Latest Updates
-
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం!
World Snake day 2022: స్నేక్ డే ప్రాముఖ్యత. అసలెందుకీ రోజు
ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల పాములు కనిపిస్తాయి. దాదాపు భూమిపై 3 వేల 500లకు పైగా పాము రకాలు ఉన్నట్లు అంచనా.
World Snake day 2022: ఈ రోజు పాముల రోజు. ప్రతి ఒక్కదానికి ఏదో ఒక రోజు ఉన్నట్టే.. పాములకు ఈ రోజు ఉంది. జులై 16 ప్రపంచ పాము దినోత్సవాన్ని జరుపుకుంటారు. పాములపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు. పాములపై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎవరైనా పాములను చూడగానే భయంతో వాటిని కొట్టి చంపేస్తున్నారు. అవి ఏమాత్రం హాని తలపెట్టకముందే వాటి ప్రాణాలు తీసేస్తున్నారు చాలా మంది. దీనిని ఆపడంలో భాగంగా వరల్డ్ స్నేక్ డేను జరుపుతున్నారు.

అవగాహన కోసం స్నేక్ డే
పాముల్లో ఉన్న జాతులు, వివిధ రకాలు, వాటి లక్షణాలు, వాటిలో ఎన్ని రకాల్లో విషం ఉంటుంది ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించేందుకు వరల్డ్ స్నేక్ డే నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జులై 16ను ఎంచుకున్నారు.

పాములు ఎన్నిరకాలు
ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల పాములు కనిపిస్తాయి. దాదాపు భూమిపై 3 వేల 500లకు పైగా పాము రకాలు ఉన్నట్లు అంచనా. వీటిలో దాదాపు 600లకు పైగా పాముల్లో విషం ఉంటుంది. అంటే కేవలం 25 శాతం పాముల్లోనే విషం ఉంటుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మిగతా వాటిలో ఎలాంటి విషం ఉండదు. అయితే మనుషులపై దాడి చేసే పాములు కేవలం 200లకు పైగా ఉంటాయి. మనకు కనిపించే వాటిలో విషం ఉండేవి, విషం లేనివీ ఉంటాయి. పాము రకాన్ని బట్టి అది కాటు వేస్తే ప్రమాదం ఉంటుందా.. లేదా అనేది తెలుసుకోవచ్చు.

పాముల ప్రాధాన్యం
మనుషుల్లాగే పాములు కూడా పర్యావరణ వ్యవస్థకు అనివార్యమైనవి. ప్రకృతిలో ఏ జీవి లేకపోయినా ఆహార వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. పాములు అంతరించిపోతే అంతే సంగతులు. ఎందుకంటే.. పాములు లేకపోతే కప్పలు, పొలాల్లో ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దీని వల్ల పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అదే సమయంలో పాములను తినే ఇతర జాతులపైనా ప్రభావం పడుతుంది. ఇలా ఒకదానికొకటి ఇబ్బందులు ఎదుర్కొంటాయి.
స్నేక్ డే నేపథ్యం
చైనీస్ జ్యోతిష్యం ప్రకారం పాములను శక్తి, గొప్పతనం, గౌరవం, అదృష్టం, విజయానికి ప్రతీకగా భావిస్తారు. చైనీయులు పాముల పట్ల అత్యంత గౌరవాన్ని ప్రదర్శిస్తారు. హిందూ గ్రంథాల ప్రకారం మనకు ఒక పాము రూపంలో (కుండలిని పేరుతో) ఒక ఆదిమ శక్తి ఉంటుంది. ఇది స్థిరమైన అభ్యాసంతో, మూల చక్రం (తోక ఎముక ఆధారంగా) నుండి అన్ని చక్రాలను (పవర్ డిస్క్‌లను) దాటి పోతుంది.అత్యున్నత చక్రానికి (శిరస్సు పైభాగంలో ఉన్న కిరీటం లేదా సహస్రార చక్రం) చేరుకోవడానికి విముక్తికి దారి తీస్తుంది.

పాముల గురించి మరికొన్ని విషయాలు
భూమిపై దాదాపు 3,500 వరకు పాములు ఉన్నట్లు అంచనా.
* బార్బడోస్ థ్రెడ్ పాము నైట్‌క్రాలర్ కంటే 4 అంగుళాల పొడవు తక్కువగా ఉంటుంది.
* గ్రీన్ అనకొండ అత్యంత బరువైన పాము
* రెటిక్యులేటెడ్ పైథాన్ పొడవైన పాము
* అరిజోనా బ్లాక్ రాటిల్‌స్నేక్స్ (క్రోటలస్ సెర్బెరస్) కూడా ఊసరవెల్లి మాదిరిగానే వయసు పెరిగేకొద్దీ రంగులో మార్పులు వస్తాయి.ఇవి చాలా స్నేహంగా ఉంటాయి.
* అత్యంత విషపూరితమైన పాము కింగ్ కోబ్రా
* రెండో విషపూరితమైనది రెటిక్యులేటెడ్ పైథాన్
* భూమిపై ప్రతి ఒక్క చోటా పాములు ఉన్నాయి. సముద్రం లోపల, అడవుల్లోృ, మంచు ప్రాంతాల్లోనూ పాములు ఉన్నాయి.
* పాములు ఆహారాన్ని మింగేస్తాయి. అవి ఆహారాన్ని నమలలేవు.
* పాములు వాటి కంటే పెద్దగా ఉండే జీవుల్ని కూడా మింగేస్తాయి తల కంటే ఎక్కువ పరిమాణమున్న జంతువులను ఈజీగా మింగేస్తాయి.
* దాదాపు 30 శాతం పాములు గుడ్లు పెట్టవు.
* పాములకు కనురెప్పలు ఉండవు. బ్రిల్లే అనే సన్నటి గాజు లాంటి పొర ఉంటుంది. అది కనురెప్పలా పని చేస్తుంది.

పాములను పెంచుకోవచ్చా?
కొందరు పాములను పెంపుడు జంతువులుగా పెంచుతారు. ఇది కొంచెం కష్టమే అయినప్పటికీ కొందరు ముచ్చట పడి మరీ పెంచుకుంటారు.
పాములను వేటాడటం అనేది మానుకోవాలి. పాములను చంపితే వాటి సంఖ్య తగ్గిపోతుంది. పాములు అంటే మనుషులకు ఎంత భయమో.. మనుషులు అంటే పాములకు కూడా అంతే భయం. మనుషులు ఎదురైనప్పుడు.. పాములు పారిపోయేందుకే ప్రయత్నిస్తాయి. కానీ మనుషులు భయపడి, వారికి హాని చేస్తాయేమోనని భావించి వాటిని కొడతారు. కర్రలతో కొట్టి చంపేస్తారు. ఇలా పాములను చంపొద్దని పలు స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తున్నాయి.



Click it and Unblock the Notifications











