Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
World richest begger: వరల్డ్ రిచ్చెస్ట్ బెగ్గర్ మనోడే..ఆస్తులు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్
సాధారణంగా బిచ్చగాడు(begger) అనగానే మన మనసులో మెదిలే రూపం చిరిగిన బట్టలు, రోడ్డు పక్కన చెత్త కుప్పల దగ్గర ఉండటం, చేతులు చాపి అడుక్కునే వ్యక్తి. చేతులు,కాళ్లు సరిగ్గా ఉండి కూడా బెగ్గింగ్ చేసేవాళ్లు మనదేశంలో చాలామందే ఉన్నారు. చేతులు కాళ్లు సరిగ్గా లేనోళ్లు కూడా చాలామంది కష్టపడి పనిచేసి ఆత్మగౌరవంతో బతుకుతుంటారు. అయితే వరల్డ్ బెగ్గర్ అనగానే మీకు ఏం గుర్తుకువస్తుంది? కామన్ గానే అడుక్కోవడం,చిరిగిన బట్టలు వేసుకోవడం అవే గుర్తుకొస్తున్నాయా? అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే. బెగ్గింగ్ అనేది కొంతమందికి ఒక రివార్డింగ్ ప్రొఫెషన్,కోటీశ్వరులను చేసే ఓ వత్తి.
ప్రపంచంలో రిచ్చెస్ట్ బెగ్గర్ క్రెడిట్ మనదేశానికే దక్కింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో అడ్డుక్కుంటూ బతికే భారత్ జైన్(Bharat jain) అనే వ్యక్తి ప్రపంచంలోనే ధనిక బిచ్చగాడి ఘనత సాధించాడు. మనదేశంతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాల్లోని బిచ్చగాళ్లతో పోటీ పడి మరి నెం.1 స్థానానికి చేరుకున్నాడు. బాల్యంలో అనేక ఆర్థిక కష్టాలు అనుభవించాడు భారత్ జైన్. చదువుకోడానికి కూడా స్థోమత లేక చదువు మానేసి అడుక్కోవడం మెదలుపెట్టాడు. తనలాంటి పరిస్థితి తన వారసులకు ఉండకూడదని కష్టపడి అడుక్కుంటూ కోట్లు కూడబెట్టాడు.

భారత్ లోని మిగతా శాలర్డీ ప్రొఫెషనల్స్ కన్నా కూడా ఎక్కువ సంపాదిస్తున్నాడు. నెలకు కనీసం రూ,75000 వరకు భారత్ జైన్ ఆదాయం ఉంది. తాను అడుక్కున్న డబ్బులను అనేక వ్యాపారాలలో పెట్టుబడిగా పెడుతున్నాడు. భారత్ జైన్ ఆస్తుల విలువ 7.5 కోట్లు పైమాటే. ముంబైలో ఎక్కువ రద్దీ ఉండే చత్రపతి శివాజీ టర్మినస్,ఆజాద్ మైదాన్ లో అడుక్కుంటూ ఇంత డబ్బులు సంపాదించాడు.
ముంబైలో ఇతనికి 1.4 కోట్ల విలువైన రెండు ఫ్లాట్ లు,థానేలో రెండు షాపులు ఉన్నాయి. ఈ ప్రాపర్టీల నుంచే నెలకు రూ.30వేలు అద్దె రూపంలో సంపాదిస్తున్నాడు.
భారత్ జైన్ ఇద్దరు కొడుకులు బాగా చదువుకొని ఓ స్టేషనరీ స్టోర్ ని కూడా నడుపుతున్నారు. అయినా కూడా భారత్ జైన్ అడుక్కోవడం ఆపలేదు. దీనికి కారణం తాను జీవితంలో అనుభవించిన కష్టాలు తన కుమారులకు రాకూడదని.
అయితే భారత్ జైన్ జీవిత ప్రయాణం ద్వారా..నువ్వు ఏం పని చేస్తున్నావ్ అన్నది కాదు ఎంత సిన్సియర్ గా హానెస్ట్ గా చేస్తున్నావన్నదే ముఖ్యం అని నేర్చుకోవచ్చు మరి. చేసే పనిని అంకిత భావంతో,ఇష్టంతో చేస్తే విజయం ఏదో ఓ రూపంలో వస్తుందనడానికి భారత్ జైన్ ని ఓ ఉదాహరణగా చూపించవచ్చు.



Click it and Unblock the Notifications