For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేబీకి జుట్టు పై పెట్టండి.... కాసింత శ్రధ్ధ!

By B N Sharma
|

పిల్లల జుట్టు చాలా మెత్తగా వుంటుంది. వీరి జుట్టుకవసరమైనకొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాలి. జుట్టు పలచగా వున్నా, మందంగా వున్నా, రింగులు తిరిగినా, అసలు జుట్టనేదే లేకున్నా పేరెంట్స్ బేబీ జుట్టుతో ఆటలాడుకుంటారు. బేబీ తలపై జుట్టు లేకుంటే....మమ్మీకి ఎంతో అందోళన. అందుకని కొన్ని చిట్కాలిస్తున్నాం. పరిశీలించండి.

1. బేబీ కి జుట్టు వున్నా లేకున్నా....వారానికి రెండు సార్లు షాంపూ చేయండి. బయటకు వెళ్ళేటపుడు తలను ఎండనుండి కాపాడండి. ఒక టోపి లేదా హేట్ పెడితే స్టైల్ గా కూడా వుంటుంది.

2. బేబీ జుట్టుకి డాండ్రఫ్ లేదా ఇతర సమస్యలుంటే....మాడును సున్నితంగా మర్దన చేయండి. స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్ కొద్దిగా తలకు పెట్టండి.

3. వెంట్రుకల పొడవును బట్టి, బేబీ జుట్టు కడగండి. బిడ్డ పెరుగుతూంటే కనీసం 2 లేదా 3 వారాలకొకసారి జుట్టు షాంపూ చేయాలి.

4. రసాయనాలు లేని బేబీ షాంపూ లు మాత్రమే వాడండి. కళ్ళలో పడితే మండకుండా, నేడు టియర్ ప్రీ షాంపూలు వస్తున్నాయి.

5. బేబీ వెంట్రుకలు కడిగి ఆరిన తర్వాత చిక్కులు పడితే మెల్లగా తీయండి. వెడల్పు పళ్ళుకల దువ్వనలు వాడండి. వీలైతే, బేబీకి ప్రత్యేకంగా ఒక దువ్వెన వుంచండి.

6. బేబీ మాడు చాలా మెత్తన. కనుక దువ్వేటపుడు, కడిగేటపుడు, చిక్కులు తీసేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి.

7. చేతి వేళ్ళతో చిక్కులు తీస్తే బేబీకి హాయిగా వుంటుంది. ఏదైనా మాయిశ్చరైజర్ వాడి వెంట్రుకలు మెత్తబడేయండి.

8. కిందనుండి వెనక్కు లేదా వెనక నుండి కిందకు. దువ్వండి తర్వాత పైకి దువ్వండి.

9. బేబీ కళ్ళలోకి లేదా చెవులలోకి జుట్టు పడకుండా, తేలికగా పైకి దువ్వి వుంచుతూండండి. ఆడ పిల్లలైతే పొడవైన వెంట్రుకలుగా పెంచండి. చిన్న క్లిప్పులు పెట్టండి. పోనీ టెయిల్ కట్టండి.

10. మందంగా, పొడిగా వున్న బేబీ జుట్టుకైతే, కండిషనర్ లేదా బేబీ ఆయిల్ షాంపూ తర్వాత వాడండి. షాంపూ వారానికొకసారి చేయండి. జుట్టు మెల్లగా కుదుళ్లనుండి మాడు వరకు దువ్వండి. వెంట్రుకలు బాగా వత్తుగా రావాలంటే, బాగా పొడవు ఎదగాలంటే వాటిని పూర్తిగా ఒకటి లేదా రెండు సార్లు షేవ్ చేయండి.

English summary

10 Simple Tips On Baby Hair Care! | బేబీకి జుట్టు పై పెట్టండి.... కాసింత శ్రధ్ధ!

If the baby is having less or no hair, shampoo twice a week. Washing baby hair for 3-4 times can make the skin dry and flaky. Try to protect the head when out in the sun. use baby caps or hats. Its is stylish too!
Story first published: Wednesday, September 28, 2011, 15:26 [IST]