Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
‘ఎలాన్ మస్క్’ ఇక లేరు.. ఇకనుంచి కేకియస్ మాక్సిమస్‌గా మార్పు!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ పరిచయం ఉన్న ప్రతి వ్యక్తికీ ఎలాన్ మస్క్ గురించి తెలిసే ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా పేరున్న మస్క్ ఎన్నో వింత వింత పనులు చేస్తుంటారు. ఆ పనుల కారణంగా ఆయన ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతుంటారు. అయితే తాజాగా మరోసారి ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. ట్విట్టర్‌లో తన పేరును మార్చుకున్నారు.
ఎలాన్ మస్క్ నుంచి కేకియస్ మాక్సిమస్‌గా మార్చుకున్నారు. దీంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఆయన వైపు చూడడం మొదలుపెట్టింది. అసలు మస్క్ తన పేరును ఎందుకు మార్చుకున్నారు? దానికి గల కారణాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కేకియస్ మాక్సిమస్ అంటే ఎవరు?
ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తన పిల్లలకు వింత వింత పేర్లు పెట్టి వార్తాల్లో నిలిచారు. తాజాగా తనకు తానే కేకియస్ మాక్సిమస్ ఏం ఓ వింత పేరు పెట్టుకున్నారు. అసలు కేకియస్ మాక్సిమస్ ఎవరంటే? అది ఒక క్రిప్టో కరెన్సీ పేరు. ఇటీవలే క్రిప్టో మార్కెట్‌లో చెప్పుకోదగ్గ కాయిన్‌గా పేరు సంపాదించుకుంది. ఇది ఒక మేమే కాయిన్. ఇది డిసెంబర్ 27 నాటికి 0.005667 వద్ద ట్రేడ్ అవుతుండగా.. గత 24 గంటల్లో ఎలాన్ మస్క్ కారణంగా 497.56% పెరిగింది.
విలువ పెరిగే అవకాశం
క్రిప్టో కరెన్సీలో ఎలాన్ మస్క్‌ను హర్షద్ మెహతాలా పేర్కొంటుంటారు. గతంలోనూ ఆయన డోజ్ కాయిన్ విలువను కూడా అమాంతం పెంచేశారు. దానిని ఒక గొప్ప కాయిన్‌గా మార్చారు. ఇప్పుడు అదే మాదిరిగా కేకియస్ కాయిన్‌ను చేయాలని చూస్తున్నారు. ఆ మాదిరిగానే ఆ కాయిన్ కేవలం 24 గంటల్లో తన ఆల్ టైం గరిష్టాన్ని తాకింది. దీంతో దీని ధర మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ కాయిన్ విలువ 810% పెరిగింది.
మస్క్ పేరు మార్పు దేనికి సంకేతం?
అమెరికాలో జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఎలాన్ మస్క్ క్రిప్టో కరెన్సీకి కొంత దూరం పాటించారు. క్రిప్టోపై ఆంక్షలు విధించడం, క్రిప్టోను బ్యాన్ చేయడం వంటి అంశాల నేపథ్యంలో ఆయన క్రిప్టోను వదిలేశారనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ట్రంప్ అధికారంలోకి రావడంతో క్రిప్టోలో తన హవాను చూపేందుకు ఆయన తన పేరును మార్చుకున్నారని తెలుస్తోంది. అలాగే ఇన్వెస్టర్లకు సూచనలు ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనకు తెలియాల్సి ఉంది.



Click it and Unblock the Notifications