Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
2024లో ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబాలు ఇవే.. అంబానీల స్థానం ఎంతంటే?
ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే ఎలాన్ మస్క్ అని చెబుతాం. అదే ఇండియాలో అత్యంత ధనవంతుడు ఎవరంటే ముకేశ్ అంబానీ పేరును క్షణం కూడా ఆలోచించకుండా చెప్పేస్తాం. అదే కుటుంబం విషయానికి మన దేశంలో అత్యంత సంపన్న కుటుంబం అంబానీ కుటుంబమే. అదే ప్రపంచం విషయానికి వస్తే.. చాలా మంది ధనవంతులు ఉన్నారు. అయితే 2024లో అత్యంత ధనవంతులుగా అవతరించిన కుటుంబం ఏది? ఏ కుటుంబం అగ్రస్థానంలో ఉంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబాలు
వాల్టన్ కుటుంబం
ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబాల జాబితాలో వాల్టన్ కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం వాల్‌మార్ట్ షేర్లలో 80% పెరుగుదల కనిపించడంతో ఆ కంపెనీ సంపద భారీగా పెరిగింది. దీంతో ఆ కుటుంబం సంపద కూడా భారీగా పెరిగింది. దీంతో ఆ కుటుంబం విలువ 172.7 బిలియన్ డాలర్లకు పెరిగి.. ఆ కుటుంబం మొత్తం సంపద 432.4 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల కుటుంబంగా వాల్టన్ కుటుంబం అవతరించింది.

అల్ నహ్యాన్ కుటుంబం
ఈ జాబితాలో రెండో స్థానంలో రాజా కుటుంబమైనా అల్ నహ్యాన్ కుటుంబం ఉంది. ఈ కుటుంబం విలువ 323.9 బిలియన్ డాలర్లు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను పాలిస్తున్న అల్ నహ్యాన్‌లు అరబ్ దేశాల ఆర్థిక వ్యవస్థలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. వీరికి ప్రధాన ఆదాయన వనరుగా చమురు ఉంది. సంవత్సరానికి కొన్ని వందల బిలియన్ డాలర్లు ఈ కుటుంబం సంపాదిస్తున్నారు.
అల్ థానీ కుటుంబం
ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబాల జాబితాలో ఖతార్‌కు చెందిన అల్ థాని కుటుంబం మూడో స్థానంలో ఉంది. ఈ కుటుంబం సంపద 172.9 బిలియన్ డాలర్లు. వీరికి ఆఫ్‌షోర్ గ్యాస్ అనే కంపెనీ ఉండడంతో పాటు చమురు నిల్వలు ఉన్నాయి. వీరిది కూడా రాజ కుటుంబమే. వీరి కుటుంబం ఎనిమిది తరాలుగా విస్తరిస్తూ వస్తోంది. ఒట్టోమన్లు మరియు బ్రిటిష్ వంటి చారిత్రాత్మక సామ్రాజ్యాలను వీరి కుటుంబం ఎదుర్కొంది.
హీర్మేస్ కుటుంబం
ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబాల జాబితాలో ఫ్రాన్స్‌కు చెందిన హీర్మేస్ కుటుంబం నాలుగో స్థానంలో ఉంది. వీరికి లగ్జరీ గూడ్స్ వ్యాపారాలు ఉన్నాయి. ఈ కుటుంబ నికర విలువ 170.6 బిలియన్ డాలర్లు. ఈ కుటుంబంలోని ఆరు తరాలు ఈ బ్రాండ్‌ను కాపాడుకుంటూ వస్తున్నాయి.
కోచ్ ఫ్యామిలీ
ఈ జాబితాలో ఐదో స్థానంలో అమెరికాకు చెందిన కోచ్ కుటుంబం ఉంది. ఈ కుటుంబం నికర విలువ 148.5 బిలియన్ డాలర్లు. వీరికి చమురు, విభిన్న పరిశ్రమల నుంచి వస్తుంది.
ఈ జాబితాలో మన ఇండియాకు చెందిన అంబానీ కుటుంబం ఎనిమిదో స్థానంలో ఉంది. అంబానీకి కుటుంబానికి చెందిన నికర సంపద 99.6 బిలియన్ డాలర్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వారికి ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తుంటుంది. ఈ కుటుంబం మూడు తరాలుగా విస్తరించి, భారతదేశ వ్యాపార రంగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
మిస్త్రీ కుటుంబం
23వ స్థానంలో భారతదేశానికి చెందిన మిస్త్రీ కుటుంబం ఉంది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు చెందిన మిస్త్రీల విలువ 41.4 బిలియన్ డాలర్లు. ఐదు తరాలకు చెందిన వారి వారసత్వం ఈ విలువ కలిగిన సామ్రాజ్యాన్ని నిర్మించారు.



Click it and Unblock the Notifications