Latest Updates
-
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు!
Zero Shadow Day: ఈరోజు బెంగళూరులో నీడ కనిపించదట! ఎందుకో తెలుసా?
ఆకాశంలో ఎన్నో వింతలకు వేదిక. రోదసిలో జరిగే కొన్ని వింతలను ఆస్వాదించాలే తప్పా కారణాలు కూడా తెలుసుకోవడం చాలా కష్టం. ఎప్పుడూ ఏదో ఒక వింత మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూనే ఉంటుంది. అలాంటి మరో వింత ఇప్పుడు బెంగళూరు వాసులు ఎక్స్‌పీరియన్స్ చేయనున్నారు.
జీరో షాడో డే గా పిలిచే ఈ వింత సరిగ్గా ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం 12.17 నిమిషాలకు జరగనుంది. పగలు కాగానే నీడ మాయం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎండలో నిలబడినప్పుడు మన నీడ భూమిపై పడుతుంది. అయితే ఈ రోజు ఈ సమయంలో మాత్రం ఆ నీడ కనిపించదట.

జీరో షాడో డే అంటే ఏంటంటే..:
జీరో షాడో డే సమయంలో మనుషులు, ఇతర ప్రాణులు, వస్తువుల నీడ కనిపించదని ఆస్ట్రానామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా చెబుతోంది. దీనినే జెనిత్ పొజిషన్ అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం రెండు సార్లు ఇలా జరుగుతుంది.
కర్కాటక, మకరరేఖల మధ్యనున్న ప్రాంతాల్లోనే జీరో షాడో డేను ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చు. జీరో షాడో సమయంలో సూర్యుడు నడి నెత్తిపై ఉంటాడు. అంటే సూర్యుడిని అక్షాంశం, భూమిపై ఉండే మనుషుల అక్షాంశం సమాంతరంగా ఉంటాయి. సూర్యుడు నడి నెత్తిపై ఉన్నప్పుడు మనిషి నీడ కాళ్ల కిందే ఉంటుంది. అలా నీడ కనిపించదన్నమాట.
జీరో షాడో డే ఎలా జరుగుతుంది?
భూమి సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో 23.5 డిగ్రీల మేర వంగిపోతుంది. ఈ సమయంలో భూమిపై వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయి. కర్కాటక, మకర రేఖల మధ్యనున్న ప్రాంతానికి సూర్యుడు నిట్టనిలువన ఉంటాడు. ఆ సమయంలో ఆ ప్రదేశంలో ఉన్న మనుషుల నీడి కనిపించదన్నమాట.
ఇలా సంవత్సరంలో రెండు సార్లు జరుగుతుంది. ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయనంలో మరోసారి ఈ జెనిత్ పొజిషన్ ఏర్పడుతుంది. సరిగ్గా చెప్పాలంటే సూర్యుడు మకరరాశి, కర్కాటక రాశి మధ్య +23.5, -23.5 డిగ్రీల ఆక్షాంశాల మధ్య ఉన్నప్పుడు ఈ జీరో షాడో డే ఏర్పడుతుంది.
FAQs
1. జీరో షాడో డే అంటే ఏంటి?
జీరో షాడో డే అనేది భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి రెండు సార్లు సంభవించే ఖగోళ వింత.
2. జీరో షాడో డే ఎప్పుడు జరుగుతుంది?
సూర్యుడు నేరుగా తలపైకి వచ్చినప్పుడు జీరో షాడో డే ఏర్పడుతుంది.
3. జీరో షాడో డే ఎప్పుడెప్పుడు జరుగుతుంది?
జీరో షాడో డే సంవత్సరానికి రెండుసార్లు సంభవిస్తుంది. ఉత్తరార్ధగోళంలో ఒకసారి, దక్షిణార్ధగోళంలో ఒకసారి జీరో షాడో డే జరుగుతుంది.



Click it and Unblock the Notifications
