Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
పిల్లలు సృజనాత్మకంగా, చురుకుగా ఉండాలంటే రోజూ ఈ పనులు చేయండి
వేసవి సెలవులు ముగిశాయి. మళ్లీ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. ఇన్ని రోజులు హ్యాపీగా గడిపేసిన పిల్లలు తిరిగి బడి బాట పట్టాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు స్కూళ్లకు వెళ్లడం అంటే చాలా మంది పిల్లలు పెద్దగా ఇష్టం చూపించరు. పిల్లలను మానసికంగా, శారీరకంగా చురుకుగా ఉంచడం చాలా ముఖ్యం. అన్ని వయసుల పిల్లలు కొన్ని పనులు చేసేలా వారిని ప్రోత్సహించాలి, అలాగే తల్లిదండ్రులు కూడా చేయాలి. వాటి వల్ల పిల్లలు మానసికంగా, శారీరకంగా చురుకుగా తయారవుతారు.
1. కలిసి చదవాలి:
పుస్తక పఠనం పిల్లల ఊహ, భాషా నైపుణ్యాలు, కాగ్నిటివ్ డెవెలప్‌మెంట్ ను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. చిన్న పిల్లల కోసం బొమ్మల పుస్తకాలు, పెద్ద వారి కోసం వారికి నచ్చిన పుస్తకాలను కలిసి చదువుకునేలా ప్లాన్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ప్రశ్నలు అడగడం, చివర్లో కథ గురించి అడగడం ద్వారా వారి పార్టిసిపేషన్ ను ప్రోత్సహించవచ్చు.

2. అవుట్‌డోర్ ప్లే:
పిల్లల ఆరోగ్యానికి అవుట్ డోర్ ప్లే చాలా ముఖ్యం. ఆరుబయట శారీరక శ్రమలో పాల్గొనడం ద్వారా శారీరకంగా చురుకుగా ఉంటారు. ఆటలు, సైకిల్ తొక్కడం, పార్కులో నడవడం వంటివి చేయాలని వారిని ప్రోత్సహించాలి.
3. సృజనాత్మక సమయం:
డ్రాయింగ్, పెయింటింగ్, క్రాఫ్ట్ లు లేదా బ్లాక్‌లను నిర్మించడం వంటి సృజనాత్మక కార్యకలాపాల్లో పిల్లను నిమగ్నం చేయాలి. ఇవి వారిలో సృజనాత్మక నైపుణ్యాలను పెంచుతాయి. చక్కటి మోటార్ నైపుణ్యాలు పెరుగుతాయి. ఊహా శక్తిని మెరుగుపరుస్తుంది.
4. కుటుంబంతో కలిసి తినడం:
కుటుంబ సమేతంగా కలిసి తినడం మంచి అలవాటు. దీని వల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధం బలోపేతం కావడమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించవచ్చు. కనీసం రోజులో ఒక పూట కలిసి భోజనం చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ సమయంలో ఏదైనా పనికొచ్చే విషయం మాట్లాడొచ్చు, ఇంకేదైనా చేయవచ్చు.
5. పనులు, బాధ్యతలు:
ఇంటి చుట్టుపక్కల వయస్సుకు తగిన పనులు, బాధ్యతల్లో పిల్లలను నిమగ్నం చేయాలి. ఇది వారికి ఆర్గనైజేషన్, టీమ్ వర్క్, జవాబుదారీతనం వంటి ముఖ్యమైన జీవిత నైపుణ్యాలను నేర్పుతుంది. గదిని చక్కబెట్టడం, టేబుల్‌ను అమర్చడం, లాండ్రీలో సహాయం చేయడం వంటి పనులను అప్పగించాలి.
6. నాణ్యమైన సమయం:
పిల్లలతో ఎప్పుడూ నాణ్యమైన సమయాన్ని గడపాలి. బోర్డ్ గేమ్‌లు ఆడటం, కుటుంబ సమేతంగా వాకింగ్ కు వెళ్లడం, సినిమాకు వెళ్లడం, వారికి ఇష్టమైన హాబీలలో పాల్గొనడం వంటి కార్యకలాపాల ద్వారా వారితో నాణ్యమైన సమయాన్ని గడపాలి. ఈ సమయం మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications