Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
వాడి పడేసిన టీ పొడితో ఇన్ని లాభాలా? తెలిస్తే ఇంకోసారి పడేయరు!
ప్రతి ఇంట్లో టీ తాగుతూ ఉంటారు. చాలా మందికి టీతోనే రోజు మొదవలవుతుంది. టీతోనే రోజు గడుస్తుంది. ఇంకొదరికైతే మూడు పూటలా అన్నం లేకపోయినా పర్వాలేదు కానీ, టీ మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. టీ చేసిన తరువాత వడగట్టిన టీ పొడిని చెత్త కుండీలో పడేస్తూ ఉంటారు. అయితే ఈ వాడి పడేసిన టీ పొడితో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు తెలుసుకుంటే ఇంకోసారి టీ పొడిని పడేయరు కూడా. అవేంటి చూద్దాం రండి..
ఎరువుగా ఉపయోగించుకోవచ్చు:
వాడేసిన టీ పొడి మంచి ఎరువుగా ఉపయోగపడుతుందని మీకు తెలుసా? అవునండి.. ఈ టీ పొడిలో మంచి పోషక విలువలు ఉన్నాయి. ఇవి.. మొక్కలకు కావాల్సిన శక్తి సామర్ధ్యాలను అందిస్తాయి. ఈ టీ పొడిని మొక్కల మట్టిలో కలిపి వేయడం వల్ల.. మొక్కలు ఆరోగ్యంగా, వేపుగా పెరుగుతాయి. తమలపాకు, కరివేపాకు మొక్కలు ఈ టీ పొడిని వేస్తే మంచి ఫలితం లభిస్తుంది.

క్లీనింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు:
వాడి పడేసిన టీ పొడిని అద్దాలు, కిటికీలు, గాజు వస్తువులు తుడిచేందుకు వినియోగించుకోవచ్చు. అందుకోసం వాడేసిన టీ పొడిని మరొకసారి బాగా మరిగించుకోవాలి. అనంతరం మరిగించిన ఆ టీ పొడితో గ్లాస్ కిటికీలు, గాజు వస్తువులను తుడుచుకుంటే మిలమిలా మెరిసిపోవడం ఖాయం.
జుట్టుకు మేలు చేస్తుంది:
ఈ టీ పొడిని జుట్టు సంరక్షణలో కూడా వినియోగించుకోవచ్చు. ఈ టీ పొడిని జుట్టుకు రాసుకుంటే, జుట్టు నల్లగా, నిగనిగలాడేలా మెరిసిపోతుంది. అంతేకాకుండా ఈ టీ పొడిని మెహందిలో కూడా కలిపి రాసుకోవచ్చు. దీని కారణంగా మంచి ఫలితం పొందవచ్చు. అలాగే టీ పొడిని మరిగించి.. ఆ నీరు చల్లారాక జుట్టు కడుక్కుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.
దోమలను అరికడుతుంది:
ఈ టీ పొడి ఇంట్లోకి దోమలు రాకుండా కూడా అరికడుతుంది. మిగిలిన టీ పొడిని.. నీటిలో బాగా మరిగించి, మళ్ళీ వడకట్టాలి. అనంతరం ఆ టీ పొడిని.. ఈగలు, చీమలు, దోమలు, పురుగులు ఎక్కువగా వచ్చే ప్రదేశంలో రుద్దితో ఆ దోమలు, క్రిమికీటకాలను ఇంట్లోకి రాకుండా అరికట్టొచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం మేరకు మాత్రమే మీకు అందించబడుతుంది. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications