగునపడేశారు. ఉరుకుల పరుగుల జీవితంలో టైంకి గమ్య స్థానాలకు చేరుకునేందుకు ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో బైక్ లేదా కారు తప్పనిసరి. అయితే ఇప్పుడు ఆ పెట్రోల్ లేని వాహనాలే ఇప్పుడు మళ్లీ మన జీవితాల్లోకి ప్రవేశించాయి.
సైకిల్ వినియోగానికి దూరమై ఇంధన వాహనాలు రోడ్లపై టైర్లు మోపాక.. పర్యావరణం కలుషితమైంది. వాహనదారుల్లో ఊబకాయం పెరిగింది. ఫలితంగా బరువు తగ్గించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. వ్యాయామం, ఎక్సర్‌సైజ్‌తో పాటు సైక్లింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. కాళ్లకి పనిచెబుతూ ఒంట్లోని కేలరీలను తగ్గించుకునేందుకు సైక్లింగ్ ఎంతో కీలకం. సైక్లింగ్ చేయడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజానాలున్నాయి.
ఆరోగ్య ప్రయోజనాలు
ప్రతిరోజూ క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. అధిక బరువుతో బాధపడుతున్న వారికి శరీరంలోని కేలరీలను సులభంగా కరిగించి, ఊబకాయం బారి నుంచి కాపాడుతుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మానసికంగా ఉల్లాసంగా చేసేలా చేస్తుంది. సైక్లింగ్ ద్వారా కాళ్లు, నడుము కండరాలు దృఢంగా మారతాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

వారాంతపు కార్యక్రమాలు
ఈ క్రమంలో సైకిల్ తొక్కడం ద్వారా కలిగే ఆరోగ్య, పర్యావరణ ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు వారాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు, పోలీసుల ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. సైకిల్ మారథాన్, 2k వాక్ మారథాన్, వారంలో ఒక రోజు 'నో వెహికల్ డే’, సైకిల్ ర్యాలీ ఇలా పెట్రోల్ వాహనాలకు విరామం ఇస్తూ శరీరానికి పనిచెప్పేలా ఆసక్తికర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పని ఒత్తిడిలో అలసిపోయిన ఐటీతో పాటు నాన్ ఐటీ ఉద్యోగులు ఈ ఈవెంట్‌లలో ఉత్సాహంగా పాల్గొంటారు.
ప్రధానంగా దేశంలోని మెట్రో పాలిటన్ నగరాల్లో పర్యావరణ హితం, ఇంధన పొదుపుతో పాటు పని ఒత్తిడిలో పెరిగే ఊబకాయాన్ని, మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఈ సైక్లింగ్ కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. మొదటగా 2018 ఏప్పిల్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ.. జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. దీని వెనుక యూఎస్‌కి చెందిన పోలిష్ సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ లెస్జెక్ సిబిల్స్కి కృషి చాలా ఉంది. ఆయన చేసిన విస్తృత ప్రచారం కారణంగా సైకిల్ దినోత్సవం ఏర్పాటైంది. దాదాపు 57 దేశాలు ఇందుకు మద్దతు తెలపడంతో ప్రపంచ సైకిల్ దినోత్సవం ప్రతి యేటా ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నాం.
ఈ ఏడాది కూడా ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకోండి. పర్యావరణ అనుకూలంగా ఉండే ఎలాంటి విషవాయువులను విడుదల చేయని సైకిల్‌తో ఉండే ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించండి. అత్యంత చౌకగా ఉండే ఈ రవాణా సాధనంతో వాహనాల రద్దీని నియంత్రించడంతో పాటు శబ్ద కాలుష్యాన్ని సైతం తగ్గించవచ్చు.



Click it and Unblock the Notifications