Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
బిజీగా ఉన్నారని పిల్లల లంచ్ ఇవి పెట్టడం చాలా డేంజర్..తల్లి తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఇదే!
పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి పోషకాలు కలిగిన ఆహరం అందించడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా స్కూల్ పిల్లలకు సరైన ఆహరం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ మధ్య కాలంలో పిల్లలకు సరైన ఆహారం ఇవ్వడం అనేది తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారింది. సరైన ఆహారం లేకపోతే వారి శారీరక మరియు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాంటి సందర్భంలో తల్లిదండ్రులు ఆహారం ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి.
తమ ఉద్యోగంతో పాటు ఇతర పనుల కారణంగా పిల్లలకు సరైన ఆహరం అందించడంలో తల్లిదండ్రులు విఫలమవుతుంటారు. అందుకే వారి లంచ్ బాక్సులో ఇష్టమొచ్చిన ఆహరం పెట్టేస్తుంటారు. కానీ అలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ పిల్లల లంచ్ బాక్సులో ఎలాంటి ఆహరం పెట్టకూడదు. అలా పెట్టడం వలన వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇన్‌స్టంట్ నూడుల్స్:
పిల్లలు తరచుగా ఇన్‌స్టంట్ నూడుల్స్ కోరుతుంటారు. అయితే, లంచ్ బాక్స్‌లో నూడుల్స్ పెట్టటం మంచిది కాదు. ఉదయం తయారు చేసిన నూడుల్స్ మధ్యాహ్నం తినడానికి ఏమాత్రం బాగుండవు. అందులో అధిక ప్రాసెస్ చేసిన పిండి, ఉంటాయి. ఇవి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. వాటి బదులుగా ఇంట్లో తాజాగా తయారుచేసిన ఆహారాన్ని ఇవ్వడం మంచిది.
వేయించిన స్నాక్స్:
కచోరి, సమోసా, చిప్స్, పకోడాలు వంటి వేయించిన స్నాక్స్ పిల్లలకు, పెద్దలకూ ఎంతో ఇష్టమైనవి. కానీ వీటిని లంచ్ బాక్స్‌లో పెట్టడం మంచిది కాదు. ఈ ఆహారాల్లో అధిక నూనె, కొవ్వు ఉండడం వల్ల, పెరుగుతున్న పిల్లల ఆరోగ్యానికి హానికరం. ఈ ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల వారు బరువు పెరుగుతారు. అందుకే, వీటికి బదులు ఇంట్లో తయారుచేసిన ఆరోగ్యకరమైన ఆహారాలు ఇవ్వడం మంచిది.
మిగిలిన ఆహారం:
కొన్ని సందర్భాల్లో, ఇంట్లో మిగిలిన ఆహారం లేదా ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాన్ని వేడి చేసి పిల్లలకు ఇచ్చేవారు. కానీ, ఇది చాలా ప్రమాదకరం. మిగిలిన ఆహారం మధ్యాహ్నం చెడిపోయి ఉంటుంది. దీనిని తినడం వలన జీర్ణ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వచ్చి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే, పిల్లలకు తాజాగా తయారుచేసిన ఆహారాన్ని ఇవ్వడం ఉత్తమం.
అధిక చక్కెర పదార్థాలు:
పిల్లలు తీపి ఆహారం ఇష్టపడుతారు. కానీ అధిక చక్కెరతో తయారైన ఆహారాలు వారికి ఇవ్వడం ఏమాత్రం మంచిది కాదు. చాక్లెట్, కుకీస్, క్యాండీ, జెల్లీ వంటి తీపి పదార్థాలు తరచుగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా, బేకరీ పదార్థాల్లో ఉన్న కృత్రిమ చక్కెర, రంగులు, రుచులు ఆరోగ్యానికి హానికరమైనవి. ఈ పదార్థాలు అధికంగా తీసుకుంటే, పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే, వీటికి బదులుగా తాజా పండ్లు లేదా ఇంట్లో తయారుచేసిన ఆహారాలు ఇవ్వడం మంచిది.
ప్యాక్ చేసిన ఆహారం మరియు క్యాన్ డ్రింక్స్:
పిల్లలు కొన్నిసార్లు చిప్స్, బిస్కెట్లు లేదా ఇతర ప్యాక్ చేసిన ఆహారాలు కోరుతుంటారు. కానీ వాటిని లంచ్ బాక్స్‌లో పెట్టడం హానికరం. ఈ ఆహారాలలో కృత్రిమ రంగులు, పామాయిల్, అధిక చక్కెర, మసాలా దినుసులు, ఉప్పు ఉంటాయి, ఇవి పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అలాగే, క్యాన్‌లలో లభించే జ్యూస్‌లు కూడా ఆరోగ్యానికి మంచివి కావు. ఈ సలహాలను పాటించడం ద్వారా పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చి, వారి ఆరోగ్యాన్ని రక్షించవచ్చు.



Click it and Unblock the Notifications
