For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల సాధారణ ప్రవర్తనలు... పెద్దల ఆనందాలు!

By B N Sharma
|

5 Common Baby Behavioral Patterns
సాధారణంగా పిల్లల ప్రవర్తన 5 రకాలుగా వుంటుంది. పిల్లాడు పుట్టాడంటే తల్లితండ్రుల జీవన విధానంలో మార్పు వస్తుంది. ఎంతో ఆనందం, సంతోషం ఇంటినిండా ఏడుపులు, నవ్వులు, పిల్లలకు చెప్పే మాయమాటలు. వాడికి అర్ధం కాకపోయినా తల్లి తండ్రులు వాడితో మాట్లేడేస్తుంటారు. ఎక్కడో కొద్దిమంది పిల్లలు తప్పించి మిగిలినవారంతా ఒకే ధోరణి కలిగి వుంటారు. పిల్లల ధోరణులు సాధారణంగా ఎలా వుంటాయనేది పరిశీలిద్దాం....

1. ఏడుపే ఏడుపు...ఏడుపనేది పిల్లలకు కామన్. ఆకలికి, అలసటకు, అసౌకర్యానికి లేదంటే ఏం తోచకపోయినా సరే పిల్లలు ఏడుస్తారు. కొంతమంది పగటిపూట, కొంతమంది రాత్రిపూట ఏడుస్తూంటారు. పిల్లలు చాలా సమయం ఏడవకపోతే, పిల్లల వైద్యడిని సంప్రదించండి.

2. నిద్ర....బేబీ సాధారణంగా రోజుకు 20 గంటలు నిద్రిస్తుందని అందరికి తెలిసిందే. అయితే ఇది ఒక అరగంట నుండి 3 లేదా 4 గంటల వరకు కూడా వుంటుంది. కొంతమంది రాత్రిపూట చాలా లేటుగా పడుకుంటారు. పగలు బాగా నిద్రిస్తారు. వీరికి కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిదే.

3. ఆహారం ....పుట్టిన పిల్లల ఆహారపుటలవాట్లు ప్రతిరోజూ మారతాయి. పుట్టిన వెంటనే బలవంతంగా పాలు పట్టాలి. అవసరపడితే నిద్రిస్తున్నా పాలు పట్టాల్సిందే. ఒక్కసారి తాగటం మొదలెడితే ఇక అదే కావాలని ఏడుస్తారు కూడాను. పొట్ట చిన్నదవటంచే కొద్దికొద్ది పాలు ఎక్కువసార్లు పట్టాలి.

4. చూపు....కొంతమంది పిల్లలు దేనిమీదా చూపు నిలపలేరు. వారికి కనపడేదల్లా కదలికలు, బ్లాక్ అండ్ వైట్ నీడలు మాత్రమే. మొదటి నెల తర్వాత కాని వారి కంటి కండరాలపై వారికి పట్టు రాదు. అపుడు అన్నిటిని గుర్తుపడుతుంటారు.

5. ఇతర రకాల పిల్లలు.....వీరు అంతా అర్ధం చేసుకోడానికి ప్రయత్నించేస్తుంటారు. వేళ్ళుబొటన వేళ్ళు చీకుతూంటారు. చేతులు ఆడిస్తారు. కాళ్ళు తరచుగా తన్నటం చేస్తూంటారు. ఇవన్ని సాధారణంగా కొత్తగా పుట్టిన పిల్లలలో చూస్తూనే వుంటాం. ఈ రకంగా మీ బేబీ దాని కండరాలను పెంచుకుంటూంటుంది.

చాలామంది బేబీలలో ఇవి సాధారణంగా వుండే ప్రవర్తనలు. పెద్దగా తేడా వస్తే తప్ప వర్రీ అవాల్సిన పనిలేదు. ఆహారం తీసుకోకపోయినా, యూరిన్ పాస్ చేయకపోయినా, తరచుగా ఆపకుండా ఏడుస్తున్నా గమనించండి. సరి అయిన చర్య చేపట్టండి.

English summary

5 Common Baby Behavioral Patterns | పిల్లల సాధారణ ప్రవర్తనలు... పెద్దల ఆనందాలు!

These are some of the baby behavior patterns that are common in most infants. As said earlier, there is no need to panic, unless you notice a large difference in the baby like not feeding, not passing urine or crying continuously. So, stay alert.
Story first published:Friday, September 23, 2011, 10:37 [IST]
Desktop Bottom Promotion