Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Expensive Ice Cream: ఈ ఐస్‌క్రీమ్ ధర రూ.5 లక్షల పైమాటే.. గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన ఐస్‌క్రీమ్
వేసవికాలం చల్లని నోట్లో వేయగానే కరిగిపోయే ఐస్‌క్రీమ్ అంటే చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. దీనికి చిన్నా పెద్దా అనే తేడాలేం లేకుండా ప్రతి ఒక్కరూ లొట్టలేసుకుని తింటుంటారు. ఎర్రటి ఎండల్లో చల్లటి ఐస్‌క్రీమ్ తింటే ఆ మజానే వేరు. కప్ ఐస్‌క్రీమ్ రూ.10 నుండి మొదలై రూ.25, రూ.50 అలా ఫ్లేవర్ ను బట్టి ధర ఉంటుంది. పెద్ద పెద్ద ఐస్‌క్రీమ్ పార్లర్లు, రెస్టారెంట్లలో ధర ఇంకొంత ఎక్కువుంటుంది. కానీ జపాన్ లో ఓ ఐస్‌క్రీమ్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే. 100, 200 కాదు ఏకంగా ఆ ఐస్‌క్రీమ్ ధర అక్షరాలా రూ. 5 లక్షల పైమాటే.

ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్ సెలాటో ఐస్‌క్రీమ్ ఇది:
జపాన్ కు చెందిన ప్రముఖ ఐస్ క్రీమ్ బ్రాండ్ సెలాటో కంపెనీ ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్ క్రీమ్ ను తయారు చేసింది. ఈ ఐస్‌క్రీమ్ తయారీలో ప్రత్యేక పదార్థాలు వాడినట్లు కంపెనీ చెబుతోంది. అలా దీని ధర ఊహలకు కూడా అందనంతగా 8,73,400 జపాన్ యెన్‌లుగా కంపెనీ నిర్ణయించింది. అంటే మన లెక్కల ప్రకారం ఆ ఐస్‌క్రీమ్ ధర అక్షరాల రూ.5.2 లక్షలు.
వైట్ ట్రఫుల్‌తో ఐస్‌క్రీమ్ తయారీ:
సెలాటో కంపెనీ తయారు చేసిన ఈ ఐస్‌క్రీమ్ లో వైట్ ట్రఫుల్ అనే అత్యంత అరుదైన పదార్థాన్ని వాడారు. దీనిని ఇటలీలోని ఆల్బా నుండి తెప్పించారు. ఈ ట్రఫుల్ ధర కిలోకు 2 మిలియన్ జపనీస్ యెన్ లు ఉంటుందని సెలాటో కంపెనీ చెబుతోంది. అంటే మన కరెన్సీలో రూ. 11.9 లక్షలన్నమాట. ఆల్బాలో మాత్రమే ఈ వైట్ ట్రఫుల్ దొరుకుతుంది. దీని సువాసన చాలా ప్రత్యేకంగా ఉంటుందట. ఈ ట్రఫుల్ ఖరీదు కావడంతో ఈ ఐస్‌క్రీమ్ ధరను భారీగా నిర్ణయించింది సెలాటో. అలా ఇది అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్ గా గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ ఐస్‌క్రీమ్ కు సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన అధకారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టుచేసింది.



Click it and Unblock the Notifications