For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేబీ గుడ్డలు పరిశుభ్రంగా వుండాలంటే....

By B N Sharma
|

7 Tips To Maintain Baby Clothes Hygiene
కొత్తగా తల్లులైనవారు బేబీ గుడ్డల శుభ్రత పట్ల కొంత సమస్యగా భావిస్తారు. బేబీ సున్నిత చర్మానికిగాను మీరు బేబీకి వాడే గుడ్డలపట్ల ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. మెత్తగా, ఆకర్షణగా వున్న గుడ్డలే కాక అవి చాలా శుభ్రంగా వుండేలా చూడాలి. కొత్త తల్లులకు బిడ్డ గుడ్డలు శుభ్రంగా మరకలు లేకుండా వుంచటం కష్టమే. కనుక ఈ అంశంపై కొన్ని చిట్కాలు చూడండి.

1. బేబీకి కొత్త దుస్తులు లేదా గుడ్డలు వాడేటపుడు వాటిని తప్పక వుతకండి. గుడ్డలో తయారీ సమయంలో ఏవైనా రసాయనాలుండేట్లయితే అవి పోతాయి.

2. బేబీ గుడ్డలను వేడి నీటిలో కొంతసేపు నాన పెడితో మరకలు, క్రిములు పోతాయి.

3. బేబీ చర్మం చాలా సున్నితం, ఎంతో పలుచన కనుక మీరు వాడే సోప్ రసాయనాలు లేకుండా ఎంతో మెత్తనిదై వుండాలి.

4. మైల గుడ్డలను వేరుగా వుతకండి. వేడినీటిలో నానపెట్టి శుభ్రం చేయండి.

5. ఉతికిన గుడ్డలను ముడుతలు, లేకుండా ఆకర్షణీయంగా వుంచటానికి ఐరన్ చేయించండి. కొద్దిపాటి సువాసన వచ్చేపదార్ధాలు కలిపినా బాగానే వుంటుంది.

6. గుడ్డలపై మరకలను పొగొట్టటానికిగాను గంజి పెట్టండి. లేదా వినేగార్ ఉపయోగించండి.

7. బేబీ గుడ్డలను ఐరన్ చేస్తే ఉతికిన తర్వాత వాటిలోపలి భాగాలలో వుండే క్రిములుసైతం ఆ వేడికి నశిస్తాయి. కనుక ఐరన్ చేయించటం కూడా మంచిదే.

బేబీ గుడ్డలపై ఇటువంటి చిట్కాలతో శుభ్రత పాటిస్తే బేబీకి చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా వుంటాయి.

English summary

7 Tips To Maintain Baby Clothes Hygiene | బేబీ గుడ్డలు పరిశుభ్రంగా వుండాలంటే....

Use these tips to wash baby clothes and maintain hygiene. Washing newborn clothes is just one step method for hygiene but ironing them will complete the process and protect the baby from skin allergies.
Story first published:Monday, October 10, 2011, 11:45 [IST]
Desktop Bottom Promotion