Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
World Environment Day 2024 : ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు ! అనుక్షణం మనల్ని పరిరక్షిస్తున్న ప్రకృతి !
మన ఇళ్లు మాత్రమే కాదు ప్రకృతి కూడా మనకు ఇళ్లు లాంటిదే. ప్రకృతిని కాపుడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా వుంది. మన తల్లే కాదు, పుట్టిన దగ్గరి నుంచి మరణించే వారకు మనల్ని కంటికి రెప్పలా కాపాడేది ప్రకృతే. ప్రకృతి దేవుడు లాంటిది. ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది, మన ఆకలి తీరుస్తుంది, మనల్ని భరిస్తుంది. మనకు కావలసిన అన్ని ఆహారాలను, వస్తువులను అందిస్తుంది.
అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అని అంటారు. అడక్కుండానే ప్రకృతి మనకు ఎన్నో అందిస్తుంది. ఎన్ని ఇచ్చినా మనిషి మాత్రం ప్రకృతి పట్ల చాలా కృూరంగా వ్యవహరిస్తున్నాడు. ప్రకృతి వనరులను మానవుడు ధ్వంసం చేస్తున్నారు. చెట్లకు ఎలా పడితే అలా నరికివేస్తున్నాడు. దీని వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతూ వున్నది. ఇప్పుడైనా ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా వుంది. ప్రకృతిని పరిరక్షించుకోవాలి. ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5న జరుపుకుంటాం. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీకు కొన్ని ముఖ్యమైన విషయాలను, పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయబోతున్నాం.
పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు, ఎప్పటి నుంచి జరుపుకుంటూ వస్తున్నాం ?
మొదటి పర్యావరణ దినోత్సవాన్ని 1972లో స్వెడెన్‌లో ఐక్యరాజ్య సమితి సమావేశంలో జూన్ 5న జరుపుకున్నాం. అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం అదే రోజున పర్యావరణ దినాన్ని జరుపుకుంటూ వస్తుంది.
పర్యావరణ దినోత్సవం 2024 థీమ్ ఏంటి ?
పర్యావరణ దినోత్సవం సందర్భగా ప్రతి సంవత్సరం ఒక థీమ్‌ను అంటే ఒక లక్ష్యాన్ని లేదా మోటోను ఏర్పరుచుకుంటారు. అలా ఈ 2024 సంవతసరానికి గానూ భూమిని పునర్ణిన్మించి, ఎడారిని తగ్గించి కరువు లేదకుండా చేయడాన్ని థీమ్ గా పెట్టుకున్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2024 శుభాకాంక్షలు

ఈ భూమిపై పచ్చదనాన్ని పెంచి , కాలుష్యాన్ని తగ్గించి, స్వర్ఘ ధామంగా చేస్తామని ప్రతిఘ్న చేద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు
భూమిని దున్నడం మరిచిపోయామంటే మనల్ని మనము మరిచిపోయినట్టే. వ్యవసాయం ప్రాణం లాంటిది. పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు
ఒక చెట్టు నీడ కింద కూర్చుంటే కలిగి ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అలాంటి ఎన్నో చెట్లను నరికివేస్తండడం చాలా బాధాకరమైన విషయం. పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
ప్రకృతి అనేది మనం సెలవుల్లో వెళ్లి పరిచయం చేసుకునేది, చూసేది కాదు. ప్రకృతి మనం వుంటున్న ఇల్లు లాంటిది, దాన్ని అనుక్షణం బాగా చూసుకోవాలి. పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
భవిష్యత్తు తరాల కోసం ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని ఇద్దాం. హ్యాపి వరల్డ్ ఎన్విరాంమెంట్ డే.
ఈ ప్రకృతిని పరిరక్షిస్తామని మనం ఈ రోజు ప్రతిఘ్న చేద్దాం. పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
మన ప్రతి పుట్టినరోజుకు ఒక కేక్‌ను కట్ చేస్తాం. దానికి బదులుగా వీధుల్లో లేదా ఎక్కడైనా లేదా కనీసం ఇంట్లోనైనా ఒక మొక్కను నాటుదాం. పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
ప్రకృతిని రక్షిస్తే మన ప్రాణాలను మనం రక్షించుకున్నట్టే. పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
ప్లాస్టిక్‌ను తక్కువగా వాడి భూమిని ఊపిరి పీల్చుకోనిద్దాం. అప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా వుంటాం. పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
మన బలం మన ప్రకృతినన్న విషయాన్ని మనం మరిచిపోవద్దు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.



Click it and Unblock the Notifications
